
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వివాహం చేసుకున్నారు. తమిళనాడు కళ్లకురిచ్చిలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. కళ్లకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రభు అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. అతి చిన్న వయస్సులో అమ్మ జయలలిత ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ప్రభు గెలిచారు.
త్యాగ దుర్గం మలై కోటైకి చెందిన సౌందర్య ప్రేమలత, ఎమ్మెల్యే ప్రభు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం సౌందర్య తిరుచంగోడులో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అతి తక్కువ మంది అతిథుల మధ్య ఈ జంట ఓ ఇంటివారయ్యారు. ఎమ్మెల్యే ప్రభుకు పలువురు పార్టీ నేతలు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment