
భర్తకు అంతిమ నివాళి అర్పిస్తున్న సుమలత
సాక్షి బెంగళూరు/ యశవంతపుర: కన్నడ రెబెల్ స్టార్, మాజీ మంత్రి అంబరీశ్‌కు అభిమానులు, సినీరంగ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం అంబరీశ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. అభిమానుల ఒత్తిడి మేరకు ఆదివారం అంబరీశ్ పార్థివ దేహాన్ని ఆయన సొంత జిల్లా అయిన మండ్యకు తరలించారు. మండ్యలోని విశ్వేశ్వరయ్య క్రీడా మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం రాత్రంతా అభిమానులు ఆయనను కడసారి చూసుకున్నారు. అనంతరం సోమవారం ఉదయం 11.30 గంటలకు సైనిక హెలి కాప్టర్ ద్వారా బెంగళూరుకు తరలించారు. ఈ సంద ర్భంగా సతీమణి సుమలత, తనయుడు అభిషేక్ మండ్య మట్టిని తీసి అంబరీశ్ నుదుటన తిలకంగా దిద్దారు. తర్వాత బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ఉంచగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వీఐపీలకు అంబరీశ్ కడచూపునకు అనుమతించారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు
సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన అంబరీశ్ అంతిమయాత్రకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కంఠీరవ స్టూడియాలో కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ సమాధికి సమీపంలోనే అంబరీశ్ భౌతికకాయానికి చితిని పేర్చారు. అంబరీష్ పార్థివదేహంపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని సీఎం కుమారస్వామి.. సుమలతకు అందజేశారు. తన యుడు అభిషేక్ తండ్రి చితికి నిప్పంటించారు.
Comments
Please login to add a commentAdd a comment