టారోట్‌ మూవీ.. ధైర్యవంతులు మాత్రమే చూడండి! | Hollywood Tarot Movie Review in Telugu | Sakshi
Sakshi News home page

Tarot Movie: తెలుగమ్మాయి నటించిన హాలీవుడ్‌ మూవీ రివ్యూ.. ఏ ఓటీటీలో ఉందంటే?

Published Fri, Aug 23 2024 11:52 AM | Last Updated on Thu, Sep 19 2024 11:12 AM

Hollywood Tarot Movie Review in Telugu

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం ‘టారో’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి డిజిటల్‌ కలర్‌ కాలం వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ ఎలిమెంట్‌ ఏదైనా ఉంది అంటే అదే ‘దెయ్యం’. ఓ మనిషి భయానికి కారణం తన కన్నా బలవంతుడు ఎదురు పడినపుడు లేదా ప్రాణం లేని ఆత్మ కనపడినపుడు... నాటి నుంచి నేటి సినిమా దర్శకుల వరకు తమ సినిమాల్లో దెయ్యాన్ని వాడుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఆ కోవలే రిలీజైన హాలీవుడ్‌ మూవీనే ‘టారో’.  

కథ
ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు స్పెన్సర్‌ కొహెన్‌–అన్నాహెల్‌ బర్గ్‌. కథాంశానికొస్తే... కాలేజ్‌ స్నేహితులైన ఓ గ్రూప్‌ హాలిడే ట్రిప్‌కని ఓ మారుమూల ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు అనుకోకుండా ఓ బాక్స్‌... అందులో కొన్ని టారో కార్డ్స్‌ కనబడతాయి. ఇక్కడ టారో కార్డ్స్‌ అంటే చూడటానికి పేకముక్కల్లా ఉండి, ఇంకా చెప్పాలంటే మన చిలక జోస్యంలో చిలక తీసేలాంటివన్నమాట. ఆ టారో కార్డ్స్‌తో ఓ అమ్మాయి... గ్రూప్‌లో మిగతా అందరికీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు చెప్తుంది.

ఎలా ఉందంటే?
ట్విస్ట్‌ ఏంటంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు చెప్తూ వాళ్ళ మరణం ఎలా ఉంటుందో చెప్తుంది. ఇంకా చెప్పాలంటే అలా ఆ కార్డ్స్‌లో ఉన్న దెయ్యం ఆ అమ్మాయి చేత అలా చెప్పిస్తుంది. ఆ తరువాత వాళ్లు ఆ కార్డ్స్‌ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు? చివరకు ఆ దెయ్యాన్ని ఏం చేశారన్నదే ‘టారో’ సినిమా. గొప్ప విషయం ఏమిటంటే ఈ హారర్‌ హాలీవుడ్‌ సినిమాలో తెలుగమ్మాయి అవంతిక నటించడం. హారర్‌ జోనర్‌ ఇష్టపడేవాళ్ళకి ‘టారో’ మంచి ఛాయిస్‌... ఒక్క భయపడేవాళ్ళకు తప్ప. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. గో వాచ్‌ ఇట్‌. 
– ఇంటూరు హరికృష్ణ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement