
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభుకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే ప్రభు వివాహం చెల్లుతుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరూ మేజర్లే కాబట్లి వివాహానికి అభ్యంతరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, ఈ నెల 5న అన్నా డీఎంకే ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారి పెళ్లి చెల్లదంటూ యువతి తండ్రి కోర్టుకెక్కారు. ఎమ్మెల్యే ప్రభు తమ కుమార్తెని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ.. సౌందర్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెను అప్పగించాలంటూ మద్రాస్ హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అతని పిల్‌ను మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఇదిలాఉండగా.. ప్రస్తుతం సౌందర్య బీఏ ఇంగ్లిష్ రెండో ఏడాది చదువుతున్నారు. ఆమె తండ్రి అదే ఊరిలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. (చదవండి: ‘ఎమ్మెల్యే మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు’)
Comments
Please login to add a commentAdd a comment