కాలిఫోర్నియా : ‘తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే ఉత్తర అమెరికాలో తొలిసారిగా ఓ సంఘం ఏర్పాటైంది. మహిళ సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో నిర్వహించారు. ప్రముఖ కన్నడ సినీ హీరో అంబరీష్ సతీమణి, కర్ణాటక ఎంపీ సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేటా ప్రెసిండెంట్, అడ్వయిజరీ కౌన్సిల్ చైర్ చైర్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను పెంచి , వారి కలను సాకారం చేసుకోవాడాని ఈ సంస్థ తోడ్పతుందని పేర్కొన్నారు. ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రంపచానికి చాటుదామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలతో మహిళలకు న్యాయం జరగడం లేదని, అందుకే కొత్తగా కేవలం మహిళల కోసమే వేటాను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సినిమాల్లోను, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న సుమలతకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పలు కళాత్మక ప్రదర్శనలు చేశారు. సాయంత్రం జరిగిన బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment