MS Dhoni- IPL 2023: మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మాస్టర్‌మైండ్‌తో ఊహించని రీతిలో ఫీల్డింగ్ సెట్ చేసి.. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లోనూ గెలిపించడంలో తనకు తానే సాటి. అందుకే ఈ మిస్టర్ కూల్ టీమిండియాతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ అత్యంత విజయవంతమైన సారథిగా పేరొందాడు.
భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్రుడు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏకంగా ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక యువ ఆటగాళ్లకు రోల్ మోడల్ అయిన ధోని గురించి టీమిండియా బ్యాటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి మిస్టర్ కూల్ కెప్టెన్సీని హైలైట్ చేశాయి.
నమ్మశక్యంకాని రీతిలో
ఇటీవల రాజ్ షమన్ పాడ్‌కాస్ట్‌లో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిగిన సంఘటన గురించి చెబుతాను. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వ్యక్తికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాను.
నమ్మశక్యంకాని రీతిలో అవుట్ కావడంతో వెంటనే వెనక్కి తిరిగి చూడగా.. సదరు ఫీల్డర్ ఉండాల్సిన చోట కాకుండా వేరే చోట ఉన్నట్లు అనిపించింది. నిజానికి అతడు మరికాస్త కుడివైపునకు నిల్చోవాల్సింది. అది చూసి నేను షాకయ్యా.
వెంకటేశ్ అయ్యర్
భయ్యా ఎందుకిలా చేశావు?
మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషయం గురించి ధోనిని అడిగాను. ‘‘భయ్యా. ఇలా ఎందుకు చేశారు?’’ అన్నపుడు.. నేను షాట్ కొట్టగానే ఫీల్డింగ్ అలా సెట్ చేసినట్లు చెప్పాడు. అందుకు నేను వావ్ అనకుండా ఉండలేకపోయాను.
అసలు అంత తక్కువ సమయంలో అలా ఎలా ఆలోచిస్తారో అర్థంకాక తలపట్టుకున్నా. నిజానికి క్రికెట్‌లో యాంగిల్స్ గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎవరిని ఎక్కడ ప్లేస్ చేస్తే అనుకున్న ఫలితం రాబట్టగలమో తెలుస్తుంది. ధోని స్ట్రెంత్ అదే’’ అని చెప్పుకొచ్చాడు.
కాగా ఐపీఎల్-2023లో వెంకటేశ్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 404 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో అతడి అత్యధిక స్కోరు 104. ఇక ధోని సారథ్యంలోని సీఎస్‌కే రిజర్వ్ డే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది.
చదవండి: చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. పొట్టి క్రికెట్‌లో తొలి బౌలర్‌గా రికార్డు
42 మ్యాచ్‌ల వరకు ఒక్కసారి కూడా లేదు.. ఆతర్వాత వరుసగా 3 సార్లు 'ఆ ఘనత'
Comments
Please login to add a commentAdd a comment