Tarot
-
టారోట్ మూవీ.. ధైర్యవంతులు మాత్రమే చూడండి!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘టారో’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.బ్లాక్ అండ్ వైట్ నుంచి డిజిటల్ కలర్ కాలం వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అదే ‘దెయ్యం’. ఓ మనిషి భయానికి కారణం తన కన్నా బలవంతుడు ఎదురు పడినపుడు లేదా ప్రాణం లేని ఆత్మ కనపడినపుడు... నాటి నుంచి నేటి సినిమా దర్శకుల వరకు తమ సినిమాల్లో దెయ్యాన్ని వాడుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఆ కోవలే రిలీజైన హాలీవుడ్ మూవీనే ‘టారో’. కథఈ సినిమాకి ఇద్దరు దర్శకులు స్పెన్సర్ కొహెన్–అన్నాహెల్ బర్గ్. కథాంశానికొస్తే... కాలేజ్ స్నేహితులైన ఓ గ్రూప్ హాలిడే ట్రిప్కని ఓ మారుమూల ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు అనుకోకుండా ఓ బాక్స్... అందులో కొన్ని టారో కార్డ్స్ కనబడతాయి. ఇక్కడ టారో కార్డ్స్ అంటే చూడటానికి పేకముక్కల్లా ఉండి, ఇంకా చెప్పాలంటే మన చిలక జోస్యంలో చిలక తీసేలాంటివన్నమాట. ఆ టారో కార్డ్స్‌తో ఓ అమ్మాయి... గ్రూప్‌లో మిగతా అందరికీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు చెప్తుంది.ఎలా ఉందంటే?ట్విస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు చెప్తూ వాళ్ళ మరణం ఎలా ఉంటుందో చెప్తుంది. ఇంకా చెప్పాలంటే అలా ఆ కార్డ్స్‌లో ఉన్న దెయ్యం ఆ అమ్మాయి చేత అలా చెప్పిస్తుంది. ఆ తరువాత వాళ్లు ఆ కార్డ్స్ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు? చివరకు ఆ దెయ్యాన్ని ఏం చేశారన్నదే ‘టారో’ సినిమా. గొప్ప విషయం ఏమిటంటే ఈ హారర్ హాలీవుడ్ సినిమాలో తెలుగమ్మాయి అవంతిక నటించడం. హారర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ‘టారో’ మంచి ఛాయిస్... ఒక్క భయపడేవాళ్ళకు తప్ప. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. గో వాచ్ ఇట్. – ఇంటూరు హరికృష్ణ -
టారో : 29 అక్టోబర్ నుంచి 4 నవంబర్, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీ మనసుకు నచ్చిన పని చేయడం ద్వారానే మీదైన గుర్తింపు పొందగలరని గుర్తించండి. కాస్త ఆలస్యమైనా, ఈ పనిలో విజయం మీవైపే ఉంటుంది. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి బహుమతిగా ఏదైనా ప్రేమలేఖ రాసివ్వండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మీ ఆలోచనా విధానానికి తగ్గ నిర్ణయమే తీసుకోండి. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోండి. ప్రశాంతంగా ఉండడం అలవర్చుకోండి. కలిసివచ్చే రంగు : తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్త పనులు మొదలుపెడతారు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న విజయం ఈ కొత్త పనుల్లో సాధిస్తారు. మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించడం మానండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. అయితే మీ జీవిత భాగస్వామితో ఎదురయ్యే గొడవలు కూడా మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేసేవే. ఇష్టంగా వారి మనసును గెలుచుకునే ప్రయత్నం చేయండి. ఇల్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కొత్త పదవులను అలంకరిస్తారు. కలిసివచ్చే రంగు : పీచ్ మిథునం (మే 21 – జూన్ 20) ప్రశాంతంగా ఆలోచించాల్సిన సమయం ఇది. చేపట్టిన పనులు కాస్త ఆలస్యంగా పూరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీ ప్రయత్నంలో మాత్రం లోటు అనేది ఉండకుండా చూసుకోండి. వృత్తిరీత్యా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీ స్థాయికి తగిన అవకాశాలైతేనే ఎంచుకోండి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. కలిసివచ్చే రంగు : నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బందిపెడుతోన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండి. జీవితంలో ఏది జరిగినా అంతిమంగా అది అలాగే జరుగుతుందన్న సత్యాన్ని గ్రహిస్తూ ముందుకెళ్లండి. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఈ కొత్త అవకాశాల ద్వారానే మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న గుర్తింపు దక్కుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈ వారం మీకు కొన్ని ఊహించని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోండి. వృత్తిరీత్యా మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశం వస్తే వెంటనే మీదైన ప్రతిభ చూపించేందుకు సిద్ధమైపోండి. ఇంటికి సంబంధించిన మరమ్మత్తులు చేసేందుకు ఇదే సరైన సమయం. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : ముదురు గులాబి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీకు రానున్నదంతా మంచి కాలమే. మీదైన శైలిలో పనిచేస్తూ పోతే, మీకు ఎదురులేదన్న విషయాన్ని ఎప్పట్లానే బలంగా నమ్ముతూ ముందుకు వెళ్లండి. ప్రతికూల ఆలోచనలన్నీ పక్కనపెట్టేయండి. వృత్తిజీవితం కొత్తగా ఉంటుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మరింత మెరుగవుతుంది. ప్రేమ జీవితం ఆశాజనకంగా ఉండదు. విహార యాత్రలకు సన్నాహాలు చేయండి. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోండి. కలిసివచ్చే రంగు : ఎరుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితం మీకు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో కొద్దిరోజుల్లోనే చూస్తారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మానసికంగా సిద్ధంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలను దగ్గరకు కూడా రానివ్వకండి. కొత్త మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మార్పు మీ జీవితాశయం వైపుకు పడే మొదటి అడుగు అన్న ధైర్యంతో ఉండండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్థాలు వచ్చే సూచనలున్నాయి. వారికి ఎక్కువ సమయం కేటాయించి మీ ప్రేమను చాటుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : వెండి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ బాధ్యతలేంటో, ఆలోచనలేంటో సరిగ్గా తెలుసుకోవాల్సిన సమయం ఇది. మీ జీవితాశయాన్ని చేరుకోవడానికి ఎప్పట్నుంచో వెనుకడుగు వేస్తూ వస్తున్నారు. దానికి ఇదే సరైన సమయం అని గ్రహించండి. మీ శక్తులేంటో గ్రహించి, వాటిని పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని తేల్చుకోండి. మీదైన గుర్తింపు దక్కాలంటే మీ శక్తినంతా కూడగట్టాలన్న విషయం మరవకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి బహుమతినివ్వండి. కలిసివచ్చే రంగు : బంగారం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈ వారమంతా మీకు శుభ సూచకంగానే కనిపిస్తోంది. ఊహించని స్థాయి విజయం దక్కుతుంది. ఆ విజయం మీకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. మీపై మీకున్న నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. ఆత్మ విశ్వాసంతో కొత్త పనులు మొదలుపెడతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. అందరినీ కలుపుకోయే మీ ఆలోచనా విధానమే మీకు అన్నివిధాలా తోడ్పడుతుందని గ్రహించండి. కలిసివచ్చే రంగు : పసుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) గతాన్ని గురించి ఆలోచిస్తూ కొన్ని అద్భుతమైన అవకాశాలను కోల్పోతున్నారన్న విషయాన్ని గ్రహించండి. మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చే ఈ అవకాశాలను ఆత్మస్థైర్యంతో స్వీకరించండి. విజయం మీ వైపే ఉందన్న విషయాన్ని మరవకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పట్నుంచో నేర్చుకోవాలని అనుకుంటున్న కొత్త విషయాన్ని ఇప్పుడే నేర్చేసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వ్యాయామం మొదలుపెడితే మంచిది. కలిసివచ్చే రంగు : వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితాశం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కువ ఆలోచించకుండా మీరు ఏమవ్వాలనుకుంటున్నారో, అందుకు మీరు ఎంచుకోవాల్సిన మార్గం ఏంటో నిర్ణయించుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి జీవితం కొంత నిరాశాజనకంగానే ఉంటుంది. అయితే అన్నీ కుదురుకునే వరకూ మీ ప్రయత్నాల్లో మాత్రం లోటు అనేది ఉండకుండా చూసుకోండి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. విహారయాత్రలకు సన్నాహాలు చేయండి. కలిసివచ్చే రంగు : నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన సమయం ఇదే. ఏదీ చేయలేమంటూ ఒక దగ్గరే ఆగిపోయే మీ ఆలోచనలకు స్వస్తి పలకాలి. మీ శక్తి, సామర్ధ్యాలు ఏంటో తెలుసుకొని ఆ దిశగా కష్టపడితే ఫలితం కనిపిస్తుంది. ప్రేమ జీవితం కొంత కలవరపెడుతుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. ఒక కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీదైన గుర్తింపు కోసం శక్తియుక్తులన్నీ పెట్టాలని నమ్మండి. కలిసివచ్చే రంగు : గోధుమ -
టారో : 22 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ వారమంతా కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కొండి. మీకు బాగా దగ్గరైన వారొకరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జీవితాశయానికి చాలా దూరంలో ఉన్నట్లైతే, ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించి ఆ వైపు అడుగులు వేయండి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. వృత్తిరీత్యా కొత్త పదవులను అలంకరిస్తారు. ప్రేమ విషయంలో మాత్రం మొండిగా ఉన్న మీ ఆలోచనా తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పరిస్థితులు కొన్ని మీకు ప్రతికూలంగా మారిపోయే అవకాశం ఉంది. జీవితమంతా చీకట్లో గడిచిపోతున్నట్లు ఉంటుంది. అయితే ఇదేమీ శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. మీ జీవితంలో వెలుగులు నింపడానికి ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. మీదైన ఆలోచనా విధానమే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళుతుంది. అందరినీ ఒకేలా చూడాలన్న ఆలోచన కూడా మీకు ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) ఇప్పటివరకూ ఏ చెడు జరిగినా అదంతా మంచికే అని గ్రహించాల్సిన సమయం ఇది. కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి మిమ్మల్ని సిద్ధం చేసే ఆలోచన ఇదే. మీకు ఏది అవసరమో, మీ ఆలోచనలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతున్నాయో అటువైపే మీ అడుగులు వేయండి. మీకు పెద్దగా ఉత్సాహం లేని పనులు మాత్రం అస్సలు మొదలుపెట్టకండి. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయండి. త్వరలోనే మీ సమస్యలన్నీ సద్దుమణిగి జీవితం కొత్తగా మళ్లీ మొదలవుతుంది. కలిసివచ్చే రంగు : పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) గతాన్ని గురించి ఆలోచిస్తూ అద్భుతమైన భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ప్రస్తుతాన్ని బాగా ఆస్వాధించాల్సిన సమయం ఇది. మీ శక్తినంతా కూడగట్టుకొని భవిష్యత్‌ను నిర్మించుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆత్మ విశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. మీదైన శైలిని నమ్ముకొని ముందుకు వెళ్లండి. కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల కొత్త ఉత్సాహం పొందుతారు. మీకోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. విహారయాత్రలకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీదైన ఆలోచనా విధానాన్ని ఎప్పటికీ మార్చుకోవద్దు. విజయం మీవైపే ఉంది. కష్టపడి దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనను బలంగా నమ్మండి. పోటీ ప్రపంచంలో మీకొక గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు త్వరలోనే లభిస్తుంది. ఎక్కువ పనులు మీద వేసుకొని ఒత్తిడికి లోనుకావద్దు. ప్రేమ విషయం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ప్రేమ జీవితం మిమ్మల్ని కొన్నాళ్లుగా బాగా ఇబ్బంది పెడుతోన్న అంశం. ఈ వారంలో అన్నీ చక్కబడతాయి. ఈ విషయంలో మీరు కోరుకుంటున్న రీతిలోనే ఒక పూర్తి అవగాహన వస్తుంది. కొత్త జీవితం మొదలుపెడతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక విహారయాత్రకు వెళ్లండి. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వృత్తిరీత్యా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రేమ జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమన్వయం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితమంతా నిరాశాజనకంగా సాగుతుందని భావిస్తారు. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఇదే. అపజయాలు సర్వ సాధారణమనీ, వాటికి ఎదురెళ్లి నిలబడే ధైర్యం ఎప్పుడూ కోల్పోవద్దని తెలుసుకోండి. ఏది జరిగినా దానికి మూల కారణం మీరేనన్న విషయాన్ని నమ్మండి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు ప్రశాంతంగా ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. కలిసివచ్చే రంగు : తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) పరిస్థితులకు ఎదురెళ్లి ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం ఇది. ఊహలకు, వాస్తవ ప్రపంచానికి ఉన్న దూరాలను తగ్గించాలంటే, మీరు ఊహా ప్రపంచాలను వీడి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి సమాధానంగా ఓ గొప్ప విజయం చేకూరుతుంది. వృత్తి జీవితంలో మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఉన్నత పదవులు అలంకరిస్తారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : లేత గులాబీ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం మానండి. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. ఫలితం దానంతట అదే వస్తుందని నమ్మండి. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని, వారితో ప్రేమగా మెలగండి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు అలాగే ఉంటాయి. అయితే నమ్మకంతో, కాస్త విరామం తీసుకొని మీ జీవిత భాగస్వామికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేయండి. వృత్తి జీవితం కూడా ఊహించినంత ఆశాజనకంగా ఉండటం లేదు. కొద్దిరోజులు అన్నింటికీ దూరంగా ఒక విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ఆలోచనా∙విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితాన్ని నిరంతరం ఆస్వాధించడమే మన ఉన్నతికి పాటుపడే అంశమని గ్రహించి పనిచేయడం అలవర్చుకోండి. అనవసరమైన విషయాలను గురించి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విషయాలను గురించి ఎక్కువ ఆలోచించకండి. జీవితం మీద మీకున్న అభిప్రాయాలను చిన్న చిన్న అంశాలేవీ ప్రభావితం చేయకుండా చూసుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. అందులో మీ స్థాయికి తగ్గవాటినే ఎంచుకోండి. మీ చుట్టూనే కొందరు మీ అభివృద్ధికి అడ్డు పడుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) గతంలో జరిగిన పొరపాట్లను గురించే నిరంతరం ఆలోచిస్తూ కూర్చోకండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరన్న విషయాన్ని గ్రహించండి. వృత్తిరీత్యా కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వనిస్తోంది. ధైర్యంగా ఆ వైపుకు అడుగులు వేయండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ -
టారో : 17 సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వృత్తిరీత్యా పదోన్నతి పొందుతారు. ఏదీ కష్టపడకుండా పొందలేరని గ్రహించి పనిచేయండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, పనిలో మీదైన గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతర శ్రమ అవసరం. కొద్దికాలంగా మిమ్మల్ని కలవరపెడుతోన్న విషయాలన్నీ సద్దుమణిగి అంతా మంచే జరుగుతుంది. ప్రేమ జీవితంలో చిన్న కలవరపాటు. అయితే అది కూడా మంచికే అనుకోండి. కొద్ది రోజులు సంయమనంగా ఉండండి. మీరు అనుకున్నట్లుగా జీవితం సాగిపోతుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వృత్తిరీత్యా మీకు అన్నీ మంచి రోజులే! మీ జీవిత ఆశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయమిది. కష్టపడి పనిచేస్తే రానున్న రోజుల్లో మీరు కలలుగన్న స్థాయిని చేరుకుంటారు. పని, ప్రేమ జీవితం మధ్యన సంయమనం కుదుర్చుకోండి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని ప్రేమ జీవితాన్ని మరింత అందంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. కలిసివచ్చే రంగు : గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. ఎప్పట్నుంచో కోరుకుంటున్న మార్పు దగ్గరలోనే ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడిని పూర్తిగా మీద వేసుకొని కుమిలిపోకండి. కాస్త విశ్రాంతి అవసరమని గ్రహించండి. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వండి. త్వరలో విహారయాత్రకు సన్నాహాలు చేస్తారు. కలిసివచ్చే రంగు : గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఆధ్యాత్మిక అంశాల వైపుకు మీ ఆలోచనలు వెళతాయి. అది మీకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగవుతుంది. మీపై మీకున్న ఆత్మవిశ్వాసం చెదరకుండా చూస్కోండి. ధైర్యంగా పనిచేస్తూ వెళ్లండి. ప్రేమ విషయంలోనూ మనసు పెట్టి నిర్ణయం తీసుకోండి. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. మీరు కోరుకునే ఆనందం అక్కడే ఉంది. కలిసివచ్చే రంగు : నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ జీవితంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీదైన శైలిలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. చేపట్టే కొత్త పనులన్నీ విజయవంతం అవుతాయి. ప్రేమ జీవితం కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. ప్రశాంతంగా ఉంటూ మీ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచగలిగే ఆలోచన చేయండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మీదైన ఆలోచన విధానం, నడవడిక మీ ఉన్నతికి తోడ్పడేదని ఎప్పుడూ మరచిపోకండి. కలిసివచ్చే రంగు : తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోన్న సమస్యలు మరికొద్ది రోజులు కూడా అలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితులకు భయపడి నిరుత్సాహం చెందకండి. చెడు జరిగిపోతుందని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా పరిస్థితులపై పోరాడండి. ఆస్తి సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇల్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తూ, మీ కష్టాన్నంతా వెచ్చిస్తూ వస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడానికి మరెన్నో రోజులు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఈ వారమో, మరో రెండు వారాల్లోనో శుభవార్త వింటారు. అంతా మంచే జరుగుతుంది. జీవితమంతా కుదురుగా ఓ సరైన చోట ఆగినట్లు అనిపిస్తుంది. అదే మీరు కోరుకున్న సంతృప్తి అని బలంగా నమ్మండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈ వారమంతా మీరు ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. రానున్న రోజులు కూడా ఇంతే ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. జీవితమంటేనే వేడుక అని మీరు నమ్మే సిద్ధాంతాన్నే ఎప్పటికీ మరవకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు : నీలం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) అనాలోచిత నిర్ణయాలు తీసుకొని తడబడతారు. అయితే అది మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మీ అనుభవానికి తగ్గ పనులు చేస్తూ ఉండండి. మీ ఆలోచనల్లో మీ స్థాయి ఉండడం లేదన్న విషయం గమనించండి. అదే మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన అంశం కూడా! మార్పు కోరుకుంటున్నట్లయితే ఇదే సరైన సమయం. ప్రేమ జీవితంలోనూ కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఈ పరిస్థితులన్నీ మీ ఆలోచనలను విపరీతంగా ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడండి. కలిసివచ్చే రంగు : గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి. మీ ఆలోచన విధానం, ఆత్మవిశ్వాసమే మీకు ఆయుధమన్న విషయాన్ని నమ్మండి. మీ బలమేంటో ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయమిది. కొత్త అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. మీకు ఎంతగానో ఉపకరించే ఆ అవకాశాలను వదులుకోవద్దు. ఏదైనా పని మొదలుపెట్టి మధ్యలోనే వదిలిపెట్టే ఆలోచనలు చేస్తున్నట్లైతే అలాంటివి మానుకోండి. కలిసివచ్చే రంగు : నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) భవిష్యత్‌పై నమ్మకాన్ని సడలనివ్వకండి. ఇప్పుడు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తోన్న పరిస్థితులన్నీ తాత్కాలికమేనని నమ్మండి. కొద్దికాలంగా ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్య సమస్యలన్నీ సర్దుకుంటాయి. ప్రేమ జీవితం కాస్త కలవరపరుస్తుంది. ఎక్కువ ఆలోచించి నిరాశ చెందకండి. ఏ కొత్త అవకాశం మీకోసం ఎదురుచూస్తున్నా, ఇదే సరైన సమయమని నమ్మి ముందుకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : పసుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) పిల్లలు, ఉద్యోగం, జీవితం మీద అభద్రతా భావం మిమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఇదేమీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారికి కాస్త సమయం కేటాయించాలన్న విషయం మరవకండి. బంధాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకోండి. కలిసివచ్చే రంగు : ఎరుపు -
టారో : 10 సెప్టెంబర్ నుంచి 16 సెప్టెంబర్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడమన్నదే మీ ఉన్నతికి అడ్డుపడుతున్నదని గ్రహించండి. ప్రతికూల ఆలోచనలను పూర్తిగా దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. చెడు వ్యసనాలకు దూరం అయ్యేందుకు ఇదే సరైన సమయం. చేసే పని మీద శ్రద్ధ పెడితే విజయం మీవైపే ఉంటుంది. ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కలిసివచ్చే రంగు : బూడిద వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్తగా మొదలుపెట్టిన మీ పనులన్నీ విజయవంతమవుతాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసమే మీ పెట్టుబడి అని నమ్మండి. వృత్తి రీత్యా పెద్ద పదవిని అలంకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పదవిని ధైర్యంగా స్వీకరించి మీదైన ముద్ర వేయండి. కొన్ని ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. సవాళ్లకు భయపడకుండా వాటిని ఎదుర్కొండి. కలిసివచ్చే రంగు : నీలం మిథునం (మే 21 – జూన్ 20) కొద్దికాలంగా అభద్రతతో కష్టంగా జీవితం వెళ్లదీస్తున్న మీకు ఇకపై వచ్చేదంతా మంచి కాలమే! మీ శక్తులేంటో, మీరు చేయగలిగింది ఏంటో సమీక్షించుకోండి. స్థిమితమైన ఆలోచనలు వచ్చేవరకూ ఏ కొత్త నిర్ణయాన్నీ తీసుకోకండి. ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ముందు భయాలన్నింటినీ దూరం చేసుకోండి. మీరు ప్రేమించిన వ్యక్తి మీకు మరింత దగ్గరవుతారు. వారి రాకతో మీ జీవితం కొత్త వెలుగులు నింపుకుంటుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ జీవితాన్ని మలుపు తిప్పే విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విజయం మీకు త్వరలోనే వస్తుంది. నిరాశ చెందకుండా పనిచేస్తూ ఉండండి. మీ నమ్మకమే మీకు ఆయుధం. వృత్తిరీత్యా కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. అది మీ మంచికే అని నమ్మండి. ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పట్నుంచో కారు కొనాలని భావిస్తున్నట్లైతే వెంటనే వెళ్లి కొనేయండి. ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ప్రేమ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. మీరిప్పుడు ఇదే విషయం గురించే ఆలోచించకపోయినా మీ జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు మీ ఇష్టాలేంటో జాగ్రత్తగా గుర్తించండి. ఎందుకంటే ఆ నిర్ణయం మీ జీవితం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుంది. వృత్తిరీత్యా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పు మీకు మంచే చేస్తుందని విశ్వసించండి. కలిసివచ్చే రంగు : నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇప్పటివరకూ కష్టంగా చేస్తూ వస్తోన్న పనికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఇది. కొన్ని ఊహించని అవకాశాలు మీ తలుపు తడతాయి. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఆ అవకాశాలను నిర్లక్ష్యంతో దూరం చేసుకోకండి. మీరు కోల్పోయిన ఉత్సాహమంతా తిరిగి వస్తుంది. అదే ఉత్సాహంతో పనిచేయండి. విజయాన్ని త్వరలోనే ఆస్వాదిస్తారు. పనులన్నీ చకచకా జరిగిపోతాయి. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఏ పనీ సరిగ్గా జరగడం లేదని చింతిస్తూ కూర్చోకండి. ఇదంతా తాత్కాలికమేనని, ముందున్నది అంతా మంచి కాలమే అని నమ్మండి. ఎవరికోసమో, దేన్నో త్యాగం చేస్తూ కూర్చోకుండా మీ ఉన్నతికి తోడ్పడే పనులను మీదైన శైలిలో చేస్తూ వెళ్లండి. అంతా గందరగోళంగా తయారైనట్లు కనిపిస్తే, భయపడిపోకండి. అన్నీ క్రమంగా సర్దుకొని జీవితమంతా సాఫీగా సాగుతుంది. కలిసివచ్చే రంగు : గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ప్రేమ జీవితంలో ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న పరిణామానికి ఇదే సమయం. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో, ఏ పని చేసినా విజయం సాధించగలమన్న ధీమాతో ముందుకు వెళ్లండి. వృత్తి పరంగా మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త పనిలో ఉత్సాహంగా ఉంటారు. మీరు పనిచేసే చోట ఎనిమిది నారింజ పండ్లు ఉంచుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఒంటరితనాన్ని కొద్దికాలంగా బాగా ఇష్టపడుతూ వస్తున్నారు. జీవితం ఏ వైపు వెళుతుందోనన్న అనుమానం మిమ్మల్ని అలాగే వెంటాడుతుంది. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయకుండా చూసుకోండి. కొంత విశ్రాంతి తీసుకోండి. అంతా చక్కబడుతుంది. అనాలోచితంగా ఏ నిర్ణయమూ తీసుకోకండి. ఒత్తిడికి లోనుకాకండి. ఏదైనా విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. మీకు విశ్రాంతి ఎంతో అవసరం. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. అనాలోచితంగా తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. మీ అనుభవాన్ని సరిగ్గా వాడుకోండి. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. పరిస్థితుల నుంచి తప్పించుకోకుండా మీదైన శైలిలో ధైర్యంగా ఎదుర్కోండి. ఎక్కువ శ్రమ పడకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్లండి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఏదో చెడు జరగబోతోందని మిమ్మల్ని మీరే నిరుత్సాహపరచుకోకండి. ప్రస్తుతానికి మీరు కోరుకున్నట్లుగా పనులేవీ జరగకున్నా, తాత్కాలికమేనని గ్రహించండి. కొన్ని రోజులు ఓపిక పడితే ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. భయపడకుండా మీ పని మీరు చేస్తూ వెళ్లండి. దీన్నే అలవాటుగా మార్చుకుంటే కోరుకున్నవన్నీ క్రమక్రమంగా జరుగుతాయి. కలిసివచ్చే రంగు : గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఎన్ని అవాంతరాలు ఎదురైనా నమ్మకమే మీ ఆయుధం. ఆ నమ్మకంతోనే పనిచేయండి. ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగం మారాలనో, మీకిష్టమైన రంగం వైపుకు వెళ్లాలనో... ఇలా మీ ఆలోచనల్లో ఏ కొత్త విషయం కోరుకుంటున్నా ఆ వైపు నిస్సంకోచంగా అడుగులు వేయండి. కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. కలిసివచ్చే రంగు : పసుపు -
టారో : 3 సెప్టెంబర్ నుంచి 9 సెప్టెంబర్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే నిర్ణయం తీసుకోబోతున్నారు. వినాయకుడి ఆశీస్సులు మిమ్మల్ని వెన్నంటే ఉంటాయి. ఉద్యోగంలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొలిక్కిరాకుండా ఇబ్బంది పెడుతోన్న ప్రాజెక్టు ఈ వారం విజయవంతంగా పూర్తవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీవైపే ఉంటుందని మరవకండి. న్యాయ సంబంధిత విషయంలో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కలిసివచ్చే రంగు : ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ ఆలోచనా తీరు, పద్ధతులను చక్కబెట్టుకునేందుకు మంచి సమయమిది. వృత్తిపరంగా ఉన్న ఇబ్బందులు సర్దుకుంటాయి. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయం మీవైపే నిలుస్తుంది. వినాయకుడిపై నమ్మకం ఉంచండి. కొత్త పదవిని అలంకరిస్తారు. మీదైన శైలిలో నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని కొత్త పదవిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీ నాయకత్వంలో పనిచేస్తున్న వారు మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తారు. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) మీ ప్రణాళికలను సమీక్షించుకోవాల్సిన సమయమిది. కొత్త కోణంలో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితమంతా ఓ దగ్గర ఆగిపోయినట్టు, ఇక ముందుకు కదలడం లేదేమో అనిపిస్తూ ఉన్నట్లైతే, ఇదంతా తాత్కాలికమేనని నమ్మండి. ముందంతా మంచే జరుగుతుంది. వినాయకుడిని ఇష్టంగా పూజించండి. కొత్త ఉత్సాహంతో జీవితం అందంగా తయారవుతుంది. కలిసివచ్చే రంగు : లేత గోధుమ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ జీవితాన్ని మలుపుతిప్పే మార్పు చోటు చేసుకుంటుంది. వినాయకుడిని ఇష్టంగా కొలవండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. అడ్డంకులేవైనా ఎదురైనట్లు కనిపించినా, అదంతా తాత్కాలికమే. విజయంపై ధీమాతో కష్టపడండి. జిమ్‌లో చేరాల్సిన సమయమిది. బరువు తగ్గే ఆలోచన చేయండి. కలిసివచ్చే రంగు : వెండి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ జీవితానికి ఎంతో ప్రత్యేకమైన ఓ విషయంలో అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వినాయకుడిని పూజించండి. మీరు తీసుకునే నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ ఆలోచనలను చెడు వైపుకు మళ్లించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అలాంటి వారికి దూరంగా ఉంటూ జాగ్రత్త పడండి. మీ విశ్వాసాలను బలంగా చెప్పడం అలవర్చుకోండి. కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. నమ్మకంతో ఆ బాధ్యతలను చేపట్టండి. కలిసివచ్చే రంగు : నలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీకు రానున్నదంతా మంచి కాలమే. మీరు కలలో కూడా సాధ్యపడదు అనుకున్న పనులు కూడా చక్కగా జరుగుతాయి. మంచి గుర్తింపు సంపాదిస్తారు. కొత్తగా మొదలుపెట్టే పనులన్నింటిపై నమ్మకం ఉంచి ముందడుగు వేయండి. విజయం మీవైపే ఉంటుంది. మీపై మీరు నమ్మకం ఉంచడం మరవొద్దు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు వ్యాయామం చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త కలవరపెడుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. కలిసివచ్చే రంగు : తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవడమే జీవితంలో ఒడిదుడుకులకు కారణం అన్నది తెలుసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం అలవర్చుకోండి. జీవితంలో గొప్ప నిర్ణయాలు తీసుకొని ౖపైకి ఎదిగే సమయమిదే. మీకు ఇష్టమైన వ్యక్తి ఇచ్చే సూచనలు పాటించండి. కొత్త పనులు మొదలుపెడతారు. సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. కొంత కాలంగా పూర్తి చేయాలనుకుంటున్న ఇంటి పనులు కొన్ని పూర్తవుతాయి. మానసిక ఉల్లాసానికి విహారయాత్రకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. కొత్తగా, ఉత్సాహంగా, మీదైన శైలిలో సవాళ్లను ఎదుర్కొండి. మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. కొన్ని రోజుల పాటు ఏదైనా విహార యాత్రలకు వెళ్లండి. ఈ యాత్రతో మీకు ప్రశాంతత చేకూరడంతో పాటు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సాహించే వ్యక్తులతో బాగా మాట్లాడండి. కలిసివచ్చే రంగు : ఊదా ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త విషయాలు తెలుసుకోవాలన్న మీ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించండి. వినాయకుడిపై నమ్మకం ఉంచి పనిచేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం మీకు మరింత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీకు ఇష్టమైన తత్వశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండండి. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) జీవితాన్ని మీరు కోరుకునే విధంగా మలుచుకునే సమయం ఇదే. మీపై మీకున్న నమ్మకంతో నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన ప్రమాణాలు, మీకు మీరే ఏర్పరచుకున్న నియమాలను గుర్తు తెచ్చుకొని పనిచేయండి. పెద్దలను గౌరవించడం మరవకండి. వారి ఆశీస్సులు మీకు మరింత శక్తినిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటారు. ఇది మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సోమవారాలు మీకు బాగా కలిసివస్తాయి. కలిసివచ్చే రంగు : నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) రానున్న రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ధైర్యంగా ముందడుగు వేసే మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. జీవితాన్ని ఎప్పట్లానే బాగా ఆస్వాదించండి. వృత్తిపరంగా మీకు గొప్ప గుర్తింపు దక్కుతుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ మంచి పని కూడా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనవసర ఖర్చులు చేస్తారు. ఇదే విషయంపై విపరీతంగా ఆలోచిస్తారు కూడా. మీ గమ్యం వైపుకు సరైన అడుగులు వేయాల్సిన సమయమిది. మీకు ఉపకరించే కొన్ని పనుల నుంచి మీకై మీరే దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని మీకేం కావాలో నిర్ణయించుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. లాఫింగ్ బుద్ధను ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఆదివారాలు మీకు బాగా కలిసివస్తాయి. కలిసివచ్చే రంగు : బూడిద -
టారో : 27 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) జీవితాన్ని చూసే మీ దృష్టి కోణంలో మార్పుకు ఇదే సరైన సమయం. మిమ్మల్ని ప్రస్తుతం వెంటాడుతున్న భయాలు అలాగే కొనసాగుతాయి. కాస్తంత సమయమిస్తే అన్నీ అవే సర్దుకుపోగలవని గ్రహించండి. అవకాశాలు వాటంతట అవే మీ తలుపు తడతాయి. ప్రేమ విషయంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో ముందుకు వెళితే పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి. కలిసివచ్చే రంగు : ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న, జీవితాన్ని మలుపు తిప్పే విషయాల్లో జాగ్రత్త వహించండి. గత వారంతో పోల్చితే ఈ వారం అంత సాఫీగా ఏదీ జరగదు. అయితే దీన్ని కూడా మంచికే అనుకొని ముందుకు వెళ్లండి. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే జీవితం ఉంటుందన్నది అర్థం చేసుకోండి. ఉద్యోగం, ప్రేమ జీవితానికి మధ్య సమన్వయం ఉండేలా చూసుకుంటే పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్లండి. అనవసరమైన విషయాలపై శక్తినంతా కేంద్రీకరించి నిరాశ చెందవద్దు. మీకు అన్నివిధాలా అనుకూలించే పనులనే చేయండి. ప్రేమ విషయంలో ఓ గొప్ప రోజు దగ్గరవుతోంది. పాత మిత్రుడిని మళ్లీ కలుసుకుంటారు. మనసుతో కంటే బుద్ధితో ఆలోచించడం మీకు పనికొస్తుంది. కుటుంబ సంబంధిత విషయాలన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. కలిసివచ్చే రంగు : దొండపండు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ధైర్యంగా, నమ్మకంతో ముందడుగు వేయండి. తడబడకుండా, మీ శక్తినంతా కేంద్రీకరించి కష్టపడండి. విజయం మీ వైపే ఉన్నదని మరవకండి. ఈ వారం మీకు కలిసివస్తుంది. మీ కష్టానికి తగిన ఫలం దక్కుతుంది. మీ జీవితభాగస్వామిని కలుసుకుంటారు. ఒక కొత్త విషయం చదవాలని అనుకుంటే, అది వెంటనే చేసేయండి. అది మీకు కొత్త దారులను చూపిస్తుంది. మీ ప్రేమ జీవితం సజావుగా సాగిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. కలిసివచ్చే రంగు : దొండపండు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉత్సాహవంతమైన వారమొకటి మీకోసం ఎదురుచూస్తోంది. ఏది జరిగినా మీ మంచికే జరుగుతుందని నమ్మడం అవసరం. మీ నమ్మకమే మిమ్మల్ని విజయం వైపుకు తీసుకెళ్తుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం సాఫీగా ఉంటుంది. బిజినెస్‌లో కూడా మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొత్తగా ఏదైనా మొదలుపెట్టాలన్న ఆలోచనలో ఉంటే, వెంటనే ఆ పని చేసేయండి. పనిలో గౌరవం, గుర్తింపు దక్కుతాయి. కలిసివచ్చే రంగు : ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీలా ఉండడమన్నదే మీకు గొప్ప ఆభరణం. ఈ కారణం వల్లే మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారు. కొత్త పని ఒకటి మొదలుపెట్టేందుకు జంకుతారు. అయితే విజయం మీదేనని గుర్తుంచుకోండి. మీ నిరంతర శ్రమే మిమ్మల్ని విజయం వైపుకు అడుగులు వేయిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అన్నీ వ్యక్తిగా మీ స్థాయిని పెంచేవే. ఇష్టమైన వ్యక్తిని కలుసుకుంటారు. ఇల్లు లేదా ఉద్యోగం మారే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ఫీరీ ఆరెంజ్ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఒక కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. గతాన్ని మరచిపోయి రానున్నదంతా మంచి కాలమే అని నమ్మడం అవసరం. ఎన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురైనా, చివరకు అదీ ఓ చోట ఆగుతుందని గుర్తించండి. సెప్టెంబర్ నెలంతా మీరు ఊహించని స్థాయిలో మార్పులు వస్తాయి. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. విహారయాత్రకు వెళ్లాలన్న ఆలోచన ఏదైనా ఉంటే వెంటనే అందుకు సిద్ధంకండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీరు ఎదుర్కొంటున్న కష్టాలే మీలో దాగున్న శక్తినంతా బయటకు తీసుకొస్తాయి. అపజాయలు ఎదురైనా ధైర్యంగా మీ బాధ్యతను నిర్వహిస్తూ ఉండండి. విజయం మీదే. కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. విరామం లేకుండా పనిచేస్తారు. విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమలో ఉన్నట్లైతే మీకు ఓ మంచి జరగబోతోంది. ఉల్లాసంగా ప్రేమ జీవితాన్ని ఆస్వాదించండి. ఇంట్లో మీ పిల్లలు సైతం మీ పేరు నిలబెడతారు. కలిసివచ్చే రంగు : పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొద్దికాలంగా మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోన్న ప్రతికూల పరిస్థితులకు తెరపడుతుంది. ఇకపై అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో పని చేయండి. విరామం లేకుండా పనిచేస్తూ మీకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పెద్దల సలహాతో ముందుకు వెళితే ప్రేమ జీవితం మరింత అందంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారం మీకు ఒక పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది. జీవితంలో ఇలాంటివి సర్వ సాధారణం అనుకుంటే మిమ్మల్ని ఏ శక్తీ ఆపలేదు. తల్లిదండ్రుల దగ్గర్నుంచి ఊహించని బహుమతి లభిస్తుంది. పాత అప్పులన్నీ తీరే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌లో వైద్యుడిని సంప్రదించే అవసరం వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది కలిసివచ్చే రంగు : ఆపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఉత్సాహంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీ శైలి మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళుతుంది. మీ ఆలోచన శైలి వల్లే మీకు పనిలో తిరుగులేని పేరు వస్తుంది. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే పరిస్థితులు అన్నీ చక్కబడతాయి. కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఇది మీకు బాగా ఉపయోగపడే అంశం. ఎప్పట్నుంచో కంటున్న కలలు నెరవేరే రోజు దగ్గర పడుతోంది. గతాన్ని ఎక్కువగా తల్చుకోకుండా ఉండడం అవసరం. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి. కలిసివచ్చే రంగు : తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల శక్తి మీకు సమకూరుతుంది. జీవితాన్ని మీదైన శైలిలో ఆస్వాదించాలన్న మీ ఆలోచనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందరితో కలిసిపోవడాన్ని అలవర్చుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తారు. మీ పనే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళుతుంది. ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఇబ్బందులు ఎదురైనా ఆత్మ విశ్వాసంతో పని చేయండి. పనిలో ఒక మైలురాయిని చేరుకుంటారు. న్యాయ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కలిసివచ్చే రంగు : వెండి -
టారో : 20 ఆగస్టు నుంచి 26 ఆగస్టు 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారం మీరు కొంత మందకొడిగా, బద్ధకంగా ఉంటారు. ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా, సరదాగా గడుపుదామా అని ఎదురు చూస్తుంటారు. ప్రేమ సఫలమవుతుంది. ఇష్టమైన వారితో, మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం బాగుండదు. ఆందోళన పడవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. వారాంతంలో విందు వినోదాలలో మునిగి తేలుతారు. కలిసొచ్చే రంగు: లేతాకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఆస్తుల కొనుగోలు కోసం మదుపు చేస్తారు. మీలో ఈవారమంతా ఆశ్చర్యానందాలు కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. డబ్బు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతుంది. వెనకటి తప్పులను పునరావృతం చేయవద్దు. కెరీర్‌పరంగా రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి. దూరప్రయాణం ఉండొచ్చు. చిక్కు సమస్యలలో ఉన్న మిత్రులను మీ తెలివితేటలతో బయట పడేసి, వారి అభిమానాన్ని చూరగొంటారు. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) మీ శక్తి సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు వస్తుందతి.. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగం లేదా పెళ్లి కోసం ఎదురు చూసే వారికి అనుకూల ఫలితాలుంటాయి. కలిసొచ్చే రంగు: దొండపండు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కొత్త బంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. వృత్తిపరమైన చిక్కులు, చికాకులు తొలగి మీకంటూ ఒక దారి ఏర్పడుతుంది. ఏది ముందో, ఏది తర్వాతో, ఏది ముఖ్యమైనదో, ఏది కాదో అవగాహన ఏర్పరచుకుని తగ్గట్టు మెలగకపోతే మీరు ఎదగడం కష్టం. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మనసును సానుకూల భావనలతో నింపుకోండి మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: ముదురు నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఊహాలోకంలో విహరించడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలు పెడతారు. అదే మీకు అదృష్టాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. మీ ప్రతిభకు సామాజిక మాధ్యమాలలో మంచి ప్రచారం లభిస్తుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. తెలివితేటలతో నడుచుకోవడం వల్ల ఆదాయం కూడా బాగానే ఉంటుంది. విందు వినోదాలలో సంతోషంగా గడుపుతారు. అయితే, ఆరోగ్యపరంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఈ వారమంతా ఆఫీస్పరమైన ప్రయాణాలు ఉంటాయి. అయితే, వారాంతంలో కుటుంబంతో పిక్నిక్కు వెళతారు. అందరినీ కలుపుకుని పని చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఎంతోకాలంగా మీరు కంటున్న కలలు కార్యరూపం దాలుస్తాయి. పనిలో మాత్రం బద్ధకాన్ని వదిలించుకుని, మరింత చురుకుగా, మరింత అంకిత భావంతో ఉంటేనే మీ లక్ష్యాలను చేరుకోగలరని తెలుసుకుంటారు. మెడ లేదా తల నొప్పి బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: ఊదా రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితం మీద కొత్త ఆశలు చిగురిస్తాయి. పనిలో సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ఖర్చులు తగ్గించుకుని, అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. మీ ఆదాయ వనరులకీ, మీ కోర్కెలకీ మధ్య సమన్వయం సాధిస్తే కానీ మీ బడ్జెట్ లోటు పూడదని గ్రహిస్తారు. అనవసర వివాదాలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా నేర్పుగా తప్పుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థికంగా చాలా బాగుంటుంది. భూమి కొనుగోలు చే స్తారు లేదా భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. జీవితంలో కొత్త మార్గాన్ని, గమ్యాన్నీ ఎంచుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు భావోద్వేగంతో ఉంటారు. మీ ప్రేమ సఫలం కాలేదనో, పెళ్లి సంబంధం చేజారిపోయిందనో దిగులు పడవద్దు. మరో మంచి వ్యక్తి మీకోసం వేచి ఉన్నారని అర్థం చేసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. కలిసొచ్చే రంగు: నలుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. మీ ఎదుగుదలకు మీ కోరికలే అడ్డుపడుతున్నాయని గ్రహించి, వాటి మీద నియంత్రణ సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. మీ పిల్లలకు, కుటుంబానికి ఆనందం కలిగిస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం కాదు. ఎంతోకాలంగా దూరంగా ఉన్న ఒక ఆత్మీయుడిని లేదా స్నేహితుని కలుస్తారు. డిప్రెషన్ నుంచి బయపడే ప్రయత్నం చేస్తారు. కలిసొచ్చే రంగు: ఇటిక రాయి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) పాత బాకీల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. బృందంతో కలసి పని చేసి మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. మీ సన్నిహితులకు కూడా మీరు ఏమి చేయాలనుకుంటున్నదీ చెప్పకండి. ఒక పెద్దమనిషి సహకారంతో త్వరలోనే మీ కోరికలన్నీ తీరతాయి. అందరితోనూ సామరస్యంగా మెలగడం వల్ల మనశ్శాంతి అని తెలుసుకుంటారు. కలిసిచ్చే రంగు: నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అదృష్టం మీ వెనకే ఉందా అన్నట్లుగా, ఈ వారమంతా మీకు అనుకూలంగా గడుస్తుంది. తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాల్యజ్ఞాపకాలలో మునిగి తేలుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు. అనవసర వివాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, వాదోపవాదాలు జరగకుండా జాగ్రత్త అవసరం. పరిశోధన అధ్యయనం మీకు మేలు చేస్తుంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉండవచ్చు. కొత్త శక్తి పుంజుకుంటారు. విదేశాలనుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల దిశలో పయనిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత. ఆసక్తికరమైన వార్తలు వింటారు. కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటారు. జలుబు, సైనస్ సమస్యలు బాధించవచ్చు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. మీ ఆలోచనలే మీకు మేలు చేస్తాయి. కలిసొచ్చే రంగు: పసుపు -
టారో : మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
ఆర్థిక, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేస్తేనే ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులు ఈ వారం మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతోనూ, సహోద్యోగులతోనూ వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. కలిసివచ్చే రంగు: దొండపండు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆఫీసులో పనులు చాలా వేగంగా ముందుకు జరుగుతాయి. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. కలిసి వచ్చే రంగు: నారింజ మిథునం (మే 21 – జూన్ 20) మీ వాక్పటిమ, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. తోటివారితోనూ, ఇరుగు పొరుగుతోనూ స్నేహంగా మెలుగుతారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. మనసు చెప్పిన మాట విని, దాని ప్రకారం నడచుకోండి. గొంతునొప్పి బాధించవచ్చు. ప్రకృతి చికిత్సతో ఉపశమనం పొందుతారు. కలిసి వచ్చే రంగు: వెండి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు కొద్దిపాటి ఆశాభంగం తప్పదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి, కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. ఒకోసారి గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు. కలిసొచ్చే రంగు: గులాబీ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఊహాలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. దానివల్ల పనులు కుంటుపడతాయి. మీ విజ్ఞానంతో, ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా మీకు స్వాంతన లభిస్తుంది. ప్రేమ ఫలిస్తుంది. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. కలిసి వచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: బూడిద ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొహమాటం వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కలిసి వచ్చే రంగు: తెల్లటి తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. వారు చెప్పిన మాట వింటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ -
టారో : 6 ఆగస్టు నుంచి 12 ఆగస్టు 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ వారం చాలా సంతోషంగా, అదృష్టవంతంగా గడుస్తుంది. అయితే మీ అలవాట్లను, నమ్మకాలను మార్పు చేసుకోవలసిన తరుణమిది. కెరీర్‌పరంగా కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. తిరస్కరణలు, చిన్న చిన్న అవమానాలు ఎదురయే అవకాశం ఉంది. ఇంతమాత్రానికే మనసు పాడు చేసుకోవద్దు. ఈ దశకు త్వరలోనే ముగింపు వుంది. ఎమ్మెన్సీలో ఉద్యోగస్థులకు ప్రమోషన్లు ఖాయం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అనుకున్నదానిని సాధించేందుకు సర్వశక్తులూ సమీకరించుకుంటారు. మొదటినుంచి అదే మీ బలం, బలహీనత. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లేదా సమతూకం సాధించడం మంచిది. మూసధోరణి నుంచి బయటకి వచ్చి కొత్త ఆలోచనలు చేస్తే మీరు బాగా లాభపడతారు. మీరు నిజంగా మార్పును కోరుకుంటుంటే, అది ఈ వారంలోనే సంభవిస్తుంది. పనికీ, ప్రేమవ్యవహారాలకు ముడిపెట్టద్దు. కలిసొచ్చే రంగు: గోధుమరంగు మిథునం (మే 21 – జూన్ 20) రాబోయే నెల మీకు కొంచెం స్థబ్ధుగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ పని చేయడానికీ, ఎక్కడికైనా వెళ్లడానికీ మనస్కరించదు. ఒక విధమైన దిగులు, ఆందోళన, నిస్తేజం అలముకుని ఉంటుంది. అందువల్ల మీకు మీరే పని కల్పించుకుని, పునరుత్తేజం పొంది, చురుగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయడం మంచిది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. బహుళజాతి సంస్థలలో పని చేసేవారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కలిసొచ్చే రంగు: దొండపండు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) లక్ష్యసాధనకోసం మీ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసి రావచ్చు. అయితే ముఖ్యమైన, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇది అనుకూల కాలం. నిజంగా మీరు గనక మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఈ వారంలోనే కలగవచ్చు. అయితే, పనికీ, ప్రేమకూ మధ్య సమతుల్యాన్ని సాధించక తప్పదు. గతంలో చేసిన తప్పుల నుండి గుణపాఠాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. కలిసొచ్చే రంగు: నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) అనవసర భయాలను, ఆందోళనలను వదిలించుకుని, ప్రాక్టికల్‌గా ఉండండి. భయంకరమైన సంఘటనలు, కథలకు దూరంగా ఉండండి. అభద్రతాభావాన్ని విడిచిపెట్టండి. అప్పుడే మీకు ఆనందానికి అర్థం తెలుస్తుంది, ఆనందించడం తెలుస్తుంది. నిజానికి మీరెంతో అదృష్టవంతులు. మీ శక్తిసామర్థ్యాలను వెలికితీసి, వాటిని వినియోగంలోకి పెడితే మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆనందం, విజయం మీ వెంటే ఉంటాయీ వారం. ఇంటిని ఆధునీకరించుకునేందుకు ఇది తగిన సమయం. చాలా కాలంగా మీరు చేపట్టి ఉన్న ప్రాజెక్టు ఒకటి విజయవంతంగా పూర్తి చేస్తారు. గతనెలలో మిమ్మల్ని బాధించిన సమస్యలనుంచి బయటపడతారు. జీవితమనే పడవలో అపరిచిత బాటసారిలా ప్రయాణించండి. పడవ ఎటు తీసుకెళితే అటు వెళ్లండి. మీ ప్రేమ ఫలిస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశ, ఆనందం, ఆత్రుతల న డుమ ఈ వారం గడుస్తుంది. సాహసాలు చేస్తారు. జీవితంలో ఒకసారి పడ్డవారే తిరిగి నిలదొక్కుకుని, మరిన్ని విజయాలు సాధిస్తారని గుర్తు తెచ్చుకోండి. నిరాశపడకండి. ఒకదాని వెనుక ఒకటి అవకాశాలు వెల్లువెత్తుతాయి. మీ విజ్ఞానాన్ని, ఆలోచనా పరిధిని పెంపొందించుకోండి. మంచి గ్రంథాలు అందుకు చదవండి. పదేపదే గతంలోకి తొంగి చూసుకుంటూ, మానుతున్న పాతగాయాలను రేపుకోవద్దు. కలిసొచ్చే రంగు: దొండపండు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) సహనం, ఓపిక మీకు బాగా అవసరం. భవిష్యత్తు కోసం మీరు గతంలో బాగా శ్రమించారు. ఇప్పుడు ఆ ఫలాలను అందుకోబోతున్నారు. సానుకూల భావనలతో ఉండటం వల్లే జీవితప్రయాణం సానుకూలమవుతుందని గ్రహించండి. పాజిటివ్ ఆలోచనలను నింపుకునే వారే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనగలరు కూడా. కొత్త ప్రాజెక్టులు, కెరీర్ అవకాశాలు, కొత్త బాధ్యతలు వెదుక్కుంటూ వస్తాయి, మీ ధోరణిని బట్టి, మీ పనితీరును బట్టి. కలిసొచ్చే రంగు: గులాబీ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ లక్ష్యాలను చేరుకోవడానికి, ఆశయాలను సాధించడానికి మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, ఈ ప్రయాణ ం కొంచెం కష్టంగా ఉండవచ్చు. అంతమాత్రాన విసిగి వేసారి, మీ ప్రయాణం ఆపేశారనుకోండి, గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మీ తెలివితేటలను ధనార్జనకు ఉపయోగించండి, అదీ సక్రమ మార్గంలో...దీర్ఘకాల సమస్య ఒక కొలిక్కి వస్తుంది. మీ భాగస్వామితో సత్సంబంధాలు కలిగి ఉండండి. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భాగస్వామ్య వ్యవహారాలకు ఇది అనుకూల కాలం. పనిని సులభతరం చేయడానికి మీరు కనుగొన్న కొత్త మార్గాలు, పథకాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఫలప్రదం అవుతాయి. కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. పాతవాటి గురించి మరచిపోండి. ఒక అపురూపమైన బహుమతి అందుకుంటారు. పాత బాకీలు‡తీర్చేస్తారు. మరింత చురుగ్గా, ఉత్సాహంగా పని చేయండి. ఆరోగ్యం కోసం ఏదైనా జిమ్‌లో చేరండి లేదా వ్యాపకాన్ని అలవరచుకోండి. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కొద్దిగా మూడీగా, దిగులుగా ఉంటారు. సంతానపరంగా సంతోషం కలిగించే వార్తలు వింటారు. మీ కోరికను నెరవేర్చమని మనసులో బలంగా కోరుకోండి, జరిగి తీరుతుంది. మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వారాంతంలో విందు వినోదాలలో మునిగి తేలుతారు. కలిసొచ్చే రంగు: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తను, శ్రద్ధను కనబరచవలసిన సమయమిది. మీ పరిధిలో మీరుండండి. త్వరలోనే అపరిచితుల నుంచి కొత్త తరహా సవాలును ఎదుర్కొనవలసి రావచ్చు. సిద్ధంగా ఉండండి. సామాజికంగా విందువినోదాలతో చాలా బిజీగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. పని మీద దృష్టి, శ్రద్ధ పెట్టండి. కోరికలకు లొంగిపోవద్దు. దూరప్రయాణాలు ఉండవచ్చు. వాటిని ఎంజాయ్ చేస్తారు కూడా! కలిసొచ్చే రంగు: మెరుస్తున్న పసుప్పచ్చ -
టారో : 30 జూలై నుంచి 5 ఆగస్టు 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. మీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది. కలిసొచ్చే రంగు: దొండపండు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఇల్లు లేదా ఆఫీసు మారతారు. మారిన చోట ఇంతకన్నా బాగుంటుంది. కలిసొచ్చే రంగు: లేత పసుపు మిథునం (మే 21 – జూన్ 20) ఈ వారం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. మార్పును స్వాగతించండి. మంచి జరుగుతుంది. కలిసొచ్చే రంగు: ముదురు నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారం మీరు మాట్లాడే ప్రతిమాటా నిజం అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఆఫీసులో పనిభారమూ పెరుగుతుంది. పనులు ఆలస్యం అవవచ్చు. పాత ఆలోచనలనే అమలు చేస్తారు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ వెనకాల గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: దొండపండు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన ఒక వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. భావసారూప్యత గల ఒక వ్యక్తితో పరిచయం జరుగుతుంది. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుందని తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి విందుకు ఆహ్వానం అందడం లేదా మీరు ఇవ్వడం జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడతారు. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. మీరు ఎంతో ప్రేమగా, అభిమానంగా చూసుకునే వ్యక్తి మీకు ఎదురు తిరుగుతారు. బాధపడవద్దు. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ ఆలోచనలేమిటో మీరు అన్నది ఈ వారం మీ విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. మీ పని విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకోండి, తటపటాయించకుండా మీ మార్గదర్శిని కలిసి సలహా తీసుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. కలిసొచ్చే రంగు: లేత నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగంలో, పనిలో లేదా వృత్తిలో ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు వస్తుంది లేదా మీరు ఆశించిన మార్పును ఆమోదించడానికిది తగిన సమయం. ఈ మార్పు కాలంలో స్నేహితులతో సరదాగా కాసింత సేదతీరడం అవసరం. మొహమాటానికి పోయి మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చుచేశారు. ఇప్పటికైనా వారి నిజస్వరూపం తెలుసుకోకపోతే నష్టపోతారు. కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవడానికీ ఇది తగిన సమయం. కలిసొచ్చే రంగు: ముదురు పసుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ వారం వినోదాత్మకంగా గడుస్తుంది. ప్రత్యేకమైన విందుకు ఆహ్వానం అందుతుంది. పనిలో విసుగు అనిపించినా, తప్పదన్నట్లు చేయవలసి రావడంతో నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు కొంచెం నెమ్మదిగా అందుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. గత∙పెట్టుబడుల నుంచి మంచి లాభాలందుతాయి. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మంచి కెరీర్, ఉన్నతమైన ఉద్యోగం లేదా హోదా కావాలనుకున్నప్పుడు కటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. అప్పుడే మీరు జీవితంలో గెలుపొందే అవకాశాలు దక్కుతాయి. గతంలో జరిగిన విషయాల గురించి ఇంకా ఆలోచించడం మాని, కొత్త విషయాలు, ఆర్థిక విషయాల మీద దృష్టిపెట్టండి, మేలు జరుగుతుంది. ఆదాయానికీ, ఖర్చులకూ మధ్య సమతూకం సాధించేందుకు ప్రయత్నించండి. మీ చిరకాల స్వప్నం ఒకటి ఈ వారంతంలో నెరవేనుంది. కలిసొచ్చే రంగు: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్తవారిని కలుస్తారు. శుభవార్తలు వింటారు. అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి. కీలకనిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగించే కాలమిది. పెద్ద పని అయినా, యాంత్రికంగా కాక, సృజనతో చేస్తేనే విజయవంతమవుతుందని గ్రహించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కలిసొచ్చే రంగు: మావిచిగురు -
టారో : 23 జూలై నుంచి 29 జూలై 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అదృష్టం మీ వెనకే ఉందా అన్నట్లుగా, ఈ వారమంతా మీకు అనుకూలంగా గడుస్తుంది. తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. నీతి నిజాయితీలతో మీరు చేసే వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇతరులకు సేవ చేయడంలో లభించే ఆనందాన్ని వెదుక్కుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పుకు ఈ వారం శుభారంభం జరుగుతుంది. వివాదాలలో జోక్యం వద్దు. కలిసొచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) భావోద్వేగాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. కెరీర్లో ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడతాయి. లక్ష్యసాధనకోసం కొన్నింటిని త్యాగం చేయవలసి రావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి ఇది అనుకూల కాలం. నిజంగా మీరు మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఈ వారంలోనే కలగవచ్చు. పనికీ, భావోద్వేగాలకూ మధ్య సమతుల్యాన్ని సాధించాలి. కలిసొచ్చే రంగు: అల్లం రంగు మిథునం (మే 21 – జూన్ 20) మీ అంచనాలు తప్పవచ్చు. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కదు ఈ వారం. దాంతో పనిమీద మనసు లగ్నం చేయలేకపోతారు. ఫలితం గురించి నిరాశపడకుండా కొత్త ప్రాజెక్టులు, పనుల కోసం అన్వేషించడం చెప్పదగ్గ సూచన. విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థికపరమైన వ్యవహారాల మీద కన్నేసి ఉంచడం మంచిది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కష్టపడి కొత్త టెండర్లు దక్కించుకుంటారు. కలిసొచ్చే రంగు: నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే పనిమీద దృష్టి పెట్టండి. మీ ఆలోచనలను సరిగా అమలు చేసినప్పుడే మీ పథకాలు విజయవంతం అవుతాయని గ్రహించండి. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగవచ్చు. ఆలస్యాన్ని నివారించే ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. అనూహ్యమైన ధనయోగం ఉంది. కలిసొచ్చే రంగు: లేత నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్యోగంలో భాగంగా కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు. అక్కడ మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జీవితం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేలా నూతన వ్యాపారానికి అడుగులు పడతాయి. ఒక బాంధవ్యంలో తీవ్రమైన అభద్రతాభావం ఏర్పడవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కలిసొచ్చే రంగు:ముదురు బూడిదరంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేస్తారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి, తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: అరిటాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆర్థికంగా చాలా బాగుంటుంది. నూత్న వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రారంభించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్న అవరోధాలను అధిగమిస్తారు. అంతమాత్రాన నిశ్చింత పనికిరాదు. జరగవలసిన కార్యాల మీద దృష్టిపెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య ఏర్పడిన పొరపచ్ఛాలు తొలగించుకోవడం అవసరం. కలిసొచ్చే రంగు: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మన ఆలోచనలే మనం. మన చేతలే మనమేమిటో నిరూపిస్తాయి అన్నట్లుగా ఉంటుంది ఈ వారం. అంటే మీరు మంచి ఆలోచనలు, సానుకూల భావనలతో ఉంటే మీకు కూడా అంతా మంచే జరుగుతుంది. మీ మనసులో తిష్టవేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న నిరాశను, నిస్పృహను తరిమెయ్యండి. మౌనంగా మీ పని మీరు చేసుకుపోండి. మంచి ఫలితాలే లభిస్తాయి. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి. కలిసొచ్చే రంగు: గోధుమ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆదాయానికి మించి ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. కొత్త ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు ఉండవచ్చు. పనుల్లోనూ,. వృత్తి, వ్యాపారాలలోనూ అవరోధాలు ఏర్పడవచ్చు. బెంబేలెత్తకుండా, సన్నిహితుల సహకారంతో నేర్పుగా పరిష్కరించుకోవడం అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, ఉన్నంతలోనే దానధర్మాలు చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) దూరప్రయాణాలు ఉండవచ్చు. ప్రయాణంలో కొత్త పరిచయాలు ఏర్పడి, మీకు కొన్ని విషయాలలో భరోసా ఏర్పడవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటిమీద, ముఖ్యంగా సంతానం మీద దృష్టిపెట్టడం, జీవిత భాగస్వామితో సామరస్యంతో మెలగడం అవసరం. సృజనాత్మకంగా ఆలోచించి, మీ కలలు నిజం చేసుకుంటారు. కలిసొచ్చే రంగు: బంగారు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కొద్దిగా మూడీగా, దిగులుగా ఉంటారు. సంతానపరంగా సంతోషం కలిగించే వార్తలు వింటారు. మీ కోరికను నెరవేర్చమని మనసులో బలంగా కోరుకోండి, జరిగి తీరుతుంది. మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వారాంతంలో విందు వినోదాలలో మునిగి తేలుతారు. కలిసొచ్చే రంగు: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనూహ్యమైన ఒక వార్త మిమ్మల్ని కుదిపి వేయవచ్చు. అయితే, ధ్యానంలోకి వెళ్లండి, దానికి పరిష్కారం దొరుకుతుంది. జీవిత భాగస్వామి సహకారం పూర్తిగా లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు అనుకూలమైన, ఆసక్తికరమైన ఫలితాలు ఉంటాయి.. కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటారు. జలుబు, సైనస్ సమస్యలు బాధించవచ్చు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. కలిసొచ్చే రంగు: లేత గులాబీ -
టారో : 16 జూలై నుంచి 22 జూలై 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ వారమంతా స్తబ్దుగా, ఏమీ పని చేయనట్టుగా ఉంటారు. అయితే మానసికంగా మాత్రం మిమ్మల్ని మీరు సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ అలవాట్లు, నమ్మకాలు, భావోద్వేగాలలో మార్పులు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం. తిరస్కరణలు, నిరాశలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. నమ్మిన వారే వంచించే అవకాశం ఉంది. అయితే, అది ఒక దశ మాత్రమే. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి పని చేస్తారు. ఈ క్రమంలో చిన్న చిన్న వ్యక్తిగత ఆనందాలను కూడా త్యాగం చేయక తప్పని పరిస్థితి వస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే సమయం. ఎంతో కాలం నుంచి కోరుకుంటున్న మార్పులు ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలకూ, కుటుంబానికీ మధ్య సమతుల్యం సాధించడం, పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోక తప్పదు. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) మీ కృషి ఫలిస్తుంది. చేపట్టిన పనులన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. మీరు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మార్పు కార్యరూపం దాల్చేసరికి అది మీకంత అనుకూలమైనది కాదని తెలుసుకుంటారు. ప్రేమ విషయంలో మీకన్నా మీ ప్రియుడు లేదా ప్రియురాలు ముందంజలో ఉంటారు. వృత్తిపరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు కోరిన గుర్తింపు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కలిసొచ్చే రంగు: దొండపండు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఆదాయానికి మించి ఖర్చు చేయవలసి రావడం వల్ల అప్పులు చేయక తప్పదు. ఆలోచనలలో అస్థిరత నెలకొంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు చెలరేగవచ్చు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు సహజమే అయినా, నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం. కలిసొచ్చే రంగు: నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. వారు చెప్పిన మాట వింటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. దానిద్వారా కలిగిన సానుకూల భావనలతో ఉత్సాహంగా ఉంటూ బోలెడన్ని కార్యాలను అవలీలగా చక్కబెతారు. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి, తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆర్థికంగా బాగుంటుంది. షాపింగ్ చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. చేతిలోని ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలోని అవరోధాలను అధిగమిస్తారు. జరగవలసిన కార్యాలమీద దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య ఏర్పడిన పొరపచ్ఛాలు తొలగించుకోవడం అవసరం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భవిష్యత్తు కోసం గతంలో మీరు చేసిన కృషి ఫలిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. సానుకూల భావనలతో సత్ఫలితాలు సాధిస్తారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. అనుకోని బహుమతులు అందుతాయి. మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. అదనపు బాధ్యతలను తలకెత్తుకోవలసి వస్తుంది. బాధించిన కష్టాలు తొలగిపోతాయి. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు ఉండవచ్చు. పనుల్లోనూ, వృత్తి, వ్యాపారాలలోనూ అవరోధాలు ఏర్పడవచ్చు. బెంబేలెత్తకుండా, సన్నిహితుల సహకారంతో నేర్పుగా పరిష్కరించుకోవడం అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, ఉన్నంతలోనే దానధర్మాలు చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: గులాబీ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భాగస్వామ్యపు వ్యాపారాలకు ఇది అనువైన సమయం. పనిలో కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పనులు మొదలు పెడతారు. వెయ్యిళ్ల పూజారిలా వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి పెద్ద పీట వేయక తప్పదు. ఫిట్నెస్ పెంచుకోవాలి. పిల్లల విద్యావిషయాలలో తలదూర్చవలసి వస్తుంది. విందు వినోదాలలో విరివిగా పాల్గొంటారు. సృజనాత్మకంగా ఆలోచించి, మీ కలలు నిజం చేసుకుంటారు. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ప్రశాంతంగా, శాంతియుతంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఆహ్లాదంగా, గడుపుతారు. పని ప్రదేశంలో కొద్దిపాటి ఇబ్బందులు, పరాభవాలు తప్పకపోవచ్చు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇంతకాలం కంటున్న పగటి కలలు, ఊహల స్థానంలో వాస్తవిక పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ఇరుగు పొరుగుతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మీ ప్రియుడు / ప్రియురాలిని కలుస్తారు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండవలసిన తరుణమిది. మీ హద్దులు దాటి ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం తప్పని తెలుసుకుంటారు. దూర›ప్రయాణాలు అనివార్యం అవుతాయి. గుర్రాల్లా పరుగెత్తుతున్న కోర్కెలకు కళ్లెం వేయక తప్పదు. అవిశ్రాంతంగా పని చేయడంతోపాటు అలసిన శరీరానికి విశ్రాంతి అవసరం అని గ్రహించండి. పని మీద శ్రద్ధాసక్తులు చూపించండి. కలిసొచ్చే రంగు: పసుపు -
టారో : 9 జూలై నుంచి 15 జూలై2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ వారం విజయవంతంగా సాగుతుంది. పనులన్నీ త్వర త్వరగా అవుతాయి. మీ నీతి నిజాయితీల వల్ల మీరు గతంలో ఏదో కోల్పోయారనుకున్నవన్నీ ఈ వారం మీకు లభిస్తాయి. మీ పాత పద్ధతులకు, కాలం తీరిపోయిన విధానాలకు స్వస్తి చెప్పి కొత్తదనాన్ని అవలంబించడం మంచిది. కలిసొచ్చే రంగు: నారింజ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాలానుగుణంగా మారతారు. మార్పులకు స్వాగతం పలుకుతారు. కొత్త బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు కలుస్తాయి. వివాదాస్పదమైన మాటలకు, ప్రవర్తనకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలు లేదా ఉద్యోగులకు బోనస్ వచ్చే అవకాశం ఉంది. కలిసొచ్చే రంగు: నీలం మిథునం (మే 21 – జూన్ 20) మనసు చెప్పే మాటను కాస్త శ్రద్ధ పెట్టి వినండి. మీ కలలు సాకారం అయ్యే అవకాశం ఉంది. కొన్ని ముఖ్య సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ప్రాజెక్టులు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవచ్చు. మీ విచక్షణ, తెలివితేటలను ఉపయోగించి, అవరోధాలను అధిగమిస్తారు. రిస్క్‌తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండండి. కలిసొచ్చే రంగు: లేత పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో నైపుణ్యం సాధించాలి. విజయావకాశాలను జాగ్రత్తగా ఒడిసిపట్టుకోగలగాలి. గతంలో మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సత్ఫలితాలనిస్తుంది. మీ గమ్యాన్ని మార్చే ప్రయాణం ఉండవచ్చు. సానుకూల ఫలితాలు ఎన్నో ఉన్నాయి. కలిసొచ్చే రంగు: చిలకపచ్చ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) స్థిరత్వానికి, భద్రతకు అనుకూల కాలమిది. అదేవిధంగా గృహనిర్మాణానికి, కొత్త పని ప్రారంభానికి, పెళ్లి ప్రయత్నాలకు చేసే ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రతిబంధకాలను అధిగమిస్తారు. గతం నుంచి బయటపడి వర్తమానంలో జీవించడం మంచిది. ఇబ్బడిముబ్బడిగా డబ్బు అందుతుంది. మీ ప్రయత్నాలకు ఊతం దొరుకుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వేయబోయే అడుగు మంచిదో కాదో తెలియక తికమకపడవద్దు. తెగించి ముందడుగు వేస్తే అనుకూల ఫలితాలను అందుకుంటారు. ఈ వారం మీకు శుభవార్తలు అందుతాయి. వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కెరీర్ బాగుంటుంది. ప్రేమ ఫలిస్తుంది. కలిసొచ్చే రంగు: దొండపండు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) శుభవర్తమానం అందుతుంది. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు మనస్పూర్తిగా మాట్లాడండి. మీ ప్రేమను దాచిపెట్టవద్దు. ఈ వారం జరిగేవన్నీ మీ భావోద్వేగాలకు సంబంధించినవే. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మార్పు జరుగుతుంది. ప్రయాణావకాశం ఉంది. కెరీర్ పరంగా బాగుంటుంది. ఇల్లు లేదా కార్యాలయం మారతారు. కలిసొచ్చే రంగు: ఇటికరాయి రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మంచి రోజులు ముందున్నాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. పనిలో మీ ధోరణిని మార్చుకోవలసి వుంది. సానుకూల ధోరణితో చేసే పనులు ఫలప్రదం అవుతాయి. ధనపరంగా, పెట్టుబడుల పరంగా మీరు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. త్యాగం చేయవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈ వారమంతా చాలా బిజీగా గడుపుతారు. ఊపిరి సలపనంతటి పనుల ఒత్తిడిలో తల మనకలవుతారు. అయితే, పనిలో రొడ్డకొట్టుడు, మూస ధోరణి ఉన్నంతకాలం మీకది వర్కవుట్ కాదు. కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. భావోద్వేగాలలో చాలా మార్పు చేర్పులు జరుగుతాయి. ధ్యానం స్వాంతననిస్తుంది. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) శుభవార్తల కోసం ఎదురు చూడవచ్చు. ఆర్థికలావాదేవీలు లాభదాయకం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి పెద్దమొత్తాలు చేతికందుతాయి. మీరెప్పుడూ ఊహించని అవకాశాలు వెల్లువెత్తుతాయి. అనుకూలమైన వాటిని ఎంచుకుని ధైర్యంగా ముందడుగు వేయండి. వివాహ ఘడియలు సమీపించాయి. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) గత కొద్దికాలంగా మీరు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి బయట పడతారు. మనశ్శాంతి, స్థిమితం లభిస్తాయి. బయటినుంచి డబ్బు చేతికందుతుంది. మీ పథకాలు ఫలిస్తాయి. కలలు సాకారమవుతాయి. మనసు పెట్టి పని చేయడం మంచిది. కొత్త వాహనం కొనుగోలు చేయచ్చు. కలిసొచ్చే రంగు: నలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థికంగా చాలా బాగుంటుంది. ధనపరంగా మీరు కంటున్న కలలు ఫలిస్తాయి. బాగా షాపింగ్ చేసి, మనసు పడ్డవాటన్నింటినీ కొంటారు. వ్యాపారంలో మాత్రం తన, పరభేదాలు వద్దు. కష్టే ఫలి అన్నట్లుగా పని చేయండి, అప్పుడు విజయం మీ సొంతమవుతుంది. వాస్తవ విరుద్ధమైన ఆలోచనలు చేయవద్దు. కలిసిచ్చే రంగు: ముదురాకుపచ్చ -
టారో 2 జూలై నుంచి 8 జూలై 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఎంతో ఆనందోత్సాహాలతో పని చేస్తారు ఈ వారమంతా. ఎంతోకాలంగా మీరు కంటున్న కలల్లో కనీసం కొన్ని అయినా నెరవేరతాయి ఈ వారం. కెరీర్‌పరంగా కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయి. భావోద్వేగాలపరంగా మరికొంత బలంగా ఉండాలి మీరు. అవతలి వారి ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగవద్దు. అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితులు శుభవార్తలు వింటారు. కలిసొచ్చే రంగు: ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) సమతుల్యత సాధించడమనేది మీ విజయానికి మూల సూత్రం. అన్నింటిలోనూ సమతూకం పాటించడం అవసరం. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, ఫలితమూ దక్కుతుంది. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ విజయంలో వారిని కూడా భాగస్వామ్యం చేయండి. ఇతరులు పని చేసేలా ప్రేరేపించండి. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) ఈ వారమంతా అవిశ్రాంతంగా పని చేసినప్పటికీ, ప్రణాళిక వేసుకుని, దాని ప్రకారం చేస్తే కానీ, పనులు తొందరగా పూర్తి కావు, అందులో విజయం వరించదనీ గ్రహిస్తారు. పనికిమాలిన, అవసరం లేని విషయాలపై సమయాన్నీ, డబ్బునూ వ్యర్థం చేయడం వృథా చేయడం అని తెలుసుకుంటారు. జీవితంలో ప్రధానమైన మార్పు సంభవం. పాత స్నేహితులు తిరిగి మీ జీవితంలోకి అడుగుపెడతారు. కలిసి వచ్చే రంగు: దొండపండు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) బద్ధకంగా గడుపుతారు. మీ స్నేహితులు, బంధుమిత్రుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. కొన్ని ముఖ్య సభలు, సమావేశాలలో సందర్భాలలో మీ వాదాన్ని బలంగా వినిపించి, మిమ్మల్ని మీరు బలమైన వారిగా నిరూపించుకుంటారు. త్వరలో ఒక కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం మిమ్మల్ని వరించనుంది. ప్రవాహంలో కొట్టుకుపోతేనే అవకాశాలు వరిస్తాయని గ్రహించండి. కలిసివచ్చే రంగు: ముదురు నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) భాగస్వామ్య వ్యాపార, వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్‌పరంగా వచ్చిన కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటారు. కలిసివచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) గృహాన్ని ఆధునీకరించడానికి ఇది తగిన సమయం. మీ చేతిలోని ప్రాజెక్టులను చకచకా పూర్తి చేసి, కొత్త వాటిని అందిపుచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా గత నెలలో ఎదురైన గడ్డు అనుభవాల నుంచి తేరుకుంటారు. ప్రవాహం ఎటు తిరిగితే అటే పయనించడం మంచిదని తెలుసుకుంటారు. స్వల్పలాభాలను పొందుతారు. కలిసి వచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) అవిశ్రాంతంగా పని చేస్తారు. సత్యానిదే అంతిమ విజయం అని గ్రహిస్తారు. ఒక మార్గం మూసుకుపోతే వంద మార్గాలు మనకోసం తెరిచే ఉంటాయని తెలుసుకుంటారు. గతానుభవాల దృష్టాంయ మీకు వచ్చిన కొత్త అవకాశాలను అశ్రద్ధ చేయకుండా చక్కగా అందిపుచ్చుకుంటారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేస్తారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతారు. కలిసి వచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. అయితే అదే సమయంలో మీ విజ్ఞానాన్ని, తెలివితేటలను ధనార్జనకు కూడా వినియోగించడం మంచిదని తెలుసుకోవడం మంచిది. ఒక బంధం నుంచి బయట పడే ప్రయత్నం చేస్తారు కానీ, కుదరదు. మీపై పడిన అపనిందలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. . కలిసి వచ్చే రంగు: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) చురుకుగా పని చేస్తారు కానీ, అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిం^è ండి. మీ ఊహలను, ఆలోచనలను కొత్తదనంతో నింపుకోండి. ఆలోచనలలో తరచు మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. దానిలో సమన్వయాన్ని సాధించండి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కలిసి వచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. కీలకమైన పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: పసుపు -
టారో మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
ఎంతో ప్రశాంతంగా, హాయిగా సాగిపోతుందీవారమంతా! జీవితాశయాన్ని సాధించి తీరాలి అన్న పట్టుదలతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. మానసిక, శారీరక ఒత్తిళ్లను తొలగించుకునేందుకు పెయింటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్, పొయెట్రీ... ఇలా దేని మీద ఆసక్తి ఉంటే దానిలో కృషి చేయండి. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వవద్దు. సానుకూల భావనలతోనే ఉండండి. విజయం చేకూరుతుంది. కలిసొచ్చే రంగు: తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వారమంతా కొత్త విషయాలు నేర్చుకోవడంలో వెచ్చిస్తారు. ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకోవడం అవసరం. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, పాత జ్ఞాపకాలతో సతమతమయ్యే బదులు భవిష్యత్తుపై దృష్టి పెట్టడం మంచిది. వీలయినంతవరకు పదిమందితో కలిసి గడిపేందుకు, మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. కలిసొచ్చే రంగు: దొండపండు మిథునం (మే 21 – జూన్ 20) ఈ వారమంతా అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. తదుపరి ప్రాజెక్టు కోసం సమయం వెచ్చించండి. జీవితమనేది అనుభవించడానికీ, కొత్తదనాన్ని ఆస్వాదించడానికీ అని గుర్తుంచుకోండి. కలిసి వచ్చే రంగు: వంకాయరంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఎటువంటి చిక్కులూ, చింతలూ లేకుండా హాయిగా గడపాలని మీరు ఎంతగా ప్రయత్నం చేసినా, కష్టాలు, కడగళ్లు ఉంటేనే, వాటిని ఎదుర్కొంటేనే జీవితమని గుర్తించండి. పని ప్రదేశంలో మరింత శ్రద్ధాభక్తులతో వ్యవహరించడం అవసరం. ఆరోగ్యం విషయంలో ఆందోళన వదిలి, జాగ్రత్తలు తీసుకోండి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాల నుంచి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాత జ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా సాంత్వన లభిస్తుంది. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మనసు చెప్పిన మాట వినండి. కలిసి వచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: బూడిద ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: ఇంద్రధనుస్సు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మీ ఆలోచనలనూ, పథకాలనూ అమలు చేసేందుకు ఇది తగిన సమయం. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటారు. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించకుంటే చిక్కులు తప్పవు. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కలిసి వచ్చే రంగు: నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనుల నుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. కోపం తగ్గించుకోకపోతే చిక్కులు తప్పవు. వాహనం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. పిల్లలు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కలిసి వచ్చే రంగు: లేత గులాబి -
టారో : 18 జూన్ నుంచి 24 జూన్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సంపదను పెంచుకుంటారు. విలాసాలను ఆస్వాదిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నప్పటికీ, నిరాశా నిస్పృహలు వెన్నాడుతాయి. సవాళ్లను, ఒడిదుడుకులను దాటి ఆలోచించడం మంచిది. కష్టాలకు చలించకుండా సాగితేనే జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించగలరు. కలిసొచ్చే రంగు: ఎరుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) సంయమనమే మూలమంత్రంగా ముందుకు సాగుతారు. పని ఒత్తిడిలో తలమునకలవుతారు. ప్రేమ సాఫల్యం కోసం మీ ప్రేమికులతో మరింత కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాలకు, విద్య, వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి సానుకూలమైన కాలం. జీవితంలో మెరుగుపరచుకోవాల్సిన అంశాలను మెరుగుపరచుకుంటారు. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) ఒక గొప్ప అవకాశం తలుపు తడుతుంది. మీరు తీసుకునే కీలక నిర్ణయం మిమ్మల్ని విజయాల బాట వైపు నడిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. అయితే, మీకంటూ సమయం మిగలని పరిస్థితులు ఉంటాయి. గొప్ప లక్ష్యంతో ప్రారంభించే పనులు అద్భుత విజయాలను అందిస్తాయి. కలిసొచ్చే రంగు: ముదురు నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇప్పటికే చాలా ఘనవిజయాలను అందుకుని ఉంటారు. మిమ్మల్ని మీరు విజేతగా భావిస్తారు. మీ విజయాలను ఏ శక్తీ ఆపలేదు. ఆర్థికంగా ఇది అద్భుతమైన కాలం. కొత్త కార్యాచరణను ప్రారంభిస్తారు. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మబంధువు ఒకరు తారసపడతారు. ఈ బంధం వ్యక్తిగత స్థాయి నుంచి ఆధ్యాత్మికత వైపు ప్రయాణిస్తుంది. కలిసొచ్చే రంగు: తుప్పు రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ప్రేమ వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొత్త కొత్త సంతోషాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అలాగని పని పట్ల మీ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదు. శరీరాన్ని తీర్చిదిద్దుకోవడానికి కఠినమైన ఆరోగ్య నియమాలను పాటిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటి పునర్నవీకరణకు తగిన సమయం ఇది. చిరకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనిని పూర్తి చేస్తారు. పనిలో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆదాయ వ్యయాలకు, పనికి కాలక్షేపానికి మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. సహోద్యోగులతో సర్దుబాటు ధోరణి అవలంబించాల్సి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఒక నిజం తెలుసుకుని దిగ్భ్రాంతులవుతారు. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుందని గ్రహిస్తారు. ఇతరులకు దూర గా గిరి గీసుకుని ఉండే ధోరణికి స్వస్తిపలకడం మంచిది. పనిలో సత్ఫలితాలు సాధిస్తారు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) చేసే పనిలో పూర్తిగా నిమగ్నమవుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఒంటరి వారికి వివాహ యోగం. స్థిరాస్తి వ్యాపారులకు ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబ వ్యాపారంలో గొప్ప పేరుప్రతిష్టలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరమవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జీవితంలో చీకట్లు తొలగి వెలుగురేకలు కనిపిస్తాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త భాగస్వాములతో ఒప్పందాలకు అనుకూలమైన కాలం. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. మనశ్శరీరాల సాంత్వనకోసం యోగాను ఆశ్రయిస్తారు. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వృత్తి ఉద్యోగాల్లోను, వ్యక్తిగత అనుబంధాల్లోను మీ దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని నిరూపించుకుంటారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పాత పద్ధతులకు తిలోదకాలిచ్చి కొత్త మార్పులకు శ్రీకారం చుడతారు. పాత బాకీలను తీర్చేస్తారు. చదువుపై మరింతగా దృష్టి సారిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పోటీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి.. కలిసొచ్చే రంగు: లేత ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మందకొడిగా, బద్ధకంగా గడుపుతారు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. ఇదివరకటి పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటడం ద్వారా ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. అదృష్టం మీవైపే ఉంటుంది. కలిసొచ్చే రంగు: నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ప్రేమ వ్యవహారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరి వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత వహించాల్సి వస్తుంది. చేటు చేసే పాత అలవాట్లను మానుకుని కొత్తగా మంచి అలవాట్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కలిసొచ్చే రంగు: నీలం -
టారో : 11 జూన్ నుంచి 17 జూన్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఆర్థిక, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేస్తేనే ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులు ఈ వారం మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతోనూ, సహోద్యోగులతోనూ వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. కలిసి వచ్చే రంగు: లేత వంకాయంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) నూతనశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆఫీసులో పనులు చాలా వేగంగా ముందుకు జరుగుతాయి. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. కలిసి వచ్చే రంగు: నారింజ మిథునం (మే 21 – జూన్ 20) మీ వాక్పటిమ, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరిచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. తోటివారితోనూ, ఇరుగు పొరుగుతోనూ స్నేహంగా మెలుగుతారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. మనసు చెప్పిన మాట విని, దాని ప్రకారం నడచుకోండి. గొంతునొప్పి బాధించవచ్చు. ప్రకృతి చికిత్సతో ఉపశమనం పొందుతారు. కలిసి వచ్చే రంగు: వెండి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు కొద్దిపాటి ఆశాభంగం తప్పదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి, కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. ఒకోసారి గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు. కలిసొచ్చే రంగు: గులాబీ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కలిసి వచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఊహాలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. దాంతో పనులు కుంటుపడతాయి. మీ విజ్ఞానంతో, ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరిచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో దూరప్రయాణం చేస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా మీకు స్వాంతన లభిస్తుంది. ప్రేమ ఫలిస్తుంది. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) నూతనశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. కలిసి వచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: బూడిద ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొహమాటం వల్ల మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కలిసి వచ్చే రంగు: తెల్లటి తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. వారు చెప్పిన మాట వింటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కలిసి వచ్చే రంగు: గోధుమ రంగు -
టారో : 4 జూన్ నుంచి 10 జూన్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీ ప్రేమ ఫలిస్తుంది. పెద్దల అంగీకారంతో త్వరలోనే పెళ్లి బాజా మోగుతుంది. ఈ వారమంతా విజయాల వెల్లువలో ఉంటారు. ప్రభుత్వ పనులకు సంబంధించి అధికారుల అండదండలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. కెరీర్ పరంగా మీరు అనుకున్న మార్పు చేర్పులు జరుగుతాయి. ఎంతో అనుకూలమైన ఈ సమయాన్ని మీ కలలను సాకారం చేసుకోవడానికి ఉపయోగించుకోండి. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. గమ్యం తెలియక అయోమయంగా ఉన్న మీకు ఇప్పుడు సరైన మార్గం తెలుస్తుంది. విజయం ఇచ్చిన ఆనందోత్సాహాలలో తేలిపోతారు. వృత్తిపరమైన ప్రావీణ్యాన్ని సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితం కోసమూ కొంత సమయం కేటాయించుకోండి. ఒక శుభకార్యం మూలంగా సన్నిహితులతోఉన్న విభేదాలు తొలగి, తిరిగి స్నేహ సంబంధాలు కలుస్తాయి. కలిపొచ్చే రంగు:ఊదా మిథునం (మే 21 – జూన్ 20) అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ఉన్నతlహోదాలు. ఇంటిలో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం కలిగే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ముదురు పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. బంధుమిత్రులతో అకారణ వైరం, చికాకులు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం నెలకొనే అవకాశముంది. కోర్టు వ్యవహారాలలో చుక్కెదురయ్యే అవకాశం. కలిసొచ్చే రంగు: పాలమీగడ రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) విలాసాలకు ఎక్కువ వ్యయం చేయడం వల్ల అప్పుల తిప్పలు తప్పవు. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్థలు, స్నేహితులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల వీలయినంతవరకు సంయమనం పాటించడం మంచిది. కొన్ని సందర్భాలలో ఆలోచనలు కలసిరావు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అవాంతరాలు ఏర్పడ్డా, ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. కలిసొచ్చే రంగు: నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలు సఫలం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పని చేసి, పెండింగ్ ప్రాజెక్టులను చకచకా పూర్తి చేస్తారు. వెలుగులోకి రావడానికి, సమాజంలో మీకంటూ ఒక పేరు, ప్రతిష్ఠలను పొందడానికి మీరు ఇంతకాలంగా చేస్తున్న కృషి ఫలిస్తుంది. మళ్లీ మంచిరోజులు వచ్చాయనిపిస్తుంది. కలిసొచ్చే రంగు: మట్టిరంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి నిరాశ తప్పక పోవచ్చు. ఆర్థికంగా ఫరవాలేదనిపిస్తుంది. ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. పలుకుబడిగల వ్యక్తుల మూలంగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలలో మౌనాన్ని ఆశ్రయించడం మేలు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. కలిసొచ్చే రంగు: లేత నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వృశ్చికం: శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఇల్లు మారడం లేదా ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు వస్తాయి. ఒక ముఖ్యవిషయంలో కీలక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. దానిమూలంగా కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. కలిసొచ్చే రంగు: వంకాయరంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంటర్వూ్యలకు పిలుపులు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఒక వ్యాపారంలో లేదా చేపట్టిన ప్రాజెక్టులో మంచి లాభాలు సాధిస్తారు. మీ మనసుకు తోచిన విధంగా చేయండి, విజయం మీదే! ఇతరులకు కష్టమైనదే కావచ్చు కానీ, మీకు మాత్రం అది సులువే. కలిసొచ్చే రంగు: తెలుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఆధ్యాత్మికతవైపు మొగ్గు చూపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు, మానసిక అశాంతి ఉండవచ్చు. అయితే మీకున్న వాక్చాతుర్యం, వ్యవహార దక్షతతో అన్నింటినీ అధిగమిస్తారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. ఆనందంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: లేత గులాబీ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అనుకున్నదానిని సాధించేందుకు సర్వశక్తులూ సమీకరించుకుంటారు. మొదటినుంచి అదే మీ బలం, బలహీనత. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లేదా సమతూకం సాధించడం మంచిది. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. కలిసొచ్చే రంగు: గోధుమరంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో, కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. సొంతవ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కలిసొచ్చే రంగు: పాచిరంగు -
టారో 28 మే నుంచి 3 జూన్2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఆటంకాలకు, సవాళ్లకు, నిస్పృహ కలిగించే పరిస్థితులకు అవలి వైపు చూడటాన్ని అలవరచుకుంటారు. విభిన్న దృక్పథంతో ప్రతికూల పరిస్థితుల్లో సైతం దైనందిన జీవితాన్ని ఆనందంగా గడిపేయగలరు. సుస్థిరత వైపుగా మీ సృజనాత్మకతను, ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో మానసిక దారుఢ్యాన్ని పెంచుకుంటారు. లక్కీ కలర్: బంగారు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయేమోననే భయంతో నిరాశావాదంలో కూరుకుపోతారు. కాస్తంత సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటే తేలికగానే పరిస్థితులను అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. ఇతరులపై ఆధారపడటం కంటే స్వయంకృషిని నమ్ముకోవడం మేలని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మీ బాగోగులు పట్టించుకునే వ్యక్తి ఒకరి నుంచి అద్భుతమైన సలహాలు అందుతాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఇదివరకటి ప్రయత్నాలకు తగిన ఫలాన్ని అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతమై మీ అదృష్టాన్నే మార్చేస్తుంది. పనిలో నైపుణ్యాలను పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక లాభాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు చేయడానికి అనువైన సమయం. సుదూర యాత్రల ద్వారా ఆనందం పొందడంతో పాటు అనుబంధాలను బలపరచుకుంటారు. లక్కీ కలర్: లేతాకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పరిస్థితులకు తలవంచక తప్పదు. లక్ష్యసాధనకు చేరువవుతున్న దశలో ఓరిమిని కోల్పోవద్దు. నిలకడగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా ఆహార విహారాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కృతనిశ్చయంతో ఏకాగ్రత కోల్పోకుండా ఫలితాలు సాధిస్తారు. లక్ష్యసాధన కోసం అహరహం శ్రమిస్తారు. కఠోర శ్రమకు తగిన ఫలితాలను సాధిస్తారు. జీవితంలో గొప్ప పురోగతి సాధిస్తారు. కొత్త బంధం మిమ్మల్ని ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లిస్తుంది. కీళ్లనొప్పులు బాధపెట్టే అవకాశం ఉంది. పని ఒత్తిడి నుంచి కొంత విరామం కోరుకుంటారు. లక్కీ కలర్: ఊదా కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదృష్టం కలిసొస్తుంది. మీ సృజనాత్మకత, కొత్త ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లోను, కార్యాలయంలోను మార్పులు చేపడతారు. ఇతరులకు సాయం చేస్తారు. లక్కీ కలర్: ముదురు పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ప్రతి అంశాన్నీ నిశితంగా అధ్యయనం చేస్తారు. అంతులేని జిజ్ఞాసతో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను చాటుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఈ వారం సంప్రదాయ పద్ధతుల్లోనే ముందుకు సాగడం మంచింది. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం క్షేమం. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) నాయకత్వ హోదాలో ఉన్నవారితో విభేదాలను విడనాడండి. చిన్న చిన్న గొడవలను తెగే వరకు లాగడం మంచిది కాదు. ఆదాయ వ్యయాలకు మధ్య సమతుల్యత పాటించడానికి ప్రయాసపడతారు. పని ఒత్తిడి ఎక్కువవుతుంది. సహోద్యోగులతో శాంతియుతంగా మెలగడం క్షేమం. చిన్న చిన్న పొరపాట్లను తేలికగా క్షమించడం ద్వారా ప్రశాంతత పొందుతారు. లక్కీ కలర్: తెలుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జీవితం తొలినాళ్లలో ఎదురైన చేదు జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు వికలం చేస్తాయి. ఆర్థిక పరిస్థితి గురించి అనవసరంగా ఆందోళన చెందుతారు. ఇతరులకు దూరంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. షాపింగ్ ద్వారా సాంత్వన పొందాలనుకుంటారు. లక్కీ కలర్: ముదురు నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) నిజాయితీగా వ్యవహరిస్తూ ఆశ్చర్యకరమైన వ్యాపార విజయాలను సొంతం చేసుకుంటారు. ఎలాంటి ప్రతికూలతలనైనా అవలీలగా ఎదుర్కొంటారు. స్థిరాస్తుల వ్యాపారులకు పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. మీ చొరవతో కుటుంబ వ్యాపారానికి గొప్ప పేరు వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ప్రేమికులకు కాలం అనుకూలిస్తుంది. లక్కీ కలర్: ఎరుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) భావసారూప్యత గల వ్యక్తులతో బంధం బలపడుతుంది. అన్ని సౌకర్యాలూ అందుబాటులోనే ఉన్నా, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి మరింతగా శ్రమించాల్సి వస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటున్న కొద్దీ ఆర్థికలాభాలు పెరుగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణం చేయాల్సి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలకు సానుకూలమైన కాలం. లక్కీ కలర్: ఇటుక రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆత్మావలోకనం చేసుకుంటారు. ఎక్కువసేపు మౌనంగా ఉండటానికే ఇష్టపడతారు. అందరికీ దూరంగా ఒంటరిగా ఉండటం పరిష్కారం కాదని గ్రహించండి. చిన్న చిన్న లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణలోకి దిగితే ప్రయోజనం ఉంటుంది. యోగసాధనతో సాంత్వన పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో గడ్డు పరిస్థితులు తలెత్తుతాయి. ఆత్మసై్థర్యం కోల్పోకుండా ముందుకు సాగండి. లక్కీ కలర్: ఆకుపచ్చ -
టారో : 21 మే నుంచి 27 మే 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేస్తారు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు కూడా చేరతాయి. ఏ సమస్య వచ్చినా, తగిన పరిష్కారం కనుగొనడంలో మీకు మీరే సాటి అనే విషయం గుర్తుంచుకోండి. మీ జీవిత లక్ష్యాలను సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. ఆ ప్రయత్నంలో ముందడుగు వేస్తారు కూడా! కలిసివచ్చే రంగు:ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఆర్థిక, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేస్తేనే ఫలితం ఉంటుందని గ్రహించండి. సొంత వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. కలిసివచ్చే రంగు: లేత వంకాయంగు మిథునం (మే 21 – జూన్ 20) మీ వాక్పటిమ, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబం తో కలసి దూరప్రయాణం చేస్తారు. మనసు చెప్పిన మాట విని, దాని ప్రకారం నడచుకోండి. గొంతునొప్పి బాధించవచ్చు. ప్రకృతి చికిత్సతో ఉపశమనం పొందుతారు. కలిసి వచ్చే రంగు: వెండి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. కొత్త పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు కొద్దిపాటి ఆశాభంగం. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు. కలిసొచ్చే రంగు: గులాబీ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) నూతనశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆఫీసులో పనులు చాలా వేగంగా ముందుకు జరుగుతాయి. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెళకువలతో పని చేయండి. కలిసి వచ్చే రంగు: నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే కష్టపడక తప్పదు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈవారం మందకొడిగా, బద్ధకంగా అనిపిస్తుంది. అయినా సరే, దూరప్రయాణాలు చేయక తప్పని సరి పరిస్థితి ఎదురవుతుంది. మీ ప్రేమ సఫలమవుతుంది. మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వారాంతంలో విందు వినోదాలలో మునిగి తేలుతారు. ఒక శుభకార్యానికి ఆహ్వానం అందుతుంది. అదే సమయంలో ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగంలో, పనిలో లేదా వృత్తిలో ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు వస్తుంది లేదా మీరు ఆశించిన మార్పును ఆమోదించడానికిది తగిన సమయం. ఈ మార్పు కాలంలో స్నేహితులతో సరదాగా కాసింత సేదతీరడం అవసరం. మొహమాటానికి పోయి మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే మునిగిపోతారు. కలిసొచ్చే రంగు: చాకొలేట్ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఒక ప్రత్యేకమైన విందుకు ఆహ్వానం అందుతుంది. పనిలో విసుగు అనిపించినా, తప్పదన్నట్లు చేయవలసి రావడంతో నాణ్యతలేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు కొంచెం నెమ్మదిగా అందుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పనిలో మెళకువ లేకపోతే మాట పడక తప్పదు. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మంచి కెరీర్, ఉన్నతమైన ఉద్యోగం లేదా హోదా కావాలనుకున్నప్పుడు కుటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. అప్పుడే మీరు జీవితంలో గెలుపొందే అవకాశాలు దక్కుతాయి. కొత్త కొలువులో చేరాలన్న ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద మీరు దృష్టిపెట్టండి, మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారంతంలో తీరనుంది. కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్తవారిని కలుస్తారు. శుభవార్తలు వింటారు. అదృష్టం వరిస్తుంది. సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగించే కాలమిది. ఎంతటి పని అయినా, యాంత్రికంగా కాక, శ్రద్ధాసక్తులతో చేస్తేనే విజయవంతమవుతుందని గ్రహించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కలిసొచ్చే రంగు: తెలుపు, లేత గులాబీ -
టారో 14 మే నుంచి 20 మే 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో కలహాలుండవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి నిరుత్సాహం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో తిరిగి పుంజుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి అయే సూచనలున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. బాల్యమిత్రుని కలిసి ఆనందంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పోటీయే పరమావధిగా గడుపుతారు. శత్రువులపై మీదే పై చేయి. ఆదాయం నిరాశ కలిగించవచ్చు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. ఉద్యోగ, వ్యాపార రీత్యా దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రుణాల విషయంలో బంధువర్గం నుంచి ఒత్తిడులు. కొత్త ప్రదేశానికి మారవచ్చు. మారిన చోట ఆనందకరమైన వాతావరణమే నెలకొంటుంది. గతం నుంచి బయట పడతారు. కలిసొచ్చే రంగు: లేత పసుపు మిథునం (మే 21 – జూన్ 20) మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు తప్పవు. అయితే, వాటిని మనస్పూర్తిగా ఆమోదిస్తే మంచే. కలిసొచ్చే రంగు: నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కుటుంబసమస్యలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, ఆనందకరమైన వాతావరణంలో అడుగుపెడతారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. వ్యసనాలనుంచి బయటపడతారు. దూరప్రయాణాలు ఉండవచ్చు. పని ప్రదేశంలో రోజురోజుకూ పోటీ పెరుగుతుంది. ముఖ్యమైన, పలుకుబడి గల వ్యక్తులను కలవడానికి ఇది తగిన సమయం. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. అవసరం అయితే మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడగట్టుకుని ఆగిపోయిన పనులు పూర్తి చేయండి. త్వరలోనే కొత్త వ్యాపారం లేదా ప్రస్తుత వ్యాపారానికి కొత్త శాఖను ప్రారంభిస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆసక్తికరమైన వ్యక్తిని కలుస్తారు. కలిసిచ్చే రంగు: పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుని మరీ పనులు పూర్తి చేస్తారు. అదనపు బాధ్యతలు నెత్తిన పడవచ్చు. దూరప్రయాణాలు. సోదరులు, సోదరీలతో కలహాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. కుటుంబసభ్యులను బహుమతులు ఇచ్చి ఆనందింప చేసే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు. కొన్ని అవాంతరాల వల్ల వెళ్లిన చోటేæచిక్కుకుపోతారు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ అవసరం. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ ముందున్న సవాళ్లను ఓర్పుగా, నేర్పుగా అధిగమించేందుకు ప్రయత్నించండి కానీ, బెంబేలెత్తవద్దు. మీ కలలను సాకారం చేసుకునే సమయమిది. నూతన ఉద్యోగావకాశాలు తలుపు తడతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. భవిష్యత్‌కు తగిన కార్యాచర ణ అవసరం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పిల్లలను ఆనందింపజేసే ప్రయత్నం చేయండి. గతం నుంచి గుణపాఠం నేర్చుకోండి కానీ, కుంగిపోవద్దు. వ్యాపారస్తులు అప్పులు ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కలిసొచ్చే రంగు:నలుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీరు కంటున్న కలలు సాకారమవుతాయి. మీ శక్తిసామర్థ్యాలకు, ఓర్పుకు పరీక్షా అన్నట్లు ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవరోధాలు. మీ కష్టసుఖాలను సహోద్యోగులతో పంచుకుని ఊరట పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధం విషయంలో దృఢంగా ఉంటారు. కలిసొచ్చే రంగు: పగడం రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) విందు వినోదాలలో గడుపుతారు. సామాజిక సంబంధాలను మెరుగు పరచుకుంటారు. పని విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. అందచందాల మీద దృష్టి పెడతారు. కొత్త వస్తువుల కొనుగోలు చేస్తారు. ఇల్లు లేదా కార్యాలయాన్ని ఆధునీకరిస్తారు. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. కలిసొచ్చే రంగు:నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వ్యవహారాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పలుకుబడిగల వ్యక్తులతో పనులను చక్కబెట్టుకుంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూలం. కలిసొచ్చే రంగు: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ భవిష్యత్తులో మైలురాయిగా చెప్పుకోదగ్గ వారమిది. సమాజంలో పలుకుబడి, హోదా పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తదనంతో మీరు చేసే పనులు ఆకట్టుకుంటాయి. జీవిత భాగస్వామితో ప్రేమగా మెలుగుతారు. అవివాహితులకు అనుకూల కాలం. పనిలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కలిసొచ్చే రంగు: పసుపు -
టారో 7 మే నుంచి 13 మే 2017 వరకు
మేషం: మీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోను, వ్యక్తిగత జీవితంలోను పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. చాలాకాలంగా దూరంగా ఉంటున్న మిత్రులను అనూహ్యంగా కలుసుకుంటారు. అనవసర గోప్యత పాటించకండి. దీనివల్ల లేనిపోని సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య దృష్ట్యా ఆహార విహారాల్లో ఆత్మనియంత్రణను పాటించక తప్పదు. లక్కీ కలర్: ముదురు ఊదా వృషభం: వృత్తి ఉద్యోగాల్లో విపరీతమైన పోటీని ఎదుర్కొంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రత్యర్థులు ఎవరో తెలుసుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో అవరోధాలు తప్పకపోవచ్చు. క్రీడా పోటీల్లో గెలుపు కోసం విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇల్లు లేదా కార్యాలయం మార్పు చేయడానికి ఇది తగిన సమయం. కొత్త ప్రదేశాలకు వెళ్లడం ద్వారా సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: లేత పసుపు మిథునం: బాధాకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. పని ప్రదేశంలో ప్రతికూలతలు తప్పకపోవచ్చు. మానసిక సై్థర్యాన్ని ప్రోది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతికూలతలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మార్పును స్వాగతించడానికి సిద్ధపడితేనే పరిస్థితులు మెరుగుపడగలవని తెలుసుకుంటారు. శక్తియుక్తులన్నింటినీ కార్యాచరణపై కేంద్రీకరిస్తారు. లక్కీ కలర్: ముదురు నారింజ కర్కాటకం: వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉంటాయి. ఒక దురలవాటు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు చేతికందడం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. కొత్త ప్రదేశాల్లో పర్యటిస్తారు. పని ప్రదేశంలో గట్టి పోటీ ఎదురైనా మీ సత్తా చాటుకుంటారు. సహాయం కోసం కీలకమైన వ్యక్తులను కలుసుకుంటారు. లక్కీ కలర్: లేత ఎరుపు సింహం: లక్ష్యసాధన కోసం సర్వశక్తులూ కేంద్రీకరిస్తారు. స్వయంకృషితో అత్యున్నత స్థితికి చేరుకుంటారు. అయితే, జీవితంలో సాహసం లోపించినట్లుగా అనిపిస్తుంది. కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతారు. అనుభవాన్నంతా రంగరించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కోపతాపాలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆసక్తికరమైన కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. లక్కీ కలర్: పసుపు కన్య: జీవితంలో కొత్త దశ మొదలవుతుంది. సాధించిన ఫలితాలపై ఆత్మతృప్తి చెందుతారు. ప్రశాంతంగా రోజులు గడుపుతారు. జీవితం ఇదివరకటి కంటే ఆనందభరితంగా ఉంటుంది. నిరంతర శ్రమ నుంచి కొంత విరామం తీసుకుంటారు. సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళతారు. ప్రేమలో సాఫల్యత సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. ఆరోగ్యంపై దృష్టిపెడతారు. లక్కీ కలర్: లేత ఊదా తుల: ప్రత్యర్థులపై సవాలు విసురుతారు. శక్తిసామర్థ్యాలతో పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుంటారు. కలలను నెరవేర్చుకోగల అవకాశాలు కలసి వస్తాయి. అన్నీ మీ అంచనాల మేరకే జరుగుతాయి. దైవబలం మీవైపే ఉంటుంది. లక్ష్యం నుంచి దృష్టి మరల్చకుండా ఏకాగ్రతతో మెలగవలసి ఉంటుంది. వ్యాపారులు ఈ వారంలో ఎవరికీ ఎలాంటి అప్పులు ఇవ్వకపోవడమే మేలు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం: కాలం పరీక్ష పెడుతుంది. దేనికైనా సిద్ధమే అనేట్లు ఉండే మీ సహజ ధోరణే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు శాయశక్తులా శ్రమిస్తారు. పోరాటం లేనిదే గెలుపు సాధ్యం కాదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అసలే గడ్డు పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని సలహాలు కోరే మిత్రులు ఎదురవుతారు. కుటుంబం పట్ల శ్రద్ధ చూపుతారు. లక్కీ కలర్: నలుపు ధనుస్సు: వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. పని ఒత్తిడితో తీరిక లేకుండా గడుపుతారు. కొంత విశ్రాంతి, స్వేచ్ఛ కోరుకుంటారు. వెన్నునొప్పి బాధపెట్టవచ్చు. కుటుంబ సభ్యులపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి వస్తుంది. ఇతరులతో ఆలోచనలు పంచుకుంటారు. ఊగిసలాటకు దూరంగా ఉంటూ పరిస్థితులపై నియంత్రణ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ముదురు గోధుమ మకరం: సభలు సమావేశాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఫలితంగా ఇంట్లో గొడవలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వేళాపాళా లేని పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు అవసరమవుతాయి. బరువు అదుపులో ఉంచుకోవడానికి జాగ్రత్తలు ప్రారంభిస్తారు. లక్కీ కలర్: లేత నీలం కుంభం: మంచి చెడులలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోక తప్పని పరిస్థితి ఎదురవతుంది. పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన విజయాలు మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. కుటుంబ అవసరాల కోసం ప్రయాణాలు చేస్తారు. ఇంతవరకు గడిపిన ఉక్కిరిబిక్కిరి జీవితం నుంచి కొంత స్వేచ్ఛ దొరుకుతుంది. వాయిదా వేస్తూ వస్తున్న వ్యాపకాలలో నిమగ్నమయ్యేందుకు ప్రయత్నిస్తారు. లక్కీ కలర్: తెలుపు మీనం: ఇంటా బయటా మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. క్రమశిక్షణతో ఘన విజయాలు సాధిస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామి కోసం తగినంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. లక్కీ కలర్: పసుపు