ప్రచార రథంపై నుంచి మాట్లాడుతున్న కాసులబాల్‌రాజ్
సాక్షి, కోటగిరి: ప్రజలందరు కలిసి ఏకమై ఈఒక్కసారి అవకాశం ఇవ్వాలని బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాసులబాల్‌రాజ్ ఓటర్లను కోరారు. తనను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటు సేవకుడిగా పనిచేస్తానన్నారు. మండలంలోని యాద్గార్‌పూర్, కొల్లూరు, దోమలెడ్గి, సోంపూర్, టాక్లీ, హంగర్గ గ్రామాల్లో సోమవారం కాసులబాల్‌రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు కాసులబాల్‌రాజ్‌కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తే అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ, ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం, డ్వాక్రా మహిళలకు రూ. లక్షా గ్రాంటుతో పాటు వడ్డీలేని రుణాలు రూ. 10 లక్షలు ఇస్తామని, బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 20 శాతం కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు మల్యాద్రిరెడ్డి, కొడాలిరాము, రామకృష్ణారావ్, వేములపల్లిసత్యం, డాక్టర్‌సునీల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారం
వర్ని : మండలంలోని కోటయ్య క్యాంపు, గంగారెడ్డినగర్, లక్ష్మీపూర్ క్యాంపు సోమవారం బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆంశాలను ప్రజలకు వివరిస్తు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా వడ్డేపల్లిలో టీఆర్‌ఎస్ నాయకుడు బీమా శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కార్యక్రమంలో నియోజక వర్గ నాయకుడు మల్యాద్రిరెడ్డి, మండల పార్టీ కన్వీనర్ పండరి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనిపూర్ రాజీరెడ్డి, సెగ్మెంట్ ఉపాద్యాక్షుడు బానోత్ రమేష్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి భారీ, మాజీ జెడ్పీటీసీ రంజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment