Maranam Telugu Movie: ఆత్మలను బంధిస్తే...  | Maranam Movie Going To Release On April 30 | Sakshi
Sakshi News home page

Maranam Telugu Movie: ఆత్మలను బంధిస్తే... 

Published Wed, Apr 28 2021 8:02 AM | Last Updated on Wed, Apr 28 2021 5:17 PM

Crime Story Movie Going To Release On April 30 - Sakshi

వీర్‌సాగర్, శ్రీ రాపాక, మాధురి ప్రధాన పాత్రల్లో వీర్‌ సాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మరణం’. ‘కర్మ పేస్‌’ అనేది ఉపశీర్షిక. బి. రేణుక సమర్పణలో ఓషియన్‌ ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలయింది. వీర్‌ సాగర్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగులో హారర్‌ చిత్రాలకి మంచి క్రేజ్‌ ఉంది. సరికొత్త కథ, కథనంతో, అద్భుతమైన విజువల్స్‌తో, గొప్ప సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో ఒక హారర్‌ చిత్రం వస్తే ఎలా ఉంటుందంటే మా ‘మరణం’లా ఉంటుంది’’ అన్నారు. ‘‘వీర్‌ సాగర్‌ ఈ చిత్రంలో డెమనాలజిస్ట్‌ (ఆత్మలను బంధించే శాస్త్రవేత్త)గా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేవీ వరం, సంగీతం: మనోజ్‌ కుమార్‌.

ఓ అమ్మాయి నేర కథ 
జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘ఆది’ ఫేమ్‌ కీర్తీ చావ్లా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ అమ్మాయి క్రైమ్‌స్టోరీ’. జి. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. సాధిక, ఆదీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్‌ రాజు, నిళల్‌గళ్‌ రవి ముఖ్య పాత్రల్లో నటించారు. ఏబీ శ్రీనివాస్, ఆర్‌. సుందర్, శ్రీధర్‌ పోతూరి, శాకముద్ర శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. నిర్మాతల్లో ఒకరైన ఏబీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్‌ చిత్రమిది. ఓ అమ్మాయి నేర కథాంశంతో నిర్మించాం. హారర్‌ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్, రొమాంటిక్‌ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గతంలో విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement