
ఏనుగులతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి కొంతకాలంగా అడవుల్లోనే అరణ్యవాసిగా ఉంటున్నారు హీరో రానా. ఒకే అడవిలో అనుకుంటే పొరపాటే. ఫస్ట్ థాయ్‌ల్యాండ్ అడవులకు వెళ్లారు. ఆ నెక్ట్స్ కేరళ ఫారెస్ట్‌ని సందర్శించారు. మరి.. ఎలిఫెంట్స్‌తో ఏ విధంగా రానా ఫ్రెండ్‌షిప్ వర్కౌట్ అవుతుందో సినిమాలో చూడాల్సిందే. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా హీరోగా హ్యూమన్‌బీయింగ్ అండ్ ఎలిఫెంట్ బ్యాక్‌డ్రాప్‌లో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం తెలుగు, తమిళ టైటిల్స్‌ను అనౌన్స్ చేశారు చిత్రబృందం. తెలుగులో ‘అరణ్య’ అని, తమిళంలో ‘కాడన్’ అని ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విష్ణు విశాల్ చేస్తున్న పాత్రను హిందీలో పుల్‌కిత్ సామ్రాట్ చేస్తున్నారు. అలాగే జోయా హుస్సేన్, కల్కి కోచ్‌లిన్ మూడు భాషల్లోనూ కనిపించనున్నారు. ఈ సినిమాలో బందేవ్ క్యారెక్టర్ కోసం రానా దాదాపు 15 కేజీల బరువు తగ్గిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా కేరళ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిందీ చిత్రబృందం. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయా లనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment