Tamil Horror Movie 'Kallarai' Is All Set To Release In August - Sakshi
Sakshi News home page

Kallarai Movie: ప్రతీకారమే కథాంశంగా తెరకెక్కించిన 'కల్లరై'!

Published Mon, Jul 24 2023 3:56 PM | Last Updated on Mon, Jul 24 2023 4:13 PM

Tamil Horror Movie Kallarai Ready To release In August - Sakshi

హార్రర్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే ఈ తరహా చిత్రాలకు ప్రత్యేకంగా సీజన్‌ అంటూ ఉండదు. అలాంటి విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం కల్లరై.  గుడ్‌న్యూస్‌ ఫిలిమ్స్‌ పతాకంపై పొన్నేరి రతి జవగర్‌ నిర్మించిన ఈ చిత్రంలో సకో రమేష్‌, దీప్తి దివాన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఏపీఆర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  

(ఇది చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!)

ఏపీఆర్ తెలుపుతూ కొడైక్కెనాల్‌లో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఒక యువతపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేస్తారన్నారు. ఆ జ్యోతి దెయ్యంగా మారి ఎవరైతే తనను మానభంగం చేసి చంపేశారో వారిపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో రూపొందిన చిత్రమే కల్లరై అని చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించి ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయని చెప్పారు. 

హార్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ఆ నమ్మకంతోనే తాము ఈ చిత్రా న్ని నిర్మించినట్లు నిర్మాత రతి జవహార్‌ పేర్కొన్నారు. చిత్రం కచ్చితంగా వారి ఆదరణను పొందుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూ ర్తయ్యాయని.. ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో  రతి జవహార్‌, టి.జవహార్‌ జ్ఞానరాజ్‌, వి.యశోద, ప్రేమ ప్రియా, రోషిలా భారతీ మోహన్‌, సురేందర్‌ హరిహరన్‌, సురేష్‌, రామ్‌ రంజిత్‌, నందకుమార్‌, అజయ్‌ సురేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

(ఇది చదవండి: పవన్‌కు అహం ఎక్కువ.. పూనమ్‌ కౌర్‌ టాపిక్‌పై రాజు రవితేజ కామెంట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement