టారో మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19) | Tarot: Aries (March 21 - April 19) | Sakshi
Sakshi News home page

టారో మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

Published Sun, Jun 25 2017 2:14 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

టారో మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

టారో మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

ఎంతో ప్రశాంతంగా, హాయిగా సాగిపోతుందీవారమంతా! జీవితాశయాన్ని సాధించి తీరాలి అన్న పట్టుదలతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. మానసిక, శారీరక ఒత్తిళ్లను తొలగించుకునేందుకు పెయింటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్, పొయెట్రీ... ఇలా దేని మీద ఆసక్తి ఉంటే దానిలో కృషి చేయండి. ఆత్మవిశ్వాసాన్ని  సడలనివ్వవద్దు. సానుకూల భావనలతోనే ఉండండి. విజయం చేకూరుతుంది.
కలిసొచ్చే రంగు: తెలుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వారమంతా కొత్త విషయాలు నేర్చుకోవడంలో వెచ్చిస్తారు. ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకోవడం అవసరం. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, పాత జ్ఞాపకాలతో సతమతమయ్యే బదులు భవిష్యత్తుపై దృష్టి పెట్టడం మంచిది. వీలయినంతవరకు పదిమందితో కలిసి గడిపేందుకు, మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి.
కలిసొచ్చే రంగు: దొండపండు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈ వారమంతా అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. తదుపరి ప్రాజెక్టు కోసం సమయం వెచ్చించండి. జీవితమనేది అనుభవించడానికీ, కొత్తదనాన్ని ఆస్వాదించడానికీ అని గుర్తుంచుకోండి.
కలిసి వచ్చే రంగు: వంకాయరంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఎటువంటి చిక్కులూ, చింతలూ లేకుండా హాయిగా గడపాలని మీరు ఎంతగా ప్రయత్నం చేసినా, కష్టాలు, కడగళ్లు ఉంటేనే, వాటిని ఎదుర్కొంటేనే జీవితమని గుర్తించండి. పని ప్రదేశంలో మరింత శ్రద్ధాభక్తులతో వ్యవహరించడం అవసరం. ఆరోగ్యం విషయంలో ఆందోళన వదిలి, జాగ్రత్తలు తీసుకోండి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాల నుంచి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
కలిసివచ్చే రంగు: ఎరుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాత జ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా సాంత్వన లభిస్తుంది.
కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మనసు చెప్పిన మాట వినండి.
కలిసి వచ్చే రంగు: ఎరుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్‌ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.
కలిసి వచ్చే రంగు: బూడిద

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
 సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు.  
కలిసి వచ్చే రంగు: ఇంద్రధనుస్సు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు  పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం.  
కలిసి వచ్చే రంగు: బంగారు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మీ ఆలోచనలనూ, పథకాలనూ అమలు చేసేందుకు ఇది తగిన సమయం. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటారు. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించకుంటే చిక్కులు తప్పవు. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.
కలిసి వచ్చే రంగు: నారింజ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్‌ తీసుకుని చేసిన పనుల నుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. కోపం తగ్గించుకోకపోతే చిక్కులు తప్పవు. వాహనం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. పిల్లలు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.
కలిసి వచ్చే రంగు: లేత గులాబి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement