
‘ఆయన వల్లే ఓటమి'
లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమికి మంత్రి అంబరీషే కారణమని శాండల్‌వుడ్ నటి రమ్య అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రమ్య తన ఫిర్యాదులో ‘కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం కృష్ణా, అంబరీష్ మధ్య ఉన్న మనస్పర్థల వల్ల ఆ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు. ముఖ్యంగా అంబి అనుచరులు ప్రత్యర్థులతో చేతులు కలిపి నన్ను ఓటమి పాలు చేశారు. ఈ విషయాలన్నీ తెలిసినా అంబరీష్ వ్యక్తి గత రాజకీయ లబ్ధి కోసం మిన్నకుండి పోయారు.’ అని స్పష్టం చేసినట్లు తెలిసింది.