టారో : 4 జూన్‌ నుంచి 10 జూన్‌ 2017 వరకు | Tarot: from 4 June to 10 June 2017 | Sakshi
Sakshi News home page

టారో : 4 జూన్‌ నుంచి 10 జూన్‌ 2017 వరకు

Published Sat, Jun 3 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

టారో : 4 జూన్‌ నుంచి 10 జూన్‌ 2017 వరకు

టారో : 4 జూన్‌ నుంచి 10 జూన్‌ 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
మీ ప్రేమ ఫలిస్తుంది. పెద్దల అంగీకారంతో త్వరలోనే పెళ్లి బాజా మోగుతుంది. ఈ వారమంతా విజయాల వెల్లువలో ఉంటారు. ప్రభుత్వ పనులకు సంబంధించి అధికారుల అండదండలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. కెరీర్‌ పరంగా మీరు అనుకున్న మార్పు చేర్పులు జరుగుతాయి. ఎంతో అనుకూలమైన ఈ సమయాన్ని మీ కలలను సాకారం చేసుకోవడానికి ఉపయోగించుకోండి.
కలిసొచ్చే రంగు: ఆలివ్‌ గ్రీన్‌

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. గమ్యం తెలియక  అయోమయంగా ఉన్న మీకు ఇప్పుడు సరైన మార్గం తెలుస్తుంది. విజయం ఇచ్చిన ఆనందోత్సాహాలలో తేలిపోతారు. వృత్తిపరమైన ప్రావీణ్యాన్ని సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితం కోసమూ కొంత సమయం కేటాయించుకోండి. ఒక శుభకార్యం మూలంగా సన్నిహితులతోఉన్న విభేదాలు తొలగి, తిరిగి స్నేహ సంబంధాలు కలుస్తాయి.
కలిపొచ్చే రంగు:ఊదా

మిథునం (మే 21 – జూన్‌ 20)
అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ఉన్నతlహోదాలు. ఇంటిలో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం కలిగే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కలిసొచ్చే రంగు: ముదురు పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. బంధుమిత్రులతో అకారణ వైరం, చికాకులు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం నెలకొనే అవకాశముంది. కోర్టు వ్యవహారాలలో చుక్కెదురయ్యే అవకాశం.
కలిసొచ్చే రంగు: పాలమీగడ రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
విలాసాలకు ఎక్కువ వ్యయం చేయడం వల్ల అప్పుల తిప్పలు తప్పవు. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్థలు, స్నేహితులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల వీలయినంతవరకు సంయమనం పాటించడం మంచిది. కొన్ని సందర్భాలలో ఆలోచనలు కలసిరావు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అవాంతరాలు ఏర్పడ్డా, ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు.  
కలిసొచ్చే రంగు: నారింజ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలు సఫలం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పని చేసి, పెండింగ్‌ ప్రాజెక్టులను చకచకా పూర్తి చేస్తారు. వెలుగులోకి రావడానికి, సమాజంలో మీకంటూ ఒక పేరు, ప్రతిష్ఠలను పొందడానికి మీరు ఇంతకాలంగా చేస్తున్న కృషి ఫలిస్తుంది. మళ్లీ మంచిరోజులు వచ్చాయనిపిస్తుంది.
కలిసొచ్చే రంగు: మట్టిరంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి నిరాశ తప్పక పోవచ్చు. ఆర్థికంగా ఫరవాలేదనిపిస్తుంది. ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. పలుకుబడిగల వ్యక్తుల మూలంగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలలో మౌనాన్ని ఆశ్రయించడం మేలు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు.
కలిసొచ్చే రంగు: లేత నీలం

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వృశ్చికం: శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఇల్లు మారడం లేదా ఉద్యోగంలో  మార్పు చోటు చేసుకోవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు వస్తాయి. ఒక ముఖ్యవిషయంలో కీలక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. దానిమూలంగా కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు.
కలిసొచ్చే రంగు: వంకాయరంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంటర్వూ్యలకు పిలుపులు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఒక వ్యాపారంలో లేదా చేపట్టిన ప్రాజెక్టులో మంచి లాభాలు సాధిస్తారు. మీ మనసుకు తోచిన విధంగా చేయండి, విజయం మీదే! ఇతరులకు కష్టమైనదే కావచ్చు కానీ, మీకు మాత్రం అది సులువే.
కలిసొచ్చే రంగు: తెలుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఆధ్యాత్మికతవైపు మొగ్గు చూపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు, మానసిక అశాంతి ఉండవచ్చు. అయితే మీకున్న వాక్చాతుర్యం, వ్యవహార దక్షతతో అన్నింటినీ అధిగమిస్తారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. ఆనందంగా గడుపుతారు.
కలిసొచ్చే రంగు: లేత గులాబీ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అనుకున్నదానిని సాధించేందుకు సర్వశక్తులూ సమీకరించుకుంటారు. మొదటినుంచి అదే మీ బలం, బలహీనత. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లేదా సమతూకం సాధించడం మంచిది. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కలిసొచ్చే రంగు: గోధుమరంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో, కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. సొంతవ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.
కలిసొచ్చే రంగు: పాచిరంగు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement