Khushbu Shares Emotional Note On Her First Movie With Prabhu - Sakshi
Sakshi News home page

Khushbu: అప్పుడే 32 ఏళ్లు.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: ఖుష్బూ ఎమోషనల్

Published Wed, Apr 12 2023 10:25 AM | Last Updated on Wed, Apr 12 2023 11:00 AM

Khushbu Shares Emotional Note On Her First Movie With Prabhu - Sakshi

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పరిచయ అక్కర్లేని పేరు. అప్పట్లో ఆమె పేరు ఓ  సంచలనం. 1990 ప్రాంతంలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో రజినీకాంత్, కమల్‌ హాసన్, ప్రభు, కార్తీక్‌ వంటి ప్రముఖ హీరోలతో నటించారు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఖుష్బూ నటించారు. 1988లో ధార్మతిన్‌ తలైవా సినిమాలో బాలనటిగా యాక్ట్‌ చేసిన ఆమె ఇప్పటివరకు 200కు పైగా సినిమాలు చేసింది. 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలో ప్రభుకు జోడీగా నటించింది ఖుష్బూ. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. తాజాగా చిన్నతంబి సినిమాను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారామె.

ఖుష్బూ ట్వీట్‌లో రాస్తూ...'చిన్నతంబి సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నా. నాపై కురిపించిన ప్రేమకు ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటా. వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. హృదయాలను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా సర్‌కు.. అలాగే కె.బాలుకి ఎప్పటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నందిని ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. 

(ఇది చదవండి: ప్రాణంగా ప్రేమించుకున్న ప్రభు, ఖుష్బూలు విడిపోవడానికి కారణమిదే: నటి)

కాగా.. ప్రభు, ఖుష్బూ 1993 సెప్టెంబర్‌ 12న వీరి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ ఇదివరకే ప్రభుకు పెళ్లి కావడంతో.. వీరి ప్రేమ పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్‌ సహా అతడి కుటుంబం వ్యతిరేకించారు. దీంతో పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దర్శకనిర్మాత సుందర్‌ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. ప్రస్తుతం ఖుష్బూ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement