kasula balraj
-
పాత హామీలతో మభ్యపెడ్తున్నారు: బాలరాజు
సాక్షి, బాన్సువాడరూరల్:గత ఎన్నికల్లో ఇచ్చిన పాత హామీలనే మళ్లీ మళ్లీ ఇస్తూ టీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని , అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసుల బాలరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని కొయ్యగుట్ట, బోర్లం, దేశాయిపేట్, సోమేశ్వర్, మొగులాన్పల్లి, తిర్మలాపూర్ తదితర గ్రామాలు, తండాల్లో పర్యటించి మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీసీ కోటాలో తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చిందని తనను ఆదరించి గెలిపించాలన్నారు. ఈఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తనను గెలిపిస్తే నాయకునిగా కాకుండా సేవకునిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, బాజాభజంత్రీల నడుమ స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో టీడీపీ నియోజన వర్గ ఇంచార్జి కొడాలి రాము, నాయకులు ప్రతాప్‌సింగ్ రాథోడ్, అలీబిన్ అబ్దుల్లా, శంకర్‌గౌడ్, నర్సన్న చారీ, ఖాలేఖ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలి బీర్కూర్: పరిపాలన చేతకాక కాడి కింద పడేసిన టీఆర్ఎస్ పార్టీని ఓడించి ఇంటికి పంపించాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావ్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రజాకూటమి బాన్సువాడ అభ్యర్ధి కాసుల బాలరాజ్‌కు మద్దతుగా బీర్కూర్ మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజాకూటమి అభ్యర్ధి కాసుల బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు, మల్యాద్రిరెడ్డి మండల నాయకులు అబ్దుల్ హైమద్, పోగు నారాయణ, ఆరీఫ్, ఓంకార్, ఈరాస్ సాయిలు, దొంతురాం కాశీరాం పాల్గొన్నారు. కోటగిరి : కోటగిరి మండల కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ తనయుడు కాసుల రోహిత్ ఎన్నికల ప్రచారం చేశారు. -
ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి: కాసుల బాల్‌రాజ్
సాక్షి, కోటగిరి: ప్రజలందరు కలిసి ఏకమై ఈఒక్కసారి అవకాశం ఇవ్వాలని బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాసులబాల్‌రాజ్ ఓటర్లను కోరారు. తనను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటు సేవకుడిగా పనిచేస్తానన్నారు. మండలంలోని యాద్గార్పూర్, కొల్లూరు, దోమలెడ్గి, సోంపూర్, టాక్లీ, హంగర్గ గ్రామాల్లో సోమవారం కాసులబాల్‌రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు కాసులబాల్రాజ్కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తే అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ, ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం, డ్వాక్రా మహిళలకు రూ. లక్షా గ్రాంటుతో పాటు వడ్డీలేని రుణాలు రూ. 10 లక్షలు ఇస్తామని, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 20 శాతం కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు మల్యాద్రిరెడ్డి, కొడాలిరాము, రామకృష్ణారావ్, వేములపల్లిసత్యం, డాక్టర్సునీల్కుమార్, తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారం వర్ని : మండలంలోని కోటయ్య క్యాంపు, గంగారెడ్డినగర్, లక్ష్మీపూర్ క్యాంపు సోమవారం బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆంశాలను ప్రజలకు వివరిస్తు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా వడ్డేపల్లిలో టీఆర్ఎస్ నాయకుడు బీమా శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కార్యక్రమంలో నియోజక వర్గ నాయకుడు మల్యాద్రిరెడ్డి, మండల పార్టీ కన్వీనర్ పండరి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనిపూర్ రాజీరెడ్డి, సెగ్మెంట్ ఉపాద్యాక్షుడు బానోత్ రమేష్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి భారీ, మాజీ జెడ్పీటీసీ రంజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా: కాసుల బాల్‌రాజ్
సాక్షి, నస్రుల్లాబాద్ : బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యునిగా ఈ సారి ఆశీర్వదించండి అని బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టి అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని సంగం,అంకోల్,బొమ్మన్‌దేవ్‌పల్లి హాజీపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు రూ. 50వేల వరకు రుణ మాఫి,సంవత్సరానికి 6గ్యాస్ సిలిండర్లను ,డ్వాక్రా గ్రూపుకు రూ.లక్ష గ్రాంట్ ఉచితం ఇస్తామన్నారు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మాల్యాద్రి రెడ్డి,రాజిరెడ్డి,దొంతురాం కాశీరాం,రాజేశ్వర్ రెడ్డి,సత్య నారాయణ ఉన్నారు. ఏడాదికి 6 సిలిండర్లు ఉచితం బాన్సువాడరూరల్: కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుందని యూత్‌కాంగ్రెస్ మండల అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడ్కోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ , ఒకే విడతలో 2లక్షల రుణమాఫీ చేస్తుందని, ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు రూ.లక్ష నగదు ఉచితంగా అందిస్తుందన్నారు. దేశాయిపేట్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రత్నాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చేతికి షాక్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడం అధిష్టానానికి సవాలుగా మారింది. అవకాశం కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన పలువురు టికెట్ చేజారడంతో రెబల్స్‌గా మారిపోయారు. అసమ్మతితో పార్టీకి నష్టం చేసే స్థితిలో ఉన్నారు. ఎక్కడెక్కడ రెబల్స్ ఉన్నారు, ఏయే నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఉన్నారన్న జాబితాను టీపీసీసీ సిద్ధం చేసింది. ఈ మేరకు వారిని సముదాయించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఫోన్లు చేశారు. జిల్లాకు వచ్చేసరికి.. బాన్సువాడ కాంగ్రెస్ టికెట్టును కాసుల బాల్‌రాజ్‌కు కేటాయించడంతో అసంతృప్తితో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేసిన సంగెం శ్రీనివాస్ గౌడ్, మాసాని శ్రీనివాస్ రెడ్డిలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధినాయకులు రంగంలో దిగారు. ఈ మేర కు మాసాని శ్రీనివాస్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య, కేంద్రమంత్రి జైరాం రమేశ్ ఫోన్‌చేసి హైదరాబాద్‌కు పిలిపించారు. కాంగ్రెస్‌లో సీని యర్ నాయకులను విస్మరించేది లేదని, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తప్పకుండా సీనియర్ నాయకులకు అధికార పదవులు ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే సంగెం శ్రీనివాస్‌గౌడ్‌ను పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ బుజ్జగించినట్లు తెలిసింది. నామినేషన్లను ఉపసంహరించాలని, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరినట్లు తెలిసింది. ఎల్లారెడ్డి కాం గ్రెస్ అభ్యర్థిగా నల్లమడుగు సురేందర్‌కు టికెట్ దక్కడంపై మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ తీవ్ర అసంతృప్తిలో ఉండగా, వారిని దిగ్విజయ్‌సింగ్ ఫోన్లో సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ససేమిరా అన్న వారు తమ అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. ఆ ఇద్దరితో పాటు ఎన్డీసీసీబీ డెరైక్టర్ సంపత్, ఏఎంసీ చైర్మన్ కృష్ణగౌడ్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు పార్టీని వీడటం కాంగ్రెస్‌కు పెద్దదెబ్బగా తగిలినట్లయ్యింది. ఓ వైపు అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు నేతలు రాజీనామాలకు సిద్ధమవుతుండటం కాంగ్రెస్ నాయకులను కలవరానికి గురిచేస్తోంది. డీసీసీ అధ్యక్షుడికి దిగ్విజయ్ ఫోన్... డీసీస అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించిన తాహెర్‌బిన్ హందాన్‌తో దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. జుక్కల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంకు రెబల్‌గా నామినేషన్ వేసిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతారకు కూడా ఆయన ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే ఆమె నామినేషన్ ఉపసంహరణకు ససేమిరా అన్నట్లు తెలిసింది. మూడు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న మైనార్టీ నేతగా తాహెర్ నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనను నారాజ్ కావద్దని దిగ్విజయ్ సూచించినట్లు తెలిసింది. గతంలో నిజామాబాద్, బోధన్ల నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయిన తాహెర్‌కు, ఈసారి టికెట్ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యాడన్న సమాచారం మేరకు దిగ్విజయ్ ఆయనతో మాట్లాడినట్లు తెలిసింది. ఈనెల 16న కరీంనగర్‌కు వచ్చి తనను కలవాలని సూచిం చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఆశించిన ప్రతి ఒక్కరి టికెట్ రావడం కష్టమని, అయితే పార్టీ సీనియర్లకు ఏదో ఒక తరహాలో పదవులిచ్చి గుర్తింపునిస్తుందని పేర్కొనట్లు సమాచారం. దిగ్విజయ్‌సింగ్ తనతో ఫోన్లో మాట్లాడింది నిజమేనని,టికెట్ రాకపోవడం మైనార్టీ నేతగా బాధ కలిగించిన మాట వాస్తవమేనని తాహెర్ అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తానని, 16న కరీంనగర్‌కు వెళ్లి దిగ్విజయ్‌ను కలుస్తానని ‘సాక్షి’కి ఆయన తెలిపారు.