ఐపీఎల్-2023 ఛాంపియన్స్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ టైటాన్స్ జరిగిన ఫైనల్లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన వెంటనే ధోని చాలా బాధ పడ్డాడని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు. కాగా ఫైనల్ మ్యాచ్ కీలక సమయంలో అంబటి రాయుడు ఔటైన తర్వాతి బంతికే ధోని పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
ఈ క్రమంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆఖరి బంతికి ఫోర్ బాది తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. తాజాగా ఇదే విషయంపై కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. "ఫైనల్ మ్యాచ్‌లో మా విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 38 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో రాయుడు వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్ బాది మ్యాచ్‌ను మా వైపు మలుపు తిప్పాడు. అతడు అదే ఓవర్‌లో నాలుగో బంతికి ఔటయ్యాడు.
దీంతో మా విజయానికి 14 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ధోని క్రీజులోకి వచ్చాడు. అయితే అతడు ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. మేమంతా షాక్‌కు గురయ్యాం. గోల్డన్ డక్‌గా వెనుదిరగడం ఎంఎస్‌ను కూడా భాదించింది. ఇంత దగ్గరగా వచ్చి ఓడిపోతామో ఏమో అన్న భయం ధోని కళ్లలో కన్పించింది.
కానీ క్రీజులో ఇంకా జడేజా ఉన్నాడు కాబట్టి మేము నమ్మకంతోనే ఉన్నాం. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని జడ్డూ సిక్స్‌గా మలచడం మాకు మరింత నమ్మకం కలిగించింది. ఆఖరి బంతిని కూడా ధోని తనదైన స్ట్రైల్‌లో బౌండరీ పంపించాడు అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Ashes 2nd Test: అతడిని పక్కన పెట్టి స్టార్క్‌ను తీసుకు రండి: ఆసీస్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment