khushbhu
-
మీ కోసం నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది: ఖుష్బూ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పరిచయ అక్కర్లేని పేరు. అప్పట్లో ఆమె పేరు ఓ సంచలనం. 1990 ప్రాంతంలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో రజినీకాంత్, కమల్ హాసన్, ప్రభు, కార్తీక్ వంటి ప్రముఖ హీరోలతో నటించారు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఖుష్బూ నటించారు. 1988లో ధార్మతిన్ తలైవా సినిమాలో బాలనటిగా యాక్ట్ చేసిన ఆమె ఇప్పటివరకు 200కు పైగా సినిమాలు చేసింది. 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలో ప్రభుకు జోడీగా నటించింది ఖుష్బూ. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. తాజాగా చిన్నతంబి సినిమాను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారామె. ఖుష్బూ ట్వీట్లో రాస్తూ...'చిన్నతంబి సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నా. నాపై కురిపించిన ప్రేమకు ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటా. వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. హృదయాలను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా సర్‌కు.. అలాగే కె.బాలుకి ఎప్పటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నందిని ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ప్రాణంగా ప్రేమించుకున్న ప్రభు, ఖుష్బూలు విడిపోవడానికి కారణమిదే: నటి) కాగా.. ప్రభు, ఖుష్బూ 1993 సెప్టెంబర్ 12న వీరి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ ఇదివరకే ప్రభుకు పెళ్లి కావడంతో.. వీరి ప్రేమ పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్ సహా అతడి కుటుంబం వ్యతిరేకించారు. దీంతో పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దర్శకనిర్మాత సుందర్‌ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. ప్రస్తుతం ఖుష్బూ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. Just can't believe it's been 32 yrs since #ChinnaThambi took tamil cinema by storm. Will always be indebted for the love showered upon me. My heart will always beat for #PVasu Sir & #Prabhu Sir. Forever grateful to #Illaiyaraja Sir for his soul stirring music n Late #KBalu for… pic.twitter.com/EDxxKwnDaN — KhushbuSundar (@khushsundar) April 12, 2023 -
రమ్యకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో త్రిష, ఖుష్భూ..
Ramya Krishna Celebrates 51st Birthday: ప్రియురాలు, భార్య, తల్లి, అమ్మోరు, భక్తురాలు.. ఇలా కథానాయికగా గ్లామరస్, ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేశారు రమ్యకృష్ణ. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నారామె. ఈ బ్యూటీ తన 51వ పుట్టినరోజు (సెప్టెంబర్ 15)ను కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో ‘బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్’ వంటి చిత్రాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) చదవండి: రమ్యకృష్ణ బర్త్‌డే: రిపబ్లిక్ మూవీ నుంచి విశాఖ వాణి లుక్ సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వకారణం: తలసాని -
లైంగిక దాడి బెదిరింపులకు కుష్బూ కౌంటర్
చెన్నై : నటి, కాంగ్రెస్ నేత కుష్బూపై లైంగిక దాడి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి ఆమె దీటుగా కౌంటరిచ్చారు. తనపై బెదిరింపులకు దిగిన వ్య్తక్తి ఫోన్ నెంబర్ సహా అన్ని వివరాలు సేకరించి వాటిని సోషల్ మీడియా వేదిక ముందుంచారు. తనకు కోల్‌కతా నుంచి సంజయ్‌శర్మ అనే పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చాయని ఈ అంశంపై దృష్టిసారించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కుష్బూ విజ్ఞప్తి చేశారు. కోల్‌కతా పోలీసులు తక్షణమే ఈ వ్యవహారం నిగ్గుతేల్చాలని ఆమె కోరారు. తనకే ఇలా జరిగితే ఇతర మహిళల పరిస్థితి ఏంటో ఆలోచించాలని మమతా బెనర్జీని ఆమె ట్విటర్ వేదికగా అభ్యర్ధించారు. బహిరంగ వేదికపైకి ఆ వ్యక్తిని ఎందుకు లాగుతున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా, బెదిరింపులకు దిగిన వ్యక్తికి కుటుంబం కచ్చితంగా ఉంటుందని తెలుసు..ఇలాంటి వ్యక్తులకు బహిరంగంగానే బుద్ధి చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు. కుష్బూపై తరచుగా మితవాద సానుభూతిపరులు మాటల దాడి చేస్తున్న క్రమంలో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా చెలరేగారున. తాను ముస్లిం అయినందునే తనను రేప్ చేస్తామని తనకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి చెబుతున్నారు..ఇదేనా శ్రీరాముడు పుట్టిన భూమి తనకు వివరించాలని ప్రధాని కార్యాలయాన్ని ఆమె ప్రశ్నించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కంటే మహేష్ బాబునే తాను అభిమానిస్తానని నటి మీరా చోప్రా ఇటీవల చెప్పడంతో తారక్ ఫ్యాన్స్ నుంచి ఆమెకు ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. I have been getting calls threatening for rape from this number. #SanjaySharma name reflects. This call is made from Kolkata. I request @KolkataPolice to kindly look into this immediately. pic.twitter.com/Aqem3pNv48 — KhushbuSundar ❤️ (@khushsundar) August 5, 2020 చదవండి : కుష్బూపై అనుచిత వ్యాఖ్యలు -
పవన్‌తో సినిమా.. స్కూల్‌కి వెళ్లినట్లుంది!
హైదరాబాద్: పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో నటిస్తుంటే చిన్నతనంలో స్కూల్‌కు వెళ్లిన సమయం గుర్తు వస్తోందని నటి ఖుష్భూ చెప్పారు. సోమవారం ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్న ఆమె తన భావాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. షూటింగ్‌కు బయల్దేరుతున్నానని.. పవన్-త్రివిక్రమ్‌ల సినిమా షూటింగ్‌కు వెళ్లడం ఫస్ట్ డే స్కూల్‌కు వెళ్లినట్లు ఉందని తన వాల్లో రాసుకొచ్చారు. నేర్చుకొని చేయాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. ఈ చిత్రంలో కీర్తిసురేశ్, అను ఇమ్మానుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. పవన్ నటిస్తున్న ఈ కొత్త చిత్రంలో ఖుష్భూ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. GM frm hyderabad..I start shooting 4 @PawanKalyan n #trivikram's film 2dy..feels like 1st day at school..lot of unlearning n learning 2 do