
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.అంబరీశ్ తన పాత ఇంటిని పాఠశాల కోసం బహుమతిగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల హసకొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోసం తన ఇల్లును (ఇంటి నంబరు 6.3) పాఠశాల కోసం ఇచ్చారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్‌ను కలసి విషయాన్ని తెలియజేశారు. దానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. దీంతో విజయ్‌కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అంబరీశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇంటికి సంబంధించి గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment