టారో : 29 అక్టోబర్‌ నుంచి 4 నవంబర్, 2017 వరకు | Tarot: 29 October to 4 November, 2017 | Sakshi
Sakshi News home page

టారో : 29 అక్టోబర్‌ నుంచి 4 నవంబర్, 2017 వరకు

Published Sun, Oct 29 2017 12:29 AM | Last Updated on Sun, Oct 29 2017 12:29 AM

Tarot: 29 October to 4 November, 2017

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
మీ మనసుకు నచ్చిన పని చేయడం ద్వారానే మీదైన గుర్తింపు పొందగలరని గుర్తించండి. కాస్త ఆలస్యమైనా, ఈ పనిలో  విజయం మీవైపే ఉంటుంది. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి బహుమతిగా ఏదైనా ప్రేమలేఖ రాసివ్వండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మీ ఆలోచనా విధానానికి తగ్గ నిర్ణయమే తీసుకోండి. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోండి. ప్రశాంతంగా ఉండడం అలవర్చుకోండి.
కలిసివచ్చే రంగు : తెలుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కొత్త పనులు మొదలుపెడతారు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న విజయం ఈ కొత్త పనుల్లో సాధిస్తారు. మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించడం మానండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. అయితే మీ జీవిత భాగస్వామితో ఎదురయ్యే గొడవలు కూడా మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేసేవే. ఇష్టంగా వారి మనసును గెలుచుకునే ప్రయత్నం చేయండి. ఇల్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కొత్త పదవులను అలంకరిస్తారు.
కలిసివచ్చే రంగు : పీచ్‌

మిథునం (మే 21 – జూన్‌ 20)
ప్రశాంతంగా ఆలోచించాల్సిన సమయం ఇది. చేపట్టిన పనులు కాస్త ఆలస్యంగా పూరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీ ప్రయత్నంలో మాత్రం లోటు అనేది ఉండకుండా చూసుకోండి. వృత్తిరీత్యా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీ స్థాయికి తగిన అవకాశాలైతేనే ఎంచుకోండి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి.
కలిసివచ్చే రంగు : నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బందిపెడుతోన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండి. జీవితంలో ఏది జరిగినా అంతిమంగా అది అలాగే జరుగుతుందన్న సత్యాన్ని గ్రహిస్తూ ముందుకెళ్లండి. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఈ కొత్త అవకాశాల ద్వారానే మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న గుర్తింపు దక్కుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈ వారం మీకు కొన్ని ఊహించని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోండి. వృత్తిరీత్యా మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశం వస్తే వెంటనే మీదైన ప్రతిభ చూపించేందుకు సిద్ధమైపోండి. ఇంటికి సంబంధించిన మరమ్మత్తులు చేసేందుకు ఇదే సరైన సమయం. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కలిసివచ్చే రంగు : ముదురు గులాబి

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీకు రానున్నదంతా మంచి కాలమే. మీదైన శైలిలో పనిచేస్తూ పోతే, మీకు ఎదురులేదన్న విషయాన్ని ఎప్పట్లానే బలంగా నమ్ముతూ ముందుకు వెళ్లండి. ప్రతికూల ఆలోచనలన్నీ పక్కనపెట్టేయండి. వృత్తిజీవితం కొత్తగా ఉంటుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మరింత మెరుగవుతుంది. ప్రేమ జీవితం ఆశాజనకంగా ఉండదు. విహార యాత్రలకు సన్నాహాలు చేయండి. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోండి.  
కలిసివచ్చే రంగు : ఎరుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
జీవితం మీకు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో కొద్దిరోజుల్లోనే చూస్తారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మానసికంగా సిద్ధంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలను దగ్గరకు కూడా రానివ్వకండి. కొత్త మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మార్పు మీ జీవితాశయం వైపుకు పడే మొదటి అడుగు అన్న ధైర్యంతో ఉండండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్థాలు వచ్చే సూచనలున్నాయి. వారికి ఎక్కువ సమయం కేటాయించి మీ ప్రేమను చాటుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కలిసివచ్చే రంగు : వెండి

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మీ బాధ్యతలేంటో, ఆలోచనలేంటో సరిగ్గా తెలుసుకోవాల్సిన సమయం ఇది. మీ జీవితాశయాన్ని చేరుకోవడానికి ఎప్పట్నుంచో వెనుకడుగు వేస్తూ వస్తున్నారు. దానికి ఇదే సరైన సమయం అని గ్రహించండి. మీ శక్తులేంటో గ్రహించి, వాటిని పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని తేల్చుకోండి. మీదైన గుర్తింపు దక్కాలంటే మీ శక్తినంతా కూడగట్టాలన్న విషయం మరవకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి బహుమతినివ్వండి.
కలిసివచ్చే రంగు : బంగారం

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఈ వారమంతా మీకు శుభ సూచకంగానే కనిపిస్తోంది. ఊహించని స్థాయి విజయం దక్కుతుంది. ఆ విజయం మీకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. మీపై మీకున్న నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. ఆత్మ విశ్వాసంతో కొత్త పనులు మొదలుపెడతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. అందరినీ కలుపుకోయే మీ ఆలోచనా విధానమే మీకు అన్నివిధాలా తోడ్పడుతుందని గ్రహించండి.
కలిసివచ్చే రంగు : పసుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
గతాన్ని గురించి ఆలోచిస్తూ కొన్ని అద్భుతమైన అవకాశాలను కోల్పోతున్నారన్న విషయాన్ని గ్రహించండి. మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చే ఈ అవకాశాలను ఆత్మస్థైర్యంతో స్వీకరించండి. విజయం మీ వైపే ఉందన్న విషయాన్ని మరవకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పట్నుంచో నేర్చుకోవాలని అనుకుంటున్న కొత్త విషయాన్ని ఇప్పుడే నేర్చేసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వ్యాయామం మొదలుపెడితే మంచిది.
కలిసివచ్చే రంగు : వెండి

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
జీవితాశం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కువ ఆలోచించకుండా మీరు ఏమవ్వాలనుకుంటున్నారో, అందుకు మీరు ఎంచుకోవాల్సిన మార్గం ఏంటో నిర్ణయించుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి జీవితం కొంత నిరాశాజనకంగానే ఉంటుంది. అయితే అన్నీ కుదురుకునే వరకూ మీ ప్రయత్నాల్లో మాత్రం లోటు అనేది ఉండకుండా చూసుకోండి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. విహారయాత్రలకు సన్నాహాలు చేయండి.
కలిసివచ్చే రంగు : నారింజ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన సమయం ఇదే. ఏదీ చేయలేమంటూ ఒక దగ్గరే ఆగిపోయే మీ ఆలోచనలకు స్వస్తి పలకాలి. మీ శక్తి, సామర్ధ్యాలు ఏంటో తెలుసుకొని ఆ దిశగా కష్టపడితే ఫలితం కనిపిస్తుంది. ప్రేమ జీవితం కొంత కలవరపెడుతుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. ఒక కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీదైన గుర్తింపు కోసం శక్తియుక్తులన్నీ పెట్టాలని నమ్మండి.
కలిసివచ్చే రంగు : గోధుమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement