25 ఏళ్ల తరువాత హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మరైక్కయర్ అరబికడలిన్ సింహం. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భారీ తారాగణమే నటించారు. నటుడు ప్రభు, అర్జున్, బాలీవుడ్ స్టార్ నటుడు సునిల్‌శెట్టి, నటి మంజువారియర్, సుహాసిని, కీర్తీసురేశ్, కల్యాణి ప్రియదర్శన్, ముఖేశ్, నెడుముడి వేణు, అశోక్‌సెల్వన్, బైసల్, సిద్ధిక్, సురేశ్‌కృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇలా మల్టీస్టార్స్ నటించిన ఇందులో ప్రతి పాత్ర గెటప్ చాలా విభిన్నంగా ఉంది.
కాగా ఆశీర్వాద సినిమాస్ పతాకంపై ఆంతోని పెరుంబడవుర్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను వి.క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను పొందారు. ఇక్కడ విశేషం ఏమిటంటే 1996లో అంటే 25 ఏళ్ల క్రితం మోహన్‌లాల్, ప్రభు కలిసి నటించిన కాలాపానీ చిత్రాన్ని ప్రియదర్శన్ తెరకెక్కించారు. అది నటుడు ప్రభు నటించిన తొలి మలయాళ చిత్రం. కాగా ఆ చిత్రాన్ని తమిళంలో నిర్మాత కలైపులి ఎస్.థాను విడుదల చేశారు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
కాగా 25 ఏళ్ల తరువాత అదే మోహన్‌లాల్, ప్రభు కలిసి నటించగా ప్రియదర్శన్‌నే తెరకెక్కించిన మరైక్కయర్ అరబిక్కడలిన్ సింహం చిత్ర తమిళనాడులో కలైపులి ఎస్.థాను విడుదల చేయనున్నారు. అలా హిట్ కాంబినేషన్ రీపీట్ అవుతోంది. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో మరైక్కయర్ అరబిక్కడలిల్ సింగం పేరుతో విడుదల చేయడానికి కలైపులి ఎస్.థాను సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తిరునావుక్కరసు ఛాయాగ్రహణం, రోనీ నబేల్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై విశేష స్పందనను పొందుతోంది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఎవరీ కుంజాలి.. చూసిన వాళ్లు బతికిలేరు’
Comments
Please login to add a commentAdd a comment