Chiranjeevi Congratulations To Actress And Politician Kushboo Sundar For Nominated As Member Of NCW - Sakshi
Sakshi News home page

Chiranjeevi-Kushboo: ఇకపై మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుంది: ఖుష్బూపై చిరు ప్రశంసలు

Feb 28 2023 9:14 AM | Updated on Feb 28 2023 9:55 AM

Chiranjeevi Heartfelt Congratulations to Actress, Politician Kushboo Sundar - Sakshi

ప్రముఖ నటి, బిజెపి నేత ఖుష్బూకు మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఎంపికైన తనపై ఈ సందర్భంగా చిరు ప్రశంసలు కురిపించారు. కాగా నటి ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: భర్త కోసం నయన్‌ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్‌ ఇచ్చిన విజయ్‌ సేతుపతి?

‘మహిళలు, చిన్నారులపై వేధింపుల నివారణతో పాటు వారి ఆత్మగౌవరం కోసం పోరాడుతున్న నాకు అతివల మద్దతుగా గళం విప్పేందుకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆమె ట్వీట్‌పై చిరంజీవి స్పందిస్తూ ఖచ్చితంగా మీరు ఈ పదవికి అర్హురాలు అని పేర్కొన్నారు. 

చదవండి: ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రణ్‌బీర్‌ కపూర్‌

‘జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన కుష్బూకు నా శుభాకాంక్షలు. మీరు ఖచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మహిళలకు సంబంధించిన అన్ని  సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నా. మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న మీ గొంతుక మ‌రింత శ‌క్తివంతంగా మారుతుంది’ అంటూ ఆమెను చిరు ప్రశంసించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement