
సమంత
‘ఓ బేబీ’ సూపర్ సక్సెస్ తర్వాత ‘96’ తెలుగు రీమేక్‌లో నటించారు సమంత. శర్వానంద్, సమంత జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ఓ బేబీ’ తర్వాత ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో కనిపించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుందట. నయనతారతో ‘మాయ’, తాప్సీతో ‘గేమ్ ఓవర్’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెరకెక్కించారు అశ్విన్ శరవణన్.
ఈ రెండు సినిమాలు థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగాయి. మరి సమంత నటించబోయే సినిమా కూడా థ్రిల్లర్ జానర్‌లోనే ఉంటుందా? చూడాలి. సమంతకు తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఇది ద్విభాషా చిత్రంగానూ రూపొందే అవకాశముంది. సమంత తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘యు టర్న్’ కూడా థ్రిల్లరే. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు సమంత. ఈ సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారామె.
Comments
Please login to add a commentAdd a comment