
సాక్షి, బెంగళూరు : హర్రర్ చిత్రంలో నటించిన ఓ నటుడు ఆ సినిమాను చూస్తూ విచిత్రంగా ప్రవర్తించాడు. ఈ ఘటన శుక్రవారం బెంగళూరులోని మెజస్టిక్ సమీపంలోని మేనక థియేటర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... దర్శకుడు సత్యసామ్రాట్ ‘గాయత్రి’ పేరుతో హర్రర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విజి (30) అనే నటుడు దెయ్యం సీన్‌లో నటించాడు. నిన్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాను విజి మేనక థియేటర్‌లో చూస్తూ ఒక్కసారిగా హాల్‌లో నుంచి బయటకు వచ్చి బాల్కనీ నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని థియేటర్ యాజమాన్యం కేసీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా విజి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనతో థియేటర్ యాజమాన్యం చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. అయితే విజి ఎందుకు అలా ప్రవర్తించాడనే దానిపై స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment