
తమన్నా
ఈ రోజుల్లో సినిమా పూర్తి కావాలంటే 6 నెలల నుంచి ఏడాది, రెండేళ్ల వరకూ పడుతుంది. చిన్న సినిమాల షూటింగ్ కూడా చాలా రోజులు పడుతోంది. కానీ తమిళంలో తమన్నా నటించనున్న ఓ హారర్ సినిమా నలభై రోజుల్లోనే పూర్తి కానుందని తెలిసింది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమన్నా ముఖ్యపాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ హారర్ థ్రిల్లర్ రూపొందనుంది.
యోగిబాబు, మన్సూర్ అలీ ఖాన్, భగవతీ పెరుమాళ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం 42 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టాక ఎటువంటి బ్రేక్స్ తీసుకోకూడని ఫిక్స్ అయ్యారట. మొదటి పది రోజులు చెన్నైలో మిగతా పోర్షన్ మొత్తం కారైకుడిలో షూట్ చేస్తారట. తమన్నా నటించిన హారర్ చిత్రాలు ‘దేవి 2’, కామోషీ’ సినిమాలు మే 31న రిలీజ్ కానున్నాయి.