అభిషేక్, అంబరీష్
కొన్ని విషయాలు పనిగట్టుకొని నేర్పించనవసరం లేదు. వారసత్వంగానూ సంక్రమిస్తాయి అంటున్నారు శాండిల్‌వుడ్ వాసులు. కన్నడ రెబల్‌స్టార్ అంబరీష్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అంబరీష్ కుమారుడు అభిషేక్ తన ఫస్ట్ చిత్రం ‘అమర్’ కోసం బిజీబిజీగా షూటింగ్ చేస్తున్నారు. తండ్రి అంత్యక్రియలన్నీ దగ్గరుండి జరిపించి, బాధనంతా తనలోనే ఉంచుకుని మూడు రోజుల్లో తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కాగా ఒకప్పుడు రెబల్ స్టార్ అంబరీష్‌కు కూడా ఇలాంటి బాధాకరమైన సంఘటన ఎదురైంది.
1978లో ‘పదువరల్లి పాండవురు’ అనే కన్నడ చిత్రం షూటింగ్ చేస్తూ ఉండగా అంబరీష్ తండ్రి మర ణించారు. అవుట్‌డోర్ లొకేషన్‌లో షూటింగ్ చేస్తున్న అంబరీష్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం నిర్మాతకు నష్టంగా మారకూడదని అంబరీష్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఊహించవచ్చు. ఇలా తండ్రి నడిచిన బాటలోనే అభిషేక్ నడుస్తున్నాడు అంటున్నారు అంబరీష్ ఫ్యాన్స్. అభిషేక్ తొలి సినిమా ‘అమర్’ విషయానికి వస్తే.. ఈ చిత్రం షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment