
సమంత, నయనతార
లేడీ సూపర్‌స్టార్ నయనతార, సూపర్‌స్టార్ సమంత కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. వీళ్లద్దరూ కలసి లేడీ ఓరియంటెడ్ సినిమా ఏమైనా చేస్తున్నారా? అంటే కాదు. విజయ్ సేతుపతి నటించనున్న తమిళ సినిమాలో సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తారట. దర్శకుడు, నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘కాదు వాక్కుల రెండు కాదల్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను సెవన్ స్క్రీన్ బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మించనున్నారట. సమంత, నయనతార కలసి నటించే వార్త నిజమైతే కచ్చితంగా ఇది సూపర్ కాంబినేషన్.