టారో : 6 ఆగస్టు నుంచి 12 ఆగస్టు 2017 వరకు | Tarot: from 6 August to 12 August 2017 | Sakshi
Sakshi News home page

టారో : 6 ఆగస్టు నుంచి 12 ఆగస్టు 2017 వరకు

Published Sun, Aug 6 2017 2:41 AM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

టారో : 6 ఆగస్టు నుంచి 12 ఆగస్టు 2017 వరకు

టారో : 6 ఆగస్టు నుంచి 12 ఆగస్టు 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈ వారం చాలా సంతోషంగా, అదృష్టవంతంగా గడుస్తుంది. అయితే మీ అలవాట్లను, నమ్మకాలను మార్పు చేసుకోవలసిన తరుణమిది. కెరీర్‌పరంగా కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. తిరస్కరణలు, చిన్న చిన్న అవమానాలు ఎదురయే అవకాశం ఉంది. ఇంతమాత్రానికే మనసు పాడు చేసుకోవద్దు. ఈ దశకు త్వరలోనే ముగింపు వుంది. ఎమ్మెన్సీలో ఉద్యోగస్థులకు ప్రమోషన్లు ఖాయం.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అనుకున్నదానిని సాధించేందుకు సర్వశక్తులూ సమీకరించుకుంటారు. మొదటినుంచి అదే మీ బలం, బలహీనత. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లేదా సమతూకం సాధించడం మంచిది. మూసధోరణి నుంచి బయటకి వచ్చి కొత్త ఆలోచనలు చేస్తే మీరు బాగా లాభపడతారు. మీరు నిజంగా మార్పును కోరుకుంటుంటే, అది ఈ వారంలోనే సంభవిస్తుంది. పనికీ, ప్రేమవ్యవహారాలకు ముడిపెట్టద్దు.
కలిసొచ్చే రంగు: గోధుమరంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
రాబోయే నెల మీకు కొంచెం స్థబ్ధుగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ పని చేయడానికీ, ఎక్కడికైనా వెళ్లడానికీ మనస్కరించదు. ఒక విధమైన దిగులు, ఆందోళన, నిస్తేజం అలముకుని ఉంటుంది. అందువల్ల మీకు మీరే పని కల్పించుకుని, పునరుత్తేజం పొంది, చురుగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయడం మంచిది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. బహుళజాతి సంస్థలలో పని చేసేవారికి ప్రమోషన్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది.
కలిసొచ్చే రంగు: దొండపండు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
లక్ష్యసాధనకోసం మీ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసి రావచ్చు. అయితే ముఖ్యమైన, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇది అనుకూల కాలం. నిజంగా మీరు గనక మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఈ వారంలోనే కలగవచ్చు. అయితే, పనికీ, ప్రేమకూ మధ్య సమతుల్యాన్ని సాధించక తప్పదు. గతంలో చేసిన తప్పుల నుండి గుణపాఠాలు తీసుకోవడానికి ప్రయత్నించండి.
కలిసొచ్చే రంగు: నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
అనవసర భయాలను, ఆందోళనలను వదిలించుకుని, ప్రాక్టికల్‌గా ఉండండి. భయంకరమైన సంఘటనలు, కథలకు దూరంగా ఉండండి. అభద్రతాభావాన్ని విడిచిపెట్టండి. అప్పుడే మీకు ఆనందానికి అర్థం తెలుస్తుంది, ఆనందించడం తెలుస్తుంది. నిజానికి మీరెంతో అదృష్టవంతులు. మీ శక్తిసామర్థ్యాలను వెలికితీసి, వాటిని వినియోగంలోకి పెడితే మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు.
కలిసొచ్చే రంగు: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఆనందం, విజయం మీ వెంటే ఉంటాయీ వారం. ఇంటిని ఆధునీకరించుకునేందుకు ఇది తగిన సమయం. చాలా కాలంగా మీరు చేపట్టి ఉన్న ప్రాజెక్టు ఒకటి విజయవంతంగా పూర్తి చేస్తారు. గతనెలలో మిమ్మల్ని బాధించిన సమస్యలనుంచి బయటపడతారు. జీవితమనే పడవలో అపరిచిత బాటసారిలా ప్రయాణించండి. పడవ ఎటు తీసుకెళితే అటు వెళ్లండి. మీ ప్రేమ ఫలిస్తుంది.
కలిసొచ్చే రంగు: ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశ, ఆనందం, ఆత్రుతల న డుమ ఈ వారం గడుస్తుంది. సాహసాలు చేస్తారు. జీవితంలో ఒకసారి పడ్డవారే తిరిగి నిలదొక్కుకుని, మరిన్ని విజయాలు సాధిస్తారని గుర్తు తెచ్చుకోండి. నిరాశపడకండి. ఒకదాని వెనుక ఒకటి అవకాశాలు వెల్లువెత్తుతాయి. మీ విజ్ఞానాన్ని, ఆలోచనా పరిధిని పెంపొందించుకోండి. మంచి గ్రంథాలు అందుకు చదవండి. పదేపదే గతంలోకి తొంగి చూసుకుంటూ, మానుతున్న పాతగాయాలను రేపుకోవద్దు.
కలిసొచ్చే రంగు: దొండపండు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
సహనం, ఓపిక మీకు బాగా అవసరం. భవిష్యత్తు కోసం మీరు గతంలో బాగా శ్రమించారు. ఇప్పుడు ఆ ఫలాలను అందుకోబోతున్నారు. సానుకూల భావనలతో ఉండటం వల్లే జీవితప్రయాణం సానుకూలమవుతుందని గ్రహించండి. పాజిటివ్‌ ఆలోచనలను నింపుకునే వారే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనగలరు కూడా. కొత్త ప్రాజెక్టులు, కెరీర్‌ అవకాశాలు, కొత్త బాధ్యతలు వెదుక్కుంటూ వస్తాయి, మీ ధోరణిని బట్టి, మీ పనితీరును బట్టి.
కలిసొచ్చే రంగు: గులాబీ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీ లక్ష్యాలను చేరుకోవడానికి, ఆశయాలను సాధించడానికి మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, ఈ ప్రయాణ ం కొంచెం కష్టంగా ఉండవచ్చు. అంతమాత్రాన విసిగి వేసారి, మీ ప్రయాణం ఆపేశారనుకోండి, గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మీ తెలివితేటలను ధనార్జనకు ఉపయోగించండి, అదీ సక్రమ మార్గంలో...దీర్ఘకాల సమస్య ఒక కొలిక్కి వస్తుంది. మీ భాగస్వామితో సత్సంబంధాలు కలిగి ఉండండి.
కలిసొచ్చే రంగు: వెండి

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
భాగస్వామ్య వ్యవహారాలకు ఇది అనుకూల కాలం. పనిని సులభతరం చేయడానికి మీరు కనుగొన్న కొత్త మార్గాలు, పథకాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఫలప్రదం అవుతాయి. కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. పాతవాటి గురించి మరచిపోండి. ఒక అపురూపమైన బహుమతి అందుకుంటారు. పాత బాకీలు‡తీర్చేస్తారు. మరింత చురుగ్గా, ఉత్సాహంగా పని చేయండి. ఆరోగ్యం కోసం ఏదైనా జిమ్‌లో చేరండి లేదా వ్యాపకాన్ని అలవరచుకోండి.
కలిసొచ్చే రంగు: యాపిల్‌ గ్రీన్‌

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కొద్దిగా మూడీగా, దిగులుగా ఉంటారు. సంతానపరంగా సంతోషం కలిగించే వార్తలు వింటారు. మీ కోరికను నెరవేర్చమని మనసులో బలంగా కోరుకోండి, జరిగి తీరుతుంది. మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వారాంతంలో విందు వినోదాలలో మునిగి తేలుతారు.
కలిసొచ్చే రంగు: తెలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తను, శ్రద్ధను కనబరచవలసిన సమయమిది. మీ పరిధిలో మీరుండండి. త్వరలోనే అపరిచితుల నుంచి కొత్త తరహా సవాలును ఎదుర్కొనవలసి రావచ్చు. సిద్ధంగా ఉండండి. సామాజికంగా విందువినోదాలతో చాలా బిజీగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. పని మీద దృష్టి, శ్రద్ధ పెట్టండి. కోరికలకు లొంగిపోవద్దు. దూరప్రయాణాలు ఉండవచ్చు. వాటిని ఎంజాయ్‌ చేస్తారు కూడా!
కలిసొచ్చే రంగు: మెరుస్తున్న పసుప్పచ్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement