టారో : 30 జూలై నుంచి 5 ఆగస్టు 2017 వరకు | Tarot: From 30 July to 5 August 2017 | Sakshi
Sakshi News home page

టారో : 30 జూలై నుంచి 5 ఆగస్టు 2017 వరకు

Published Sat, Jul 29 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

టారో : 30 జూలై నుంచి 5 ఆగస్టు 2017 వరకు

టారో : 30 జూలై నుంచి 5 ఆగస్టు 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. మీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది.
కలిసొచ్చే రంగు: దొండపండు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఇల్లు లేదా ఆఫీసు మారతారు. మారిన చోట ఇంతకన్నా బాగుంటుంది.
కలిసొచ్చే రంగు: లేత పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈ వారం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. మార్పును స్వాగతించండి. మంచి జరుగుతుంది.
కలిసొచ్చే రంగు: ముదురు నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈవారం మీరు మాట్లాడే ప్రతిమాటా నిజం అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఆఫీసులో పనిభారమూ పెరుగుతుంది. పనులు ఆలస్యం అవవచ్చు. పాత ఆలోచనలనే అమలు చేస్తారు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ వెనకాల గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త.
కలిసొచ్చే రంగు: దొండపండు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన ఒక వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. భావసారూప్యత గల ఒక వ్యక్తితో పరిచయం జరుగుతుంది. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుందని తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది.
కలిసొచ్చే రంగు: పసుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి విందుకు ఆహ్వానం అందడం లేదా మీరు ఇవ్వడం జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడతారు. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. మీరు ఎంతో ప్రేమగా, అభిమానంగా చూసుకునే వ్యక్తి మీకు ఎదురు తిరుగుతారు. బాధపడవద్దు.
కలిసొచ్చే రంగు: వంకాయ రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్‌నిక్‌కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మీ ఆలోచనలేమిటో మీరు అన్నది ఈ వారం మీ విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. మీ పని విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకోండి, తటపటాయించకుండా మీ మార్గదర్శిని కలిసి సలహా తీసుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు.

కలిసొచ్చే రంగు: లేత నారింజ
ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఉద్యోగంలో, పనిలో లేదా వృత్తిలో ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు వస్తుంది లేదా మీరు ఆశించిన మార్పును ఆమోదించడానికిది తగిన సమయం. ఈ మార్పు కాలంలో స్నేహితులతో సరదాగా కాసింత సేదతీరడం అవసరం. మొహమాటానికి పోయి మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చుచేశారు. ఇప్పటికైనా వారి నిజస్వరూపం  తెలుసుకోకపోతే నష్టపోతారు. కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవడానికీ ఇది తగిన సమయం.
కలిసొచ్చే రంగు: ముదురు పసుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈ వారం వినోదాత్మకంగా గడుస్తుంది. ప్రత్యేకమైన విందుకు ఆహ్వానం అందుతుంది. పనిలో విసుగు అనిపించినా, తప్పదన్నట్లు చేయవలసి రావడంతో నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు కొంచెం నెమ్మదిగా అందుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. గత∙పెట్టుబడుల నుంచి మంచి లాభాలందుతాయి.
కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మంచి కెరీర్, ఉన్నతమైన ఉద్యోగం లేదా హోదా కావాలనుకున్నప్పుడు కటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. అప్పుడే మీరు జీవితంలో గెలుపొందే అవకాశాలు దక్కుతాయి. గతంలో జరిగిన విషయాల గురించి ఇంకా ఆలోచించడం మాని, కొత్త విషయాలు, ఆర్థిక విషయాల మీద దృష్టిపెట్టండి, మేలు జరుగుతుంది. ఆదాయానికీ, ఖర్చులకూ మధ్య సమతూకం సాధించేందుకు ప్రయత్నించండి. మీ చిరకాల స్వప్నం ఒకటి ఈ వారంతంలో నెరవేనుంది.
కలిసొచ్చే రంగు: తెలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కొత్తవారిని కలుస్తారు. శుభవార్తలు వింటారు. అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి. కీలకనిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కెరీర్‌ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగించే కాలమిది. పెద్ద పని అయినా, యాంత్రికంగా కాక, సృజనతో చేస్తేనే విజయవంతమవుతుందని గ్రహించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కలిసొచ్చే రంగు: మావిచిగురు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement