టారో 14 మే నుంచి 20 మే 2017 వరకు | Tarot : from May 14 to May 20, 2017 | Sakshi
Sakshi News home page

టారో 14 మే నుంచి 20 మే 2017 వరకు

Published Sun, May 14 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

టారో 14 మే నుంచి 20 మే 2017 వరకు

టారో 14 మే నుంచి 20 మే 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో కలహాలుండవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి నిరుత్సాహం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో తిరిగి పుంజుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి అయే సూచనలున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. బాల్యమిత్రుని కలిసి ఆనందంగా గడుపుతారు.
కలిసొచ్చే రంగు: ఊదా

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
పోటీయే పరమావధిగా గడుపుతారు. శత్రువులపై మీదే పై చేయి. ఆదాయం నిరాశ కలిగించవచ్చు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. ఉద్యోగ, వ్యాపార రీత్యా దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రుణాల విషయంలో బంధువర్గం నుంచి ఒత్తిడులు. కొత్త ప్రదేశానికి మారవచ్చు. మారిన చోట ఆనందకరమైన వాతావరణమే నెలకొంటుంది. గతం నుంచి బయట పడతారు.
కలిసొచ్చే రంగు: లేత పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు తప్పవు. అయితే, వాటిని మనస్పూర్తిగా ఆమోదిస్తే మంచే.  
కలిసొచ్చే రంగు: నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
కుటుంబసమస్యలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, ఆనందకరమైన వాతావరణంలో అడుగుపెడతారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. వ్యసనాలనుంచి బయటపడతారు. దూరప్రయాణాలు ఉండవచ్చు. పని ప్రదేశంలో రోజురోజుకూ పోటీ పెరుగుతుంది. ముఖ్యమైన, పలుకుబడి గల వ్యక్తులను కలవడానికి ఇది తగిన సమయం.
కలిసొచ్చే రంగు: దొండపండు రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. అవసరం అయితే మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడగట్టుకుని ఆగిపోయిన పనులు పూర్తి చేయండి. త్వరలోనే కొత్త వ్యాపారం లేదా ప్రస్తుత వ్యాపారానికి కొత్త శాఖను ప్రారంభిస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆసక్తికరమైన వ్యక్తిని కలుస్తారు.  
కలిసిచ్చే రంగు: పసుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుని మరీ పనులు పూర్తి చేస్తారు. అదనపు బాధ్యతలు నెత్తిన పడవచ్చు. దూరప్రయాణాలు. సోదరులు, సోదరీలతో కలహాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. కుటుంబసభ్యులను బహుమతులు ఇచ్చి ఆనందింప చేసే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు. కొన్ని అవాంతరాల వల్ల వెళ్లిన  చోటేæచిక్కుకుపోతారు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ అవసరం.
కలిసొచ్చే రంగు: వంకాయ రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మీ ముందున్న సవాళ్లను ఓర్పుగా, నేర్పుగా అధిగమించేందుకు ప్రయత్నించండి కానీ, బెంబేలెత్తవద్దు. మీ కలలను సాకారం చేసుకునే సమయమిది. నూతన ఉద్యోగావకాశాలు తలుపు తడతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. భవిష్యత్‌కు తగిన కార్యాచర ణ అవసరం.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పిల్లలను ఆనందింపజేసే ప్రయత్నం చేయండి. గతం నుంచి గుణపాఠం నేర్చుకోండి కానీ, కుంగిపోవద్దు. వ్యాపారస్తులు అప్పులు ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.
కలిసొచ్చే రంగు:నలుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీరు కంటున్న కలలు సాకారమవుతాయి. మీ శక్తిసామర్థ్యాలకు, ఓర్పుకు పరీక్షా అన్నట్లు ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవరోధాలు. మీ కష్టసుఖాలను సహోద్యోగులతో పంచుకుని ఊరట పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధం విషయంలో దృఢంగా ఉంటారు.
కలిసొచ్చే రంగు: పగడం రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
విందు వినోదాలలో గడుపుతారు. సామాజిక సంబంధాలను మెరుగు పరచుకుంటారు. పని విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. అందచందాల మీద దృష్టి పెడతారు. కొత్త వస్తువుల కొనుగోలు చేస్తారు. ఇల్లు లేదా కార్యాలయాన్ని ఆధునీకరిస్తారు. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు.
కలిసొచ్చే రంగు:నీలం

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పలుకుబడిగల వ్యక్తులతో పనులను చక్కబెట్టుకుంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూలం.
కలిసొచ్చే రంగు: తెలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ భవిష్యత్తులో మైలురాయిగా చెప్పుకోదగ్గ వారమిది. సమాజంలో పలుకుబడి, హోదా పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తదనంతో మీరు చేసే పనులు ఆకట్టుకుంటాయి. జీవిత భాగస్వామితో ప్రేమగా మెలుగుతారు. అవివాహితులకు అనుకూల కాలం. పనిలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
కలిసొచ్చే రంగు: పసుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement