
సమంత
నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు సమంత. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కామెడీ, లవ్ స్టోరీలు.. ఇలా అన్ని జానర్లలో ఆడియన్స్‌కి వినోదం పంచారామె. కానీ పూర్తి స్థాయి హారర్ సినిమాలో కనిపించలేదు సమంత. తాజాగా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇది హారర్ సినిమా అని సమాచారం. తమిళ నటుడు, స్నేహ భర్త ప్రసన్న ఇందులో కీలక పాత్ర చేస్తున్నారట. ‘‘ఇది కేవలం హారర్ సినిమా మాత్రమే కాదు, అంతకు మించి’’ అని పేర్కొన్నారు సమంత. మార్చి నెలలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేస్తారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment