
శాండిల్‌వుడ్ నటి చైత్రా
జయనగర: భర్త వేధింపులు తాళలేకపోతున్నానని శాండిల్‌వుడ్ నటి చైత్రా మంగళవారం బసవనగుడి మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలు..‘తనకు 2006లో లిక్కర్, రియల్టర్ బాలాజీ పోతరాజ్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెల రోజులుగా వేధింపులు తీవ్రతరమయ్యాయి. ఎక్కడికి వెళ్లినా వెంట గన్‌మన్‌ను పంపుతున్నాడు. ఈనెల 14న చిన్న విషయానికి గొడవపడి ముఖంపై దాడి చేశాడు. జుట్టుపట్టుకుని తలను గోడకేసి బాదాడు. ముక్కు, నోటి నుంచి రక్తస్రావమైనా పట్టించుకోలేదు. తనను హత్యచేయాలనే ఉద్దేశంతో గొంతుపట్టుకుని పొట్ట ఇతరభాగాలపై డాడికి పాల్పడ్డాడు. తాను స్పృహ కోల్పోగా ఇంట్లో వదిలిపెట్టి వెళ్లాడు.
అమూల్య అనే యువతితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తనను ఇంటి నుంచి గెంటేసేందుకే వేధింపులకు దిగుతున్నాడు. ప్రస్తుతం పుట్టింట్లో ఆశ్రయం పొందుతున్నా. బాలాజీపోతరాజ్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’. అని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment