
ఎట్టకేలకు నా హీరోను కలిశా: ఖుష్బూ
మనకిష్టమైన వ్యక్తుల్ని కలిస్తే ఆ ఆనందమే వేరు. ఇలా తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిని కలిసిన నటి ఖుష్బూ సుందర్ అలాంటి ఆనందంలోనే మునిగితేలుతోంది. ఇంతకీ ఆ ఆనందానికి కారణం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి. రవిశాస్త్రి అంటే ఖుష్భూకు విపరీతమైన అభిమానం. ఈ క్రమంలోనే అతన్ని చాలాసార్లు కలుద్దామని ప్రయత్నించినా ఎప్పుడు అది కుదరలేదు.
తాజాగా సోమవారం రవిశాస్త్రిని ఖుష్భూ కలుసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'నా 33 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. నా హీరోను కలుసుకున్నా. నా కల సాకారమైంది' అని ఆమె తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డే అనంతరం రవిశాస్త్రిని ఖుష్బూ కలుసుకున్నారు.
Look who @khushsundar met today after Team beat in the 1st ODI yesterday! @RaviShastriOfc whom she wanted meet for 33 years! #INDvAUS pic.twitter.com/8GTSgboxs7
— Chennai Times (@ChennaiTimesTOI) 18 September 2017