టారో : 11 జూన్‌ నుంచి 17 జూన్‌ 2017 వరకు | Tarot: from 11 June to 17 June 2017 | Sakshi
Sakshi News home page

టారో : 11 జూన్‌ నుంచి 17 జూన్‌ 2017 వరకు

Published Sun, Jun 11 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

టారో : 11 జూన్‌ నుంచి 17 జూన్‌ 2017 వరకు

టారో : 11 జూన్‌ నుంచి 17 జూన్‌ 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఆర్థిక, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేస్తేనే ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులు ఈ వారం మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతోనూ, సహోద్యోగులతోనూ వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి.
కలిసి వచ్చే రంగు: లేత వంకాయంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
నూతనశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆఫీసులో పనులు చాలా వేగంగా ముందుకు జరుగుతాయి. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి.
కలిసి వచ్చే రంగు: నారింజ

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ వాక్పటిమ, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరిచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. తోటివారితోనూ, ఇరుగు పొరుగుతోనూ  స్నేహంగా మెలుగుతారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. మనసు చెప్పిన మాట విని, దాని ప్రకారం నడచుకోండి. గొంతునొప్పి బాధించవచ్చు. ప్రకృతి చికిత్సతో ఉపశమనం పొందుతారు.
కలిసి వచ్చే రంగు: వెండి

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు కొద్దిపాటి ఆశాభంగం తప్పదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి, కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. ఒకోసారి గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు.

కలిసొచ్చే రంగు: గులాబీ
సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
కలిసి వచ్చే రంగు: ఎరుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఊహాలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. దాంతో పనులు కుంటుపడతాయి. మీ విజ్ఞానంతో, ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరిచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో దూరప్రయాణం చేస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా మీకు స్వాంతన లభిస్తుంది. ప్రేమ ఫలిస్తుంది.
కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
నూతనశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి.
కలిసి వచ్చే రంగు: ఎరుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
 కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్‌ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.

కలిసి వచ్చే రంగు: బూడిద
ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు.  
కలిసి వచ్చే రంగు: ఊదా

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు  పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం.  
కలిసి వచ్చే రంగు: బంగారు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొహమాటం వల్ల మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది.
కలిసి వచ్చే రంగు: తెల్లటి తెలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. వారు చెప్పిన మాట వింటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
కలిసి వచ్చే రంగు: గోధుమ రంగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement