టారో 28 మే నుంచి 3 జూన్‌2017 వరకు | Tarot from May 28 to June 3 | Sakshi
Sakshi News home page

టారో 28 మే నుంచి 3 జూన్‌2017 వరకు

Published Sun, May 28 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

టారో 28 మే నుంచి 3 జూన్‌2017 వరకు

టారో 28 మే నుంచి 3 జూన్‌2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఆటంకాలకు, సవాళ్లకు, నిస్పృహ కలిగించే పరిస్థితులకు అవలి వైపు చూడటాన్ని అలవరచుకుంటారు. విభిన్న దృక్పథంతో ప్రతికూల పరిస్థితుల్లో సైతం దైనందిన జీవితాన్ని ఆనందంగా గడిపేయగలరు. సుస్థిరత వైపుగా మీ సృజనాత్మకతను, ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో మానసిక దారుఢ్యాన్ని పెంచుకుంటారు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయేమోననే భయంతో నిరాశావాదంలో కూరుకుపోతారు. కాస్తంత సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటే తేలికగానే పరిస్థితులను అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. ఇతరులపై ఆధారపడటం కంటే స్వయంకృషిని నమ్ముకోవడం మేలని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మీ బాగోగులు పట్టించుకునే వ్యక్తి ఒకరి నుంచి అద్భుతమైన సలహాలు అందుతాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఇదివరకటి ప్రయత్నాలకు తగిన ఫలాన్ని అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతమై మీ అదృష్టాన్నే మార్చేస్తుంది. పనిలో నైపుణ్యాలను పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక లాభాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు చేయడానికి అనువైన సమయం. సుదూర యాత్రల ద్వారా ఆనందం పొందడంతో పాటు అనుబంధాలను బలపరచుకుంటారు.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
పరిస్థితులకు తలవంచక తప్పదు. లక్ష్యసాధనకు చేరువవుతున్న దశలో ఓరిమిని కోల్పోవద్దు. నిలకడగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా ఆహార విహారాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది.  
లక్కీ కలర్‌: గులాబి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కృతనిశ్చయంతో ఏకాగ్రత కోల్పోకుండా ఫలితాలు సాధిస్తారు. లక్ష్యసాధన కోసం అహరహం శ్రమిస్తారు. కఠోర శ్రమకు తగిన ఫలితాలను సాధిస్తారు. జీవితంలో గొప్ప పురోగతి సాధిస్తారు. కొత్త బంధం మిమ్మల్ని ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లిస్తుంది. కీళ్లనొప్పులు బాధపెట్టే అవకాశం ఉంది. పని ఒత్తిడి నుంచి కొంత విరామం కోరుకుంటారు.
లక్కీ కలర్‌: ఊదా

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదృష్టం కలిసొస్తుంది. మీ సృజనాత్మకత, కొత్త ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లోను, కార్యాలయంలోను మార్పులు చేపడతారు. ఇతరులకు సాయం చేస్తారు.
లక్కీ కలర్‌: ముదురు పసుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ప్రతి అంశాన్నీ నిశితంగా అధ్యయనం చేస్తారు. అంతులేని జిజ్ఞాసతో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను చాటుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఈ వారం సంప్రదాయ పద్ధతుల్లోనే ముందుకు సాగడం మంచింది. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం క్షేమం. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: ముదురు ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
నాయకత్వ హోదాలో ఉన్నవారితో విభేదాలను విడనాడండి. చిన్న చిన్న గొడవలను తెగే వరకు లాగడం మంచిది కాదు. ఆదాయ వ్యయాలకు మధ్య సమతుల్యత పాటించడానికి ప్రయాసపడతారు. పని ఒత్తిడి ఎక్కువవుతుంది. సహోద్యోగులతో శాంతియుతంగా మెలగడం క్షేమం. చిన్న చిన్న పొరపాట్లను తేలికగా క్షమించడం ద్వారా ప్రశాంతత పొందుతారు.
లక్కీ కలర్‌: తెలుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జీవితం తొలినాళ్లలో ఎదురైన చేదు జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు వికలం చేస్తాయి. ఆర్థిక పరిస్థితి గురించి అనవసరంగా ఆందోళన చెందుతారు. ఇతరులకు దూరంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. షాపింగ్‌ ద్వారా సాంత్వన పొందాలనుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు నారింజ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
నిజాయితీగా వ్యవహరిస్తూ ఆశ్చర్యకరమైన వ్యాపార విజయాలను సొంతం చేసుకుంటారు. ఎలాంటి ప్రతికూలతలనైనా అవలీలగా ఎదుర్కొంటారు. స్థిరాస్తుల వ్యాపారులకు పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. మీ చొరవతో కుటుంబ వ్యాపారానికి గొప్ప పేరు వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ప్రేమికులకు కాలం అనుకూలిస్తుంది.
లక్కీ కలర్‌: ఎరుపు


కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
భావసారూప్యత గల వ్యక్తులతో బంధం బలపడుతుంది. అన్ని సౌకర్యాలూ అందుబాటులోనే ఉన్నా, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి మరింతగా శ్రమించాల్సి వస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటున్న కొద్దీ ఆర్థికలాభాలు పెరుగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణం చేయాల్సి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలకు సానుకూలమైన కాలం.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఆత్మావలోకనం చేసుకుంటారు. ఎక్కువసేపు మౌనంగా ఉండటానికే ఇష్టపడతారు. అందరికీ దూరంగా ఒంటరిగా ఉండటం పరిష్కారం కాదని గ్రహించండి. చిన్న చిన్న లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణలోకి దిగితే ప్రయోజనం ఉంటుంది. యోగసాధనతో సాంత్వన పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో గడ్డు పరిస్థితులు తలెత్తుతాయి. ఆత్మసై్థర్యం కోల్పోకుండా ముందుకు సాగండి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement