లైంగిక దాడి బెదిరింపులకు కుష్బూ కౌంటర్‌ | Khushbu Shames The Person For Giving Rape Threat | Sakshi
Sakshi News home page

దీదీ సాయం కోరిన కుష్బూ

Published Wed, Aug 5 2020 8:53 PM | Last Updated on Wed, Aug 5 2020 8:54 PM

Khushbu Shames The Person For Giving Rape Threat - Sakshi

చెన్నై : నటి, కాంగ్రెస్‌ నేత కుష్బూపై లైంగిక దాడి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి ఆమె దీటుగా కౌంటరిచ్చారు. తనపై బెదిరింపులకు దిగిన వ్య్తక్తి ఫోన్‌ నెంబర్‌ సహా అన్ని వివరాలు సేకరించి వాటిని సోషల్‌ మీడియా వేదిక ముందుంచారు. తనకు కోల్‌కతా నుంచి సంజయ్‌శర్మ అనే పేరుతో బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఈ అంశంపై దృష్టిసారించాలని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కుష్బూ విజ్ఞప్తి చేశారు. కోల్‌కతా పోలీసులు తక్షణమే ఈ వ్యవహారం నిగ్గుతేల్చాలని ఆమె కోరారు. తనకే ఇలా జరిగితే ఇతర మహిళల పరిస్థితి ఏంటో ఆలోచించాలని మమతా బెనర్జీని ఆమె ట్విటర్‌ వేదికగా అభ్యర్ధించారు.

బహిరంగ వేదికపైకి ఆ వ్యక్తిని ఎందుకు లాగుతున్నారని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా, బెదిరింపులకు దిగిన వ్యక్తికి కుటుంబం కచ్చితంగా ఉంటుందని తెలుసు..ఇలాంటి వ్యక్తులకు బహిరంగంగానే బుద్ధి చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు. కుష్బూపై తరచుగా మితవాద సానుభూతిపరులు మాటల దాడి చేస్తున్న క్రమంలో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా చెలరేగారున. తాను ముస్లిం అయినందునే తనను రేప్‌ చేస్తామని తనకు బెదిరింపు కాల్స్‌ చేసిన వ్యక్తి చెబుతున్నారు..ఇదేనా శ్రీరాముడు పుట్టిన భూమి తనకు వివరించాలని ప్రధాని కార్యాలయాన్ని ఆమె ప్రశ్నించారు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ కంటే మహేష్‌ బాబునే తాను అభిమానిస్తానని నటి మీరా చోప్రా ఇటీవల చెప్పడంతో తారక్‌ ఫ్యాన్స్‌ నుంచి ఆమెకు ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే.

చదవండి : కుష్బూపై అనుచిత వ్యాఖ్యలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement