టారో : 21 మే నుంచి 27 మే 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేస్తారు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు కూడా చేరతాయి. ఏ సమస్య వచ్చినా, తగిన పరిష్కారం కనుగొనడంలో మీకు మీరే సాటి అనే విషయం గుర్తుంచుకోండి. మీ జీవిత లక్ష్యాలను సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. ఆ ప్రయత్నంలో ముందడుగు వేస్తారు కూడా!
కలిసివచ్చే రంగు:ఆకుపచ్చ
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
ఆర్థిక, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేస్తేనే ఫలితం ఉంటుందని గ్రహించండి. సొంత వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి.
కలిసివచ్చే రంగు: లేత వంకాయంగు
మిథునం (మే 21 – జూన్ 20)
మీ వాక్పటిమ, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబం తో కలసి దూరప్రయాణం చేస్తారు. మనసు చెప్పిన మాట విని, దాని ప్రకారం నడచుకోండి. గొంతునొప్పి బాధించవచ్చు. ప్రకృతి చికిత్సతో ఉపశమనం పొందుతారు.
కలిసి వచ్చే రంగు: వెండి
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. కొత్త పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు కొద్దిపాటి ఆశాభంగం. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు.
కలిసొచ్చే రంగు: గులాబీ
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
నూతనశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆఫీసులో పనులు చాలా వేగంగా ముందుకు జరుగుతాయి. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెళకువలతో పని చేయండి.
కలిసి వచ్చే రంగు: నారింజ
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే కష్టపడక తప్పదు.
కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్‌నిక్‌కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి.
కలిసొచ్చే రంగు: నారింజ
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
ఈవారం మందకొడిగా, బద్ధకంగా అనిపిస్తుంది. అయినా సరే, దూరప్రయాణాలు చేయక తప్పని సరి పరిస్థితి ఎదురవుతుంది. మీ ప్రేమ సఫలమవుతుంది. మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వారాంతంలో విందు వినోదాలలో మునిగి తేలుతారు. ఒక శుభకార్యానికి ఆహ్వానం అందుతుంది. అదే సమయంలో ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వస్తుంది.
కలిసొచ్చే రంగు: వెండి
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
ఉద్యోగంలో, పనిలో లేదా వృత్తిలో ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు వస్తుంది లేదా మీరు ఆశించిన మార్పును ఆమోదించడానికిది తగిన సమయం. ఈ మార్పు కాలంలో స్నేహితులతో సరదాగా కాసింత సేదతీరడం అవసరం. మొహమాటానికి పోయి మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే మునిగిపోతారు.
కలిసొచ్చే రంగు: చాకొలేట్
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
ఒక ప్రత్యేకమైన విందుకు ఆహ్వానం అందుతుంది. పనిలో విసుగు అనిపించినా, తప్పదన్నట్లు చేయవలసి రావడంతో నాణ్యతలేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు కొంచెం నెమ్మదిగా అందుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పనిలో మెళకువ లేకపోతే మాట పడక తప్పదు.
కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు రంగు
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మంచి కెరీర్, ఉన్నతమైన ఉద్యోగం లేదా హోదా కావాలనుకున్నప్పుడు కుటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. అప్పుడే మీరు జీవితంలో గెలుపొందే అవకాశాలు దక్కుతాయి. కొత్త కొలువులో చేరాలన్న ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద మీరు దృష్టిపెట్టండి, మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారంతంలో తీరనుంది.
కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కొత్తవారిని కలుస్తారు. శుభవార్తలు వింటారు. అదృష్టం వరిస్తుంది. సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగించే కాలమిది. ఎంతటి పని అయినా, యాంత్రికంగా కాక, శ్రద్ధాసక్తులతో చేస్తేనే విజయవంతమవుతుందని గ్రహించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కలిసొచ్చే రంగు: తెలుపు, లేత గులాబీ