సమావేశంలో మాట్లాడుతున్న ఖుష్బూ
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని సినీ నటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూ ఆరోపించారు. జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేశానికి వెన్నుముక అయిన రైతులను విస్మరించార ని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిందన్నారు.
బతుకమ్మ చీరల పంపిణీలో కుంభకోణం జరిగింద ని ఆరోపించారు. మహిళలకు కేవలం 50 రూపాయల చీర లను పంపిణీ చేశారన్నారు. కేసీఆర్ రైతులను పట్టించుకోకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నార ని పేర్కొన్నారు. వైద్యశాలల్లో డాక్టర్లు, సిబ్బంది లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ప్రభుత్వ బడులు మూతబడ్డయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఉత్తమ పాలన అందిస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్‌బిన్ హందాన్, నగర అధ్యక్షుడు కేశ వేణు పాల్గొన్నారు.
సమావేశంలో
మాట్లాడుతున్న ఖుష్బూ
Comments
Please login to add a commentAdd a comment