పవన్‌తో సినిమా.. స్కూల్‌కి వెళ్లినట్లుంది! | Shooting for Pawan-Trivikram film is like my first day at school : Khushbhu | Sakshi
Sakshi News home page

పవన్‌తో సినిమా.. స్కూల్‌కి వెళ్లినట్లుంది!

Published Tue, Apr 11 2017 7:12 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్‌తో సినిమా.. స్కూల్‌కి వెళ్లినట్లుంది! - Sakshi

పవన్‌తో సినిమా.. స్కూల్‌కి వెళ్లినట్లుంది!

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో నటిస్తుంటే చిన్నతనంలో స్కూల్‌కు వెళ్లిన సమయం గుర్తు వస్తోందని నటి ఖుష్భూ చెప్పారు. సోమవారం ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న ఆమె తన భావాలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

షూటింగ్‌కు బయల్దేరుతున్నానని.. పవన్‌-త్రివిక్రమ్‌ల సినిమా షూటింగ్‌కు వెళ్లడం ఫస్ట్‌ డే స్కూల్‌కు వెళ్లినట్లు ఉందని తన వాల్‌లో రాసుకొచ్చారు. నేర్చుకొని చేయాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. ఈ చిత్రంలో కీర్తిసురేశ్‌, అను ఇమ్మానుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
పవన్‌ నటిస్తున్న ఈ కొత్త చిత్రంలో ఖుష్భూ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

GM frm hyderabad..I start shooting 4 @PawanKalyan n #trivikram's film 2dy..feels like 1st day at school..lot of unlearning n learning 2 do

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement