టారో 7 మే నుంచి 13 మే 2017 వరకు | Tarot from 7 May to 13 May 2017 | Sakshi
Sakshi News home page

టారో 7 మే నుంచి 13 మే 2017 వరకు

Published Sun, May 7 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

టారో 7 మే నుంచి 13 మే 2017 వరకు

టారో 7 మే నుంచి 13 మే 2017 వరకు

మేషం: మీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోను, వ్యక్తిగత జీవితంలోను పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. చాలాకాలంగా దూరంగా ఉంటున్న మిత్రులను అనూహ్యంగా కలుసుకుంటారు. అనవసర గోప్యత పాటించకండి. దీనివల్ల లేనిపోని సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య దృష్ట్యా ఆహార విహారాల్లో ఆత్మనియంత్రణను పాటించక తప్పదు.
లక్కీ కలర్‌: ముదురు ఊదా

వృషభం: వృత్తి ఉద్యోగాల్లో విపరీతమైన పోటీని ఎదుర్కొంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రత్యర్థులు ఎవరో తెలుసుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో అవరోధాలు తప్పకపోవచ్చు. క్రీడా పోటీల్లో గెలుపు కోసం విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇల్లు లేదా కార్యాలయం మార్పు చేయడానికి ఇది తగిన సమయం. కొత్త ప్రదేశాలకు వెళ్లడం ద్వారా సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: లేత పసుపు

మిథునం: బాధాకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. పని ప్రదేశంలో ప్రతికూలతలు తప్పకపోవచ్చు. మానసిక సై్థర్యాన్ని ప్రోది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతికూలతలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మార్పును స్వాగతించడానికి సిద్ధపడితేనే పరిస్థితులు మెరుగుపడగలవని తెలుసుకుంటారు. శక్తియుక్తులన్నింటినీ కార్యాచరణపై కేంద్రీకరిస్తారు.
లక్కీ కలర్‌: ముదురు నారింజ

కర్కాటకం:
వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉంటాయి. ఒక దురలవాటు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు చేతికందడం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. కొత్త ప్రదేశాల్లో పర్యటిస్తారు. పని ప్రదేశంలో గట్టి పోటీ ఎదురైనా మీ సత్తా చాటుకుంటారు. సహాయం కోసం కీలకమైన వ్యక్తులను కలుసుకుంటారు.
లక్కీ కలర్‌: లేత ఎరుపు

సింహం: లక్ష్యసాధన కోసం సర్వశక్తులూ కేంద్రీకరిస్తారు. స్వయంకృషితో అత్యున్నత స్థితికి చేరుకుంటారు. అయితే, జీవితంలో సాహసం లోపించినట్లుగా అనిపిస్తుంది. కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతారు. అనుభవాన్నంతా రంగరించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కోపతాపాలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆసక్తికరమైన కొత్త వ్యక్తిని కలుసుకుంటారు.
లక్కీ కలర్‌: పసుపు

కన్య: జీవితంలో కొత్త దశ మొదలవుతుంది. సాధించిన ఫలితాలపై ఆత్మతృప్తి చెందుతారు. ప్రశాంతంగా రోజులు గడుపుతారు. జీవితం ఇదివరకటి కంటే ఆనందభరితంగా ఉంటుంది. నిరంతర శ్రమ నుంచి కొంత విరామం తీసుకుంటారు. సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళతారు. ప్రేమలో సాఫల్యత సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. ఆరోగ్యంపై దృష్టిపెడతారు.
లక్కీ కలర్‌: లేత ఊదా

తుల: ప్రత్యర్థులపై సవాలు విసురుతారు. శక్తిసామర్థ్యాలతో పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుంటారు. కలలను నెరవేర్చుకోగల అవకాశాలు కలసి వస్తాయి. అన్నీ మీ అంచనాల మేరకే జరుగుతాయి. దైవబలం మీవైపే ఉంటుంది. లక్ష్యం నుంచి దృష్టి మరల్చకుండా ఏకాగ్రతతో మెలగవలసి ఉంటుంది. వ్యాపారులు ఈ వారంలో ఎవరికీ ఎలాంటి అప్పులు ఇవ్వకపోవడమే మేలు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృశ్చికం: కాలం పరీక్ష పెడుతుంది. దేనికైనా సిద్ధమే అనేట్లు ఉండే మీ సహజ ధోరణే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు శాయశక్తులా శ్రమిస్తారు. పోరాటం లేనిదే గెలుపు సాధ్యం కాదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అసలే గడ్డు పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని సలహాలు కోరే మిత్రులు ఎదురవుతారు. కుటుంబం పట్ల శ్రద్ధ చూపుతారు.
లక్కీ కలర్‌: నలుపు

ధనుస్సు: వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. పని ఒత్తిడితో తీరిక లేకుండా గడుపుతారు. కొంత విశ్రాంతి, స్వేచ్ఛ కోరుకుంటారు. వెన్నునొప్పి బాధపెట్టవచ్చు. కుటుంబ సభ్యులపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి వస్తుంది. ఇతరులతో ఆలోచనలు పంచుకుంటారు. ఊగిసలాటకు దూరంగా ఉంటూ పరిస్థితులపై నియంత్రణ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్‌: ముదురు గోధుమ

మకరం: సభలు సమావేశాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఫలితంగా ఇంట్లో గొడవలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వేళాపాళా లేని పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు అవసరమవుతాయి. బరువు అదుపులో ఉంచుకోవడానికి జాగ్రత్తలు ప్రారంభిస్తారు.
లక్కీ కలర్‌: లేత నీలం

కుంభం: మంచి చెడులలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోక తప్పని పరిస్థితి ఎదురవతుంది. పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన విజయాలు మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. కుటుంబ అవసరాల కోసం ప్రయాణాలు చేస్తారు. ఇంతవరకు గడిపిన ఉక్కిరిబిక్కిరి జీవితం నుంచి కొంత స్వేచ్ఛ దొరుకుతుంది. వాయిదా వేస్తూ వస్తున్న వ్యాపకాలలో నిమగ్నమయ్యేందుకు ప్రయత్నిస్తారు. లక్కీ కలర్‌: తెలుపు

మీనం: ఇంటా బయటా మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. క్రమశిక్షణతో ఘన విజయాలు సాధిస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామి కోసం తగినంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. లక్కీ కలర్‌: పసుపు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement