టారో : 9 జూలై నుంచి 15 జూలై2017 వరకు | Tarot from 9 July to 15 July 2017 | Sakshi
Sakshi News home page

టారో : 9 జూలై నుంచి 15 జూలై2017 వరకు

Published Sun, Jul 9 2017 2:06 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

టారో : 9 జూలై నుంచి 15 జూలై2017 వరకు

టారో : 9 జూలై నుంచి 15 జూలై2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈ వారం విజయవంతంగా సాగుతుంది. పనులన్నీ త్వర త్వరగా అవుతాయి. మీ నీతి నిజాయితీల వల్ల మీరు గతంలో ఏదో కోల్పోయారనుకున్నవన్నీ ఈ వారం మీకు లభిస్తాయి. మీ పాత పద్ధతులకు, కాలం తీరిపోయిన విధానాలకు స్వస్తి చెప్పి కొత్తదనాన్ని అవలంబించడం మంచిది.
కలిసొచ్చే రంగు: నారింజ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాలానుగుణంగా మారతారు. మార్పులకు స్వాగతం పలుకుతారు. కొత్త బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు కలుస్తాయి. వివాదాస్పదమైన మాటలకు, ప్రవర్తనకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలు లేదా ఉద్యోగులకు బోనస్‌ వచ్చే అవకాశం ఉంది.
కలిసొచ్చే రంగు: నీలం

మిథునం (మే 21 – జూన్‌ 20)
మనసు చెప్పే మాటను కాస్త శ్రద్ధ పెట్టి వినండి. మీ కలలు సాకారం అయ్యే అవకాశం ఉంది. కొన్ని ముఖ్య సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ప్రాజెక్టులు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవచ్చు. మీ విచక్షణ, తెలివితేటలను ఉపయోగించి, అవరోధాలను అధిగమిస్తారు. రిస్క్‌తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండండి.
కలిసొచ్చే రంగు: లేత పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో నైపుణ్యం సాధించాలి. విజయావకాశాలను జాగ్రత్తగా ఒడిసిపట్టుకోగలగాలి. గతంలో మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సత్ఫలితాలనిస్తుంది. మీ గమ్యాన్ని మార్చే ప్రయాణం ఉండవచ్చు. సానుకూల ఫలితాలు ఎన్నో ఉన్నాయి.
కలిసొచ్చే రంగు: చిలకపచ్చ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
స్థిరత్వానికి, భద్రతకు అనుకూల కాలమిది. అదేవిధంగా గృహనిర్మాణానికి, కొత్త పని ప్రారంభానికి, పెళ్లి ప్రయత్నాలకు చేసే ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రతిబంధకాలను అధిగమిస్తారు. గతం నుంచి బయటపడి వర్తమానంలో జీవించడం మంచిది. ఇబ్బడిముబ్బడిగా డబ్బు అందుతుంది. మీ ప్రయత్నాలకు ఊతం దొరుకుతుంది.
కలిసొచ్చే రంగు: పసుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వేయబోయే అడుగు మంచిదో కాదో తెలియక తికమకపడవద్దు. తెగించి ముందడుగు వేస్తే అనుకూల ఫలితాలను అందుకుంటారు. ఈ వారం మీకు శుభవార్తలు అందుతాయి. వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కెరీర్‌ బాగుంటుంది. ప్రేమ ఫలిస్తుంది.
కలిసొచ్చే రంగు: దొండపండు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
శుభవర్తమానం అందుతుంది. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు మనస్పూర్తిగా   మాట్లాడండి. మీ ప్రేమను దాచిపెట్టవద్దు. ఈ వారం జరిగేవన్నీ మీ భావోద్వేగాలకు సంబంధించినవే. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మార్పు జరుగుతుంది. ప్రయాణావకాశం ఉంది. కెరీర్‌ పరంగా బాగుంటుంది. ఇల్లు లేదా కార్యాలయం మారతారు.
కలిసొచ్చే రంగు: ఇటికరాయి రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మంచి రోజులు ముందున్నాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. పనిలో మీ ధోరణిని మార్చుకోవలసి వుంది. సానుకూల ధోరణితో చేసే పనులు ఫలప్రదం అవుతాయి. ధనపరంగా, పెట్టుబడుల పరంగా మీరు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. త్యాగం చేయవలసి వస్తుంది.
కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఈ వారమంతా చాలా బిజీగా గడుపుతారు. ఊపిరి సలపనంతటి పనుల ఒత్తిడిలో తల మనకలవుతారు. అయితే, పనిలో రొడ్డకొట్టుడు, మూస ధోరణి ఉన్నంతకాలం మీకది వర్కవుట్‌ కాదు. కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. భావోద్వేగాలలో చాలా మార్పు చేర్పులు జరుగుతాయి. ధ్యానం స్వాంతననిస్తుంది.
కలిసొచ్చే రంగు: వంకాయ రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
శుభవార్తల కోసం ఎదురు చూడవచ్చు. ఆర్థికలావాదేవీలు లాభదాయకం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి పెద్దమొత్తాలు చేతికందుతాయి. మీరెప్పుడూ ఊహించని అవకాశాలు వెల్లువెత్తుతాయి. అనుకూలమైన వాటిని ఎంచుకుని ధైర్యంగా ముందడుగు వేయండి. వివాహ ఘడియలు సమీపించాయి.
కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
గత కొద్దికాలంగా మీరు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి బయట పడతారు. మనశ్శాంతి, స్థిమితం లభిస్తాయి. బయటినుంచి డబ్బు చేతికందుతుంది. మీ పథకాలు ఫలిస్తాయి. కలలు సాకారమవుతాయి. మనసు పెట్టి పని చేయడం మంచిది. కొత్త వాహనం కొనుగోలు చేయచ్చు.
కలిసొచ్చే రంగు: నలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఆర్థికంగా చాలా బాగుంటుంది. ధనపరంగా మీరు కంటున్న కలలు ఫలిస్తాయి. బాగా షాపింగ్‌ చేసి, మనసు పడ్డవాటన్నింటినీ కొంటారు. వ్యాపారంలో మాత్రం తన, పరభేదాలు వద్దు. కష్టే ఫలి అన్నట్లుగా పని చేయండి, అప్పుడు విజయం మీ సొంతమవుతుంది. వాస్తవ విరుద్ధమైన ఆలోచనలు చేయవద్దు.
కలిసిచ్చే రంగు: ముదురాకుపచ్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement