సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహల్‌పై పడిన లోక్‌సభ అనర్హత వేటు విషయమై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బు సుందర్ పాత ట్వీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఖుష్బు.. తన పాత ట్వీట్‌ని తొలగించేదే లేదని కరాఖండీగా చెప్పారు. అంతేగాదు ఇలాంటి ట్వీట్లు చాలా ఉన్నాయి. వాటిని కూడా బయటకు తీయండి. ఏ పని లేని కాంగ్రెస్‌కి కనీసం ఇలాగైనా తన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని గట్టి కౌంటర్ ఇచ్చారు. అయినా మీరు గాంధీతో సమానంగా నిలబెట్టినందుకు కాంగ్రెస్‌కి కృతజ్ఞతలు.
జాతీయ నాయకుడిగా చెప్పుకునే ఆయనతో సమానంగా ఉండేందుకు తగిన పేరు, గౌరవం సంపాదించడం నాకు చాలా ఇష్టం. అలాగే అవినీతి, దొంగలు అనే పదానికి చాలా తేడా ఉంది. అది కేవలం పార్టీ నాయకత్వాన్ని అనుసరించిన చేసిన ట్వీట్ అని సమర్థించుకున్నారు.
ఇదిలా ఉండగా, ఖుష్బు కాంగ్రెస్ పార్టీలో ఉండగా చేసిన ట్వీట్‌లో..మోదీ అంటే అవినీతి అని మారుద్ధాం, ఇదే సరైన పోలీక అంటూ ట్వీట్ చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కారణాంగా జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఖుష్బు చేసిన పాత ట్వీట్‌ని షేర్ చేసింది. నాడు ఆమె కూడా మోదీని అవినీతి అంటూ రాసుకొచ్చారు కాబట్టి ఆమెపై కూడా కేసు వేస్తారా అని పూర్ణేశ్ మోదీని ప్రశ్నిస్తూ బీజేపీకి కౌంటరిచ్చింది కాంగ్రెస్.
I will not delete my tweet. It’s out there. There are many more. Pls use your time, as CONgress is absolutely jobless, to dig out a few more. BTW I like to see how the CONgress is putting me and @RahulGandhi on the same platform. I like the fact that I have earned enough name n…
— KhushbuSundar (@khushsundar) March 25, 2023
(చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుకి నిరసనగా..సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్!)
Comments
Please login to add a commentAdd a comment