శాండ్విచ్లో పురుగు.. ఖుష్బూకు చేదు అనుభవం | Khushbu sundar finds bug in sandwich | Sakshi
Sakshi News home page

శాండ్విచ్లో పురుగు.. ఖుష్బూకు చేదు అనుభవం

Published Mon, Oct 28 2013 2:00 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

Khushbu sundar finds bug in sandwich

సరదాగా రెస్టారెంట్ నుంచి శాండ్విచ్ తెప్పించుకుని తిందామనుకుంటున్నారా? ఎందుకైనా మంచిది.. ఒకసారి దాని రెండు స్లైసులు ఒకసారి తీసి సరిచూసుకోండి. ఎందుకంటే, ప్రముఖ నటి ఖుష్బూకు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె చెన్నైలోని విరుంగబాకంలో ఉన్న సబ్వే రెస్టారెంట్ నుంచి ఓ శాండ్విచ్ తెప్పించుకున్నారు. సాధారణంగా ఆమెకు శాండ్విచ్ తినేముందు దాన్ని ఒకసారి తీసి చూడటం అలవాటు. అలాగే చూసేసరికి ఒక్కసారిగా దిగ్ర్భాంతి చెందారు. అందులో పురుగు కనిపించింది.

సాధారణంగా శాండ్విచ్ని యథాతథంగా తినేయడం చాలామందికి అలవాటు. ఇలా చేస్తే మాత్రం ముప్పు పొంచి ఉందని అందరికీ తెలిసేందుకు ట్విట్టర్లో ఆ సమాచారంతో పాటు.. సదరు శాండ్విచ్ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ప్రమాణాలు పాటించేది ఇలాగేనా అంటూ నిలదీశారు. మనలో చాలామందికి లోపల ఏముందో చూసే అలవాటు ఉండదని, ఇకమీదట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొహమాట పడకుండా చూడాలని, నాణ్యతలోపం ఏమైనా కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. తాను కూడా దీనిపై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement