టారో : 23 జూలై నుంచి 29 జూలై 2017 వరకు | Tarot: from 23 July to 29 July 2017 | Sakshi
Sakshi News home page

టారో : 23 జూలై నుంచి 29 జూలై 2017 వరకు

Published Sun, Jul 23 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

టారో : 23 జూలై నుంచి 29 జూలై 2017 వరకు

టారో : 23 జూలై నుంచి 29 జూలై 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
అదృష్టం మీ వెనకే ఉందా అన్నట్లుగా, ఈ వారమంతా మీకు అనుకూలంగా గడుస్తుంది. తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. నీతి నిజాయితీలతో మీరు చేసే వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇతరులకు సేవ చేయడంలో లభించే ఆనందాన్ని వెదుక్కుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పుకు ఈ వారం శుభారంభం జరుగుతుంది. వివాదాలలో జోక్యం వద్దు.
కలిసొచ్చే రంగు: గులాబీ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
భావోద్వేగాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. కెరీర్‌లో ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడతాయి. లక్ష్యసాధనకోసం కొన్నింటిని త్యాగం చేయవలసి రావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి ఇది అనుకూల కాలం. నిజంగా మీరు మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఈ వారంలోనే కలగవచ్చు. పనికీ, భావోద్వేగాలకూ మధ్య సమతుల్యాన్ని సాధించాలి.  
కలిసొచ్చే రంగు: అల్లం రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ అంచనాలు తప్పవచ్చు. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కదు ఈ వారం. దాంతో పనిమీద మనసు లగ్నం చేయలేకపోతారు. ఫలితం గురించి నిరాశపడకుండా కొత్త ప్రాజెక్టులు, పనుల కోసం అన్వేషించడం చెప్పదగ్గ సూచన. విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థికపరమైన వ్యవహారాల మీద కన్నేసి ఉంచడం మంచిది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కష్టపడి కొత్త టెండర్లు దక్కించుకుంటారు.
కలిసొచ్చే రంగు: నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే పనిమీద  దృష్టి పెట్టండి. మీ ఆలోచనలను సరిగా అమలు చేసినప్పుడే మీ పథకాలు విజయవంతం అవుతాయని గ్రహించండి. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగవచ్చు. ఆలస్యాన్ని నివారించే ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. అనూహ్యమైన ధనయోగం ఉంది.
కలిసొచ్చే రంగు: లేత నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఉద్యోగంలో భాగంగా కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు. అక్కడ మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జీవితం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేలా నూతన వ్యాపారానికి అడుగులు పడతాయి. ఒక బాంధవ్యంలో తీవ్రమైన అభద్రతాభావం ఏర్పడవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
కలిసొచ్చే రంగు:ముదురు బూడిదరంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కెరీర్‌ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేస్తారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి, తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది.
కలిసొచ్చే రంగు: అరిటాకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆర్థికంగా చాలా బాగుంటుంది. నూత్న వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రారంభించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్న అవరోధాలను అధిగమిస్తారు. అంతమాత్రాన నిశ్చింత పనికిరాదు. జరగవలసిన కార్యాల మీద దృష్టిపెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య ఏర్పడిన పొరపచ్ఛాలు తొలగించుకోవడం అవసరం.
కలిసొచ్చే రంగు: నారింజ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మన ఆలోచనలే మనం. మన చేతలే మనమేమిటో నిరూపిస్తాయి అన్నట్లుగా ఉంటుంది ఈ వారం. అంటే మీరు మంచి ఆలోచనలు, సానుకూల భావనలతో ఉంటే మీకు కూడా అంతా మంచే జరుగుతుంది. మీ మనసులో తిష్టవేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న నిరాశను, నిస్పృహను తరిమెయ్యండి. మౌనంగా మీ పని మీరు చేసుకుపోండి. మంచి ఫలితాలే లభిస్తాయి. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి.

కలిసొచ్చే రంగు: గోధుమ
ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆదాయానికి మించి ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. కొత్త ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు.  ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు ఉండవచ్చు. పనుల్లోనూ,. వృత్తి, వ్యాపారాలలోనూ అవరోధాలు ఏర్పడవచ్చు. బెంబేలెత్తకుండా, సన్నిహితుల సహకారంతో నేర్పుగా పరిష్కరించుకోవడం అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, ఉన్నంతలోనే దానధర్మాలు చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
దూరప్రయాణాలు ఉండవచ్చు. ప్రయాణంలో కొత్త పరిచయాలు ఏర్పడి, మీకు కొన్ని విషయాలలో భరోసా ఏర్పడవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటిమీద, ముఖ్యంగా సంతానం మీద దృష్టిపెట్టడం, జీవిత భాగస్వామితో సామరస్యంతో మెలగడం అవసరం. సృజనాత్మకంగా ఆలోచించి, మీ కలలు నిజం చేసుకుంటారు.
కలిసొచ్చే రంగు: బంగారు రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కొద్దిగా మూడీగా, దిగులుగా ఉంటారు. సంతానపరంగా సంతోషం కలిగించే వార్తలు వింటారు. మీ కోరికను నెరవేర్చమని మనసులో బలంగా కోరుకోండి, జరిగి తీరుతుంది. మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వారాంతంలో విందు వినోదాలలో మునిగి తేలుతారు.
కలిసొచ్చే రంగు: తెలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అనూహ్యమైన ఒక వార్త మిమ్మల్ని కుదిపి వేయవచ్చు. అయితే, ధ్యానంలోకి వెళ్లండి, దానికి పరిష్కారం దొరుకుతుంది. జీవిత భాగస్వామి సహకారం పూర్తిగా లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు అనుకూలమైన, ఆసక్తికరమైన ఫలితాలు ఉంటాయి.. కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటారు. జలుబు, సైనస్‌ సమస్యలు బాధించవచ్చు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు.
కలిసొచ్చే రంగు: లేత గులాబీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement