టారో : 20 ఆగస్టు నుంచి 26 ఆగస్టు 2017 వరకు | Tarot: from 20 August to 26 August 2017 | Sakshi
Sakshi News home page

టారో : 20 ఆగస్టు నుంచి 26 ఆగస్టు 2017 వరకు

Published Sun, Aug 20 2017 12:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

టారో : 20 ఆగస్టు నుంచి 26 ఆగస్టు 2017 వరకు

టారో : 20 ఆగస్టు నుంచి 26 ఆగస్టు 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం మీరు కొంత మందకొడిగా, బద్ధకంగా ఉంటారు. ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా, సరదాగా గడుపుదామా అని ఎదురు చూస్తుంటారు. ప్రేమ సఫలమవుతుంది. ఇష్టమైన వారితో, మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం బాగుండదు. ఆందోళన పడవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. వారాంతంలో విందు వినోదాలలో మునిగి తేలుతారు.
కలిసొచ్చే రంగు: లేతాకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఆస్తుల కొనుగోలు కోసం మదుపు చేస్తారు. మీలో ఈవారమంతా ఆశ్చర్యానందాలు కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. డబ్బు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతుంది. వెనకటి తప్పులను పునరావృతం చేయవద్దు. కెరీర్‌పరంగా రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి. దూరప్రయాణం ఉండొచ్చు. చిక్కు సమస్యలలో ఉన్న మిత్రులను మీ తెలివితేటలతో బయట పడేసి, వారి అభిమానాన్ని చూరగొంటారు.
కలిసొచ్చే రంగు: గోధుమ

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ శక్తి సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు వస్తుందతి.. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగం లేదా పెళ్లి కోసం ఎదురు చూసే వారికి అనుకూల ఫలితాలుంటాయి.
కలిసొచ్చే రంగు: దొండపండు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
కొత్త బంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. వృత్తిపరమైన చిక్కులు, చికాకులు తొలగి మీకంటూ ఒక దారి ఏర్పడుతుంది. ఏది ముందో, ఏది తర్వాతో, ఏది  ముఖ్యమైనదో, ఏది కాదో అవగాహన ఏర్పరచుకుని తగ్గట్టు మెలగకపోతే మీరు ఎదగడం కష్టం. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మనసును సానుకూల భావనలతో నింపుకోండి మేలు కలుగుతుంది.
కలిసొచ్చే రంగు: ముదురు నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఊహాలోకంలో విహరించడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలు పెడతారు. అదే మీకు అదృష్టాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. మీ ప్రతిభకు సామాజిక మాధ్యమాలలో మంచి ప్రచారం లభిస్తుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. తెలివితేటలతో నడుచుకోవడం వల్ల ఆదాయం కూడా బాగానే ఉంటుంది. విందు వినోదాలలో సంతోషంగా గడుపుతారు. అయితే, ఆరోగ్యపరంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
కలిసొచ్చే రంగు: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈ వారమంతా ఆఫీస్‌పరమైన ప్రయాణాలు ఉంటాయి. అయితే, వారాంతంలో కుటుంబంతో పిక్నిక్‌కు వెళతారు. అందరినీ కలుపుకుని పని చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఎంతోకాలంగా మీరు కంటున్న కలలు కార్యరూపం దాలుస్తాయి. పనిలో మాత్రం బద్ధకాన్ని వదిలించుకుని, మరింత చురుకుగా, మరింత అంకిత భావంతో ఉంటేనే మీ లక్ష్యాలను చేరుకోగలరని తెలుసుకుంటారు. మెడ లేదా తల నొప్పి బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త.
కలిసొచ్చే రంగు: ఊదా రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
జీవితం మీద కొత్త ఆశలు చిగురిస్తాయి. పనిలో సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ఖర్చులు తగ్గించుకుని, అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. మీ ఆదాయ వనరులకీ, మీ కోర్కెలకీ మధ్య సమన్వయం సాధిస్తే కానీ మీ బడ్జెట్‌ లోటు పూడదని గ్రహిస్తారు. అనవసర వివాదాలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా నేర్పుగా తప్పుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థికంగా చాలా బాగుంటుంది. భూమి కొనుగోలు చే స్తారు లేదా భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. జీవితంలో కొత్త మార్గాన్ని, గమ్యాన్నీ ఎంచుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు భావోద్వేగంతో ఉంటారు. మీ ప్రేమ సఫలం కాలేదనో, పెళ్లి సంబంధం చేజారిపోయిందనో దిగులు పడవద్దు. మరో మంచి వ్యక్తి మీకోసం వేచి ఉన్నారని అర్థం చేసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది.
కలిసొచ్చే రంగు: నలుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. మీ ఎదుగుదలకు మీ కోరికలే అడ్డుపడుతున్నాయని గ్రహించి, వాటి మీద నియంత్రణ సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. మీ పిల్లలకు, కుటుంబానికి ఆనందం కలిగిస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది  తగిన సమయం కాదు.  ఎంతోకాలంగా దూరంగా ఉన్న ఒక ఆత్మీయుడిని లేదా స్నేహితుని కలుస్తారు. డిప్రెషన్‌ నుంచి బయపడే ప్రయత్నం చేస్తారు.
కలిసొచ్చే రంగు: ఇటిక రాయి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
పాత బాకీల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. బృందంతో కలసి పని చేసి మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. మీ సన్నిహితులకు కూడా మీరు ఏమి చేయాలనుకుంటున్నదీ చెప్పకండి. ఒక పెద్దమనిషి సహకారంతో త్వరలోనే మీ కోరికలన్నీ తీరతాయి. అందరితోనూ సామరస్యంగా మెలగడం వల్ల మనశ్శాంతి అని తెలుసుకుంటారు.
కలిసిచ్చే రంగు: నీలం

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అదృష్టం మీ వెనకే ఉందా అన్నట్లుగా, ఈ వారమంతా మీకు అనుకూలంగా గడుస్తుంది. తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాల్యజ్ఞాపకాలలో మునిగి తేలుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు. అనవసర వివాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, వాదోపవాదాలు జరగకుండా జాగ్రత్త అవసరం. పరిశోధన అధ్యయనం మీకు మేలు చేస్తుంది.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉండవచ్చు. కొత్త శక్తి పుంజుకుంటారు. విదేశాలనుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల దిశలో పయనిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత. ఆసక్తికరమైన వార్తలు వింటారు. కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటారు. జలుబు, సైనస్‌ సమస్యలు బాధించవచ్చు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. మీ ఆలోచనలే మీకు మేలు చేస్తాయి.
కలిసొచ్చే రంగు: పసుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement