టారో : 16 జూలై నుంచి 22 జూలై 2017 వరకు | Tarot: from 16 July to 22 July 2017 | Sakshi
Sakshi News home page

టారో : 16 జూలై నుంచి 22 జూలై 2017 వరకు

Published Sun, Jul 16 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

టారో : 16 జూలై నుంచి 22 జూలై 2017 వరకు

టారో : 16 జూలై నుంచి 22 జూలై 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈ వారమంతా స్తబ్దుగా, ఏమీ పని చేయనట్టుగా ఉంటారు. అయితే మానసికంగా మాత్రం మిమ్మల్ని మీరు సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ అలవాట్లు, నమ్మకాలు, భావోద్వేగాలలో మార్పులు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం. తిరస్కరణలు, నిరాశలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. నమ్మిన వారే వంచించే అవకాశం ఉంది. అయితే, అది ఒక దశ మాత్రమే.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి పని చేస్తారు. ఈ క్రమంలో చిన్న చిన్న వ్యక్తిగత ఆనందాలను కూడా త్యాగం చేయక తప్పని పరిస్థితి వస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే సమయం. ఎంతో కాలం నుంచి కోరుకుంటున్న మార్పులు ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలకూ, కుటుంబానికీ మధ్య సమతుల్యం సాధించడం, పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోక తప్పదు.
కలిసొచ్చే రంగు: గోధుమ

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ కృషి ఫలిస్తుంది. చేపట్టిన పనులన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. మీరు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మార్పు కార్యరూపం దాల్చేసరికి అది మీకంత అనుకూలమైనది కాదని తెలుసుకుంటారు. ప్రేమ విషయంలో మీకన్నా మీ ప్రియుడు లేదా ప్రియురాలు ముందంజలో ఉంటారు. వృత్తిపరంగా  చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది.  మీరు కోరిన గుర్తింపు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది.    
కలిసొచ్చే రంగు: దొండపండు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఆదాయానికి మించి ఖర్చు చేయవలసి రావడం వల్ల అప్పులు చేయక తప్పదు. ఆలోచనలలో అస్థిరత నెలకొంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు చెలరేగవచ్చు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు సహజమే అయినా, నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం.
కలిసొచ్చే రంగు: నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
 నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. వారు చెప్పిన మాట వింటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. దానిద్వారా కలిగిన సానుకూల భావనలతో ఉత్సాహంగా ఉంటూ బోలెడన్ని కార్యాలను అవలీలగా చక్కబెతారు.
కలిసొచ్చే రంగు: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కెరీర్‌ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి, తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది.
కలిసొచ్చే రంగు: ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆర్థికంగా బాగుంటుంది. షాపింగ్‌ చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. చేతిలోని ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలోని అవరోధాలను అధిగమిస్తారు. జరగవలసిన కార్యాలమీద దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య ఏర్పడిన పొరపచ్ఛాలు తొలగించుకోవడం అవసరం.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
భవిష్యత్తు కోసం గతంలో మీరు చేసిన కృషి ఫలిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. సానుకూల భావనలతో సత్ఫలితాలు సాధిస్తారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. అనుకోని బహుమతులు అందుతాయి. మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. అదనపు బాధ్యతలను తలకెత్తుకోవలసి వస్తుంది. బాధించిన కష్టాలు తొలగిపోతాయి.
కలిసొచ్చే రంగు: పసుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
 కొత్త ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు.  ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు ఉండవచ్చు. పనుల్లోనూ, వృత్తి, వ్యాపారాలలోనూ అవరోధాలు ఏర్పడవచ్చు. బెంబేలెత్తకుండా, సన్నిహితుల సహకారంతో నేర్పుగా పరిష్కరించుకోవడం అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, ఉన్నంతలోనే దానధర్మాలు చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
కలిసొచ్చే రంగు: గులాబీ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
భాగస్వామ్యపు వ్యాపారాలకు ఇది అనువైన సమయం. పనిలో కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పనులు మొదలు పెడతారు. వెయ్యిళ్ల పూజారిలా వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి పెద్ద పీట వేయక తప్పదు. ఫిట్‌నెస్‌ పెంచుకోవాలి. పిల్లల విద్యావిషయాలలో తలదూర్చవలసి వస్తుంది. విందు వినోదాలలో విరివిగా పాల్గొంటారు. సృజనాత్మకంగా ఆలోచించి, మీ కలలు నిజం చేసుకుంటారు.
కలిసొచ్చే రంగు: యాపిల్‌ గ్రీన్‌

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ప్రశాంతంగా, శాంతియుతంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఆహ్లాదంగా, గడుపుతారు. పని ప్రదేశంలో  కొద్దిపాటి ఇబ్బందులు, పరాభవాలు తప్పకపోవచ్చు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇంతకాలం కంటున్న పగటి కలలు, ఊహల స్థానంలో వాస్తవిక పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ఇరుగు పొరుగుతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మీ ప్రియుడు / ప్రియురాలిని కలుస్తారు.  
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండవలసిన తరుణమిది. మీ హద్దులు దాటి ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం తప్పని తెలుసుకుంటారు. దూర›ప్రయాణాలు అనివార్యం అవుతాయి. గుర్రాల్లా పరుగెత్తుతున్న కోర్కెలకు కళ్లెం వేయక తప్పదు. అవిశ్రాంతంగా పని చేయడంతోపాటు అలసిన శరీరానికి విశ్రాంతి అవసరం అని గ్రహించండి. పని మీద శ్రద్ధాసక్తులు చూపించండి.
కలిసొచ్చే రంగు: పసుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement