శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. వైద్య చికిత్స కోసం ఆయన అమెరికా చేరుకున్నారు. అక్కడికి వెళ్లేముందు అభిమానులకు సందేశం ఇచ్చారు. త్వరలోనే తిరిగి వస్తానన ఫ్యాన్స్‌తో చెప్పారు.
ఇటీవల నాన్నకు క్యాన్సర్‌కు సంబంధించిన సర్జరీ పూర్తయిందని ఆయన కూతురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శివరాజ్ కుమార్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. త్వరలోనే అభిమానులతో నాన్న మాట్లాడతారని పేర్కొంది. కాగా.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు.
తాజాగా శివరాజ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు. తన భార్యతో కలిసి ఆయన మాట్లాడారు. తాను క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. మీ అందరి అభిమానం వెలకట్టలేనిదని శివరాజ్ కుమార్ అన్నారు. న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
శివరాజ్ కుమార్ మాట్లాడుతూ..'క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయం దూరం చేసేందుకు నా భార్య గీత, అభిమానులు ఎంతో సహకరించారు. వారందరికీ రుణపడి ఉంటా. నేను పూర్తి చేయాల్సిన సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను. కీమో థెరపీ చేయించుకుంటూనే '45' సినిమా షూటింగ్ పూర్తి చేశా. ఈ ప్రయాణంలో వైద్యులు అందించిన సహకారం మర్చిపోలేను' అని అన్నారు.
కాగా.. శివ రాజ్‌కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్‌లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్‌సీ16లోనూ కనిపించనున్నారు. అంతేకాకుండా కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు.
#ShivarajKumar spoke after his surgery, explaining what had happened and expressing gratitude to all those who helped him to win this situation pic.twitter.com/NU41k5mLUD
— Yogitha RJ (@iamyogitharj) January 1, 2025
Comments
Please login to add a commentAdd a comment