MS Dhoni Met Khushbu Mother in Law: మహేంద్ర సింగ్ ధోని.. అభిమానులను ఖుషీ చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. అందుకే తొమ్మిదేళ్ల వయసు పిల్లల నుంచి తొంభై ఏళ్ల వృద్ధుల వరకు ధోని ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు. అలా కేవలం ఆటలోనే కాదు మనసులను గెలవడంలోనూ తాను రారాజే అనిపించుకుంటున్నాడు మిస్టర్ కూల్.
తాజాగా ఈ విషయాన్ని తలైవా మరోసారి నిరూపించాడంటున్నారు సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్. టీమిండియా కెప్టెన్‌గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా తమిళ ప్రజల మనసు దోచుకుంటున్నాడు.
88 ఏళ్ల వీరాభిమాని
తలా అంటూ ముద్దుగా పిలుచుకునే ధోనికి ఉన్న అభిమానగణంలో ఖుష్బూ వాళ్ల అత్తయ్య కూడా ఒకరు. ఆమె ధోనికి వీరాభిమాని. ఒక్కసారైనా ‘తలా’ను చూడాలని ఆమె తపించిపోయేవారట. మరి అభిమానులంటే ప్రాణమిచ్చే ధోని.. వారి కోరికను నెరవేర్చకుండా ఉంటాడా?!
అందుకే తన ‘సీనియర్ మోస్ట్ ఫ్యాన్’ను కలిసేందుకు స్వయంగా తనే చొరవ తీసుకున్నాడు. ఆమెను ఆత్మీయంగా పలకరించి.. కాసేపు సమయాన్ని గడిపాడు. ధోనిని చూసి మురిసిపోయిన ఆ పెద్దావిడ.. తనను ముద్దాడి ఆశీర్వాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఖుష్బూ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
నిజమైన హీరోలు..
‘‘హీరోలను ఎవరూ తయారు చేయరు.. వాళ్లు పుట్టుకతోనే అలా ఉంటారంతే! ఈ విషయాన్ని ధోని నిరూపిస్తూనే ఉన్నాడు. మా సీఎస్‌కే సారథి.. తలా ఎంఎస్ ధోని పంచిన ఆత్మీయత, ఇచ్చిన ఆతిథ్యాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు.
మా అత్తమ్మ 88 ఏళ్ల వయసులో తలాను కలవగలిగారు. ధోని అంటే ఆమెకు ప్రాణం. మహీ.. నీ ఆత్మీయ పలకరింపుతో ఆమె మరికొన్నేళ్ల పాటు మరింత ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండగలుగుతారు’’ అని ఖుష్బూ భావోద్వేగ నోట్ షేర్ చేశారు. తన అత్తయ్యను కలిసినందుకు ధోనికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎస్‌కే విజయవంతమైన సారథిగా
చెన్నైని నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మహీ భాయ్ కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే రెండింట గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ఏప్రిల్ 17న బెంగళూరులో ఆర్సీబీతో తమ తదుపరి మ్యాచ్‌లో చెన్నై తలపడనుంది.
చదవండి: షారుక్ ఖాన్.. పంజాబ్ కింగ్స్‌కు దొరికిన వరం
గంగూలీవైపు కోపంగా.. కనీసం షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు!
Heroes are not made, they are born. Dhoni proves that. I am at loss for words for our CSK #Thala @msdhoni at his warmth & hospitality. He met my ma in law, who at 88, hero worships Dhoni & cannot see beyond him. Mahi, you have added many years of good health & happiness to her… pic.twitter.com/darszdzb62
— KhushbuSundar (@khushsundar) April 14, 2023
Comments
Please login to add a commentAdd a comment