టారో 2 జూలై నుంచి 8 జూలై 2017 వరకు | Tarot 2: From July to 8 July 2017 | Sakshi
Sakshi News home page

టారో 2 జూలై నుంచి 8 జూలై 2017 వరకు

Published Sun, Jul 2 2017 2:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

టారో 2 జూలై నుంచి 8 జూలై 2017 వరకు

టారో 2 జూలై నుంచి 8 జూలై 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఎంతో ఆనందోత్సాహాలతో పని చేస్తారు ఈ వారమంతా. ఎంతోకాలంగా మీరు కంటున్న కలల్లో కనీసం కొన్ని అయినా నెరవేరతాయి ఈ వారం. కెరీర్‌పరంగా కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయి. భావోద్వేగాలపరంగా మరికొంత బలంగా ఉండాలి మీరు. అవతలి వారి ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగవద్దు.  అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితులు శుభవార్తలు వింటారు.
కలిసొచ్చే రంగు: ఊదా

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
సమతుల్యత సాధించడమనేది మీ విజయానికి మూల సూత్రం. అన్నింటిలోనూ సమతూకం పాటించడం అవసరం. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, ఫలితమూ దక్కుతుంది. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ విజయంలో వారిని కూడా భాగస్వామ్యం చేయండి. ఇతరులు పని చేసేలా ప్రేరేపించండి.  
కలిసొచ్చే రంగు: గోధుమ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈ వారమంతా అవిశ్రాంతంగా పని చేసినప్పటికీ, ప్రణాళిక వేసుకుని, దాని ప్రకారం చేస్తే కానీ, పనులు తొందరగా పూర్తి కావు, అందులో విజయం వరించదనీ గ్రహిస్తారు. పనికిమాలిన, అవసరం లేని విషయాలపై సమయాన్నీ, డబ్బునూ వ్యర్థం చేయడం వృథా చేయడం అని తెలుసుకుంటారు. జీవితంలో ప్రధానమైన మార్పు సంభవం. పాత స్నేహితులు తిరిగి మీ జీవితంలోకి అడుగుపెడతారు.
కలిసి వచ్చే రంగు: దొండపండు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
బద్ధకంగా గడుపుతారు. మీ స్నేహితులు, బంధుమిత్రుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. కొన్ని ముఖ్య సభలు, సమావేశాలలో సందర్భాలలో మీ వాదాన్ని బలంగా వినిపించి, మిమ్మల్ని మీరు బలమైన వారిగా నిరూపించుకుంటారు. త్వరలో ఒక కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం మిమ్మల్ని వరించనుంది. ప్రవాహంలో కొట్టుకుపోతేనే అవకాశాలు వరిస్తాయని గ్రహించండి.
కలిసివచ్చే రంగు: ముదురు నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
భాగస్వామ్య వ్యాపార, వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్‌పరంగా వచ్చిన కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటారు.  
కలిసివచ్చే రంగు: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
గృహాన్ని ఆధునీకరించడానికి ఇది తగిన సమయం. మీ చేతిలోని ప్రాజెక్టులను చకచకా పూర్తి చేసి, కొత్త వాటిని అందిపుచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా గత నెలలో ఎదురైన గడ్డు అనుభవాల నుంచి తేరుకుంటారు. ప్రవాహం ఎటు తిరిగితే అటే పయనించడం మంచిదని తెలుసుకుంటారు. స్వల్పలాభాలను పొందుతారు.
కలిసి వచ్చే రంగు: ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
అవిశ్రాంతంగా పని చేస్తారు. సత్యానిదే అంతిమ విజయం అని గ్రహిస్తారు. ఒక మార్గం మూసుకుపోతే వంద మార్గాలు మనకోసం తెరిచే ఉంటాయని తెలుసుకుంటారు. గతానుభవాల దృష్టాంయ మీకు వచ్చిన కొత్త అవకాశాలను అశ్రద్ధ చేయకుండా చక్కగా అందిపుచ్చుకుంటారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేస్తారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతారు.
కలిసి వచ్చే రంగు: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్‌ తీసుకుని చేసిన పనులనుంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.
కలిసి వచ్చే రంగు: పసుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. అయితే అదే సమయంలో మీ విజ్ఞానాన్ని, తెలివితేటలను ధనార్జనకు కూడా వినియోగించడం మంచిదని తెలుసుకోవడం మంచిది. ఒక బంధం నుంచి బయట పడే ప్రయత్నం చేస్తారు కానీ, కుదరదు. మీపై పడిన అపనిందలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. .  
కలిసి వచ్చే రంగు: ఊదా

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు  పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం.  
కలిసి వచ్చే రంగు: యాపిల్‌ గ్రీన్‌

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
చురుకుగా పని చేస్తారు కానీ, అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిం^è ండి. మీ ఊహలను, ఆలోచనలను కొత్తదనంతో నింపుకోండి. ఆలోచనలలో తరచు మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. దానిలో సమన్వయాన్ని సాధించండి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది.
కలిసి వచ్చే రంగు: ఆకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. కీలకమైన పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్‌ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు.  ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.
కలిసి వచ్చే రంగు: పసుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement