టారో : 3 సెప్టెంబర్‌ నుంచి 9 సెప్టెంబర్‌ 2017 వరకు | Tarot: from 3 September to 9 September 2017 | Sakshi
Sakshi News home page

టారో : 3 సెప్టెంబర్‌ నుంచి 9 సెప్టెంబర్‌ 2017 వరకు

Published Sat, Sep 2 2017 11:56 PM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

టారో : 3 సెప్టెంబర్‌ నుంచి 9 సెప్టెంబర్‌ 2017 వరకు

టారో : 3 సెప్టెంబర్‌ నుంచి 9 సెప్టెంబర్‌ 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే నిర్ణయం తీసుకోబోతున్నారు. వినాయకుడి ఆశీస్సులు మిమ్మల్ని వెన్నంటే ఉంటాయి. ఉద్యోగంలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొలిక్కిరాకుండా ఇబ్బంది పెడుతోన్న ప్రాజెక్టు ఈ వారం విజయవంతంగా పూర్తవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీవైపే ఉంటుందని మరవకండి. న్యాయ సంబంధిత విషయంలో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
కలిసివచ్చే రంగు : ఊదా

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీ ఆలోచనా తీరు, పద్ధతులను చక్కబెట్టుకునేందుకు మంచి సమయమిది. వృత్తిపరంగా ఉన్న ఇబ్బందులు సర్దుకుంటాయి. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయం మీవైపే నిలుస్తుంది. వినాయకుడిపై నమ్మకం ఉంచండి. కొత్త పదవిని అలంకరిస్తారు. మీదైన శైలిలో నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని కొత్త పదవిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీ నాయకత్వంలో పనిచేస్తున్న వారు మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తారు.
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ ప్రణాళికలను సమీక్షించుకోవాల్సిన సమయమిది. కొత్త కోణంలో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితమంతా ఓ దగ్గర ఆగిపోయినట్టు, ఇక ముందుకు కదలడం లేదేమో అనిపిస్తూ ఉన్నట్లైతే, ఇదంతా తాత్కాలికమేనని నమ్మండి. ముందంతా మంచే జరుగుతుంది. వినాయకుడిని ఇష్టంగా పూజించండి. కొత్త ఉత్సాహంతో జీవితం అందంగా తయారవుతుంది.
కలిసివచ్చే రంగు : లేత గోధుమ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
మీ జీవితాన్ని మలుపుతిప్పే మార్పు చోటు చేసుకుంటుంది. వినాయకుడిని ఇష్టంగా కొలవండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. అడ్డంకులేవైనా ఎదురైనట్లు కనిపించినా, అదంతా తాత్కాలికమే. విజయంపై ధీమాతో కష్టపడండి. జిమ్‌లో చేరాల్సిన సమయమిది. బరువు తగ్గే ఆలోచన చేయండి.
కలిసివచ్చే రంగు : వెండి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీ జీవితానికి ఎంతో ప్రత్యేకమైన ఓ విషయంలో అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వినాయకుడిని పూజించండి. మీరు తీసుకునే నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ ఆలోచనలను చెడు వైపుకు మళ్లించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అలాంటి వారికి దూరంగా ఉంటూ జాగ్రత్త పడండి. మీ విశ్వాసాలను బలంగా చెప్పడం అలవర్చుకోండి. కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. నమ్మకంతో ఆ బాధ్యతలను చేపట్టండి.
కలిసివచ్చే రంగు : నలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీకు రానున్నదంతా మంచి కాలమే. మీరు కలలో కూడా సాధ్యపడదు అనుకున్న పనులు కూడా చక్కగా జరుగుతాయి. మంచి గుర్తింపు సంపాదిస్తారు. కొత్తగా మొదలుపెట్టే పనులన్నింటిపై నమ్మకం ఉంచి ముందడుగు వేయండి. విజయం మీవైపే ఉంటుంది. మీపై మీరు నమ్మకం ఉంచడం మరవొద్దు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు వ్యాయామం చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త కలవరపెడుతుంది. జాగ్రత్తగా చూసుకోండి.
కలిసివచ్చే రంగు : తెలుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవడమే జీవితంలో ఒడిదుడుకులకు కారణం అన్నది తెలుసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం అలవర్చుకోండి. జీవితంలో గొప్ప నిర్ణయాలు తీసుకొని ౖపైకి ఎదిగే సమయమిదే. మీకు ఇష్టమైన వ్యక్తి ఇచ్చే సూచనలు పాటించండి. కొత్త పనులు మొదలుపెడతారు. సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. కొంత కాలంగా పూర్తి చేయాలనుకుంటున్న ఇంటి పనులు కొన్ని పూర్తవుతాయి. మానసిక ఉల్లాసానికి విహారయాత్రకు వెళ్లండి.
కలిసివచ్చే రంగు : నీలం

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. కొత్తగా, ఉత్సాహంగా, మీదైన శైలిలో సవాళ్లను ఎదుర్కొండి. మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. కొన్ని రోజుల పాటు ఏదైనా విహార యాత్రలకు వెళ్లండి. ఈ యాత్రతో మీకు ప్రశాంతత చేకూరడంతో పాటు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సాహించే వ్యక్తులతో బాగా మాట్లాడండి.
కలిసివచ్చే రంగు : ఊదా

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
కొత్త విషయాలు తెలుసుకోవాలన్న మీ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించండి. వినాయకుడిపై నమ్మకం ఉంచి పనిచేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం మీకు మరింత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీకు ఇష్టమైన తత్వశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండండి.
కలిసివచ్చే రంగు : లేత గోధుమ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
జీవితాన్ని మీరు కోరుకునే విధంగా మలుచుకునే సమయం ఇదే. మీపై మీకున్న నమ్మకంతో నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన ప్రమాణాలు, మీకు మీరే ఏర్పరచుకున్న నియమాలను గుర్తు తెచ్చుకొని పనిచేయండి. పెద్దలను గౌరవించడం మరవకండి. వారి ఆశీస్సులు మీకు మరింత శక్తినిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటారు. ఇది మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సోమవారాలు మీకు బాగా కలిసివస్తాయి.
కలిసివచ్చే రంగు : నారింజ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
రానున్న రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ధైర్యంగా ముందడుగు వేసే మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. జీవితాన్ని ఎప్పట్లానే బాగా ఆస్వాదించండి. వృత్తిపరంగా మీకు గొప్ప గుర్తింపు దక్కుతుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ మంచి పని కూడా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామిని కలుసుకుంటారు.
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అనవసర ఖర్చులు చేస్తారు. ఇదే విషయంపై విపరీతంగా ఆలోచిస్తారు కూడా. మీ గమ్యం వైపుకు సరైన అడుగులు వేయాల్సిన సమయమిది. మీకు ఉపకరించే కొన్ని పనుల నుంచి మీకై మీరే దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని మీకేం కావాలో నిర్ణయించుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. లాఫింగ్‌ బుద్ధను ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఆదివారాలు మీకు బాగా కలిసివస్తాయి.
కలిసివచ్చే రంగు : బూడిద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement